సముద్రంలో కూలిన విమానం.! 188 మంది గల్లంతు.!
ఏ సమయానికి ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు,విమానం లో ప్రయాణం సురక్షితమే అయినా, ప్రమాదం సంభవిస్తే ప్రాణాలు మిగలడం కష్టం, తాజాగా ఇండోనేషియా లో విమానం గల్లంతైంది . జకార్తా నుంచి టేకాఫ్ అయిన 13 నిమిషాలకే విమానం కనిపించకుండా పోయింది. రాడార్‌తో సంబంధాలు తెగిపోవడంతో సముద్రంలో కూలిపోయిందని అందరు భావిస్తున్నారు.
లయన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం పంగకల్ పిన్నాంగ్కు వెళ్లాల్సి ఉంది. ఇందులో మొత్తం 188 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. వారిలో ఎంత మంది బ్రతికి ఉన్నారో తెలియదు?. జావా సముద్రంలో ప్రయాణికుల వస్తువులు, విమాన విడిభాగాలు కనిపించడంతో విమానం కూలిందన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. దాంతో విమాన శిథిలాల కోసం గాలింపు చర్యలు ముమ్మరమయ్యాయి.
విమానాలు గల్లంతు అవ్వడం కొత్త ఏమి కాదు, కానీ గల్లంతు అయిన ప్రతి సారి,ప్రమాదానికి గురి అవుతున్నాయి, ప్రమాదానికి గురి అయిన విమానాలలో బ్రతికి బయట పడిన వారి సంఖ్య చాలా తక్కువ, నడి సముద్రం లో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతూ ఉండటం తో ప్రాణాలతో బ్రతికి బయట పడటం చాల కష్టం.
నెల క్రితం మైక్రోనేషియా అనే దేశం లో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది, సముద్రం లో కుప్ప కూలిన విమానం ఒడ్డు కి దేగ్గర్లోనె ఉండటం తో సహాయక చర్యలు చేపట్టి ప్రయాణికులు మరియు సిబ్బంది ని రక్షించ గలిగారు,రన్ వే పైన ల్యాండ్ అవ్వాల్సిన విమానం, రన్ వే ని దాటేసి సముద్రం లో ల్యాండ్ అయింది.
Tweet:
https://twitter.com/Sutopo_PN/status/1056776208665370624
Post a Comment