Header Ads

మీరు వీధి జంతువులకి తిండి పెడుతున్నారా,ఐతే ఈ 10 పద్ధతులు తప్పక పాటించండి.

2016 వాషింగ్టన్ పోస్ట్ నివేదిక ప్రకారం మన భారత దేశం లో సుమారు 3 కోట్లకు పైగా వీధి కుక్కలు ఉన్నాయి,ఇప్పుడు ఆ లెక్క గణనీయంగా పెరిగి ఉండొచ్చు. వీధి జంతువులకి సరైన ఆహారం అంధక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయి. మారే జీవన శైలి ప్రకారం ఒక అప్పుడు తో పోలిస్తే నేడు చాల మంది జంతువులను పెంచుకుంటున్నారు.  అయితే ఇప్పడు విపరీతంగా వీధి కుక్కలు మన దేశంలో ఉన్నాయి. వాటికి మీరు తిండి పెడితే ఈ సమాచారం మీకోసం



మీరు వీధి జంతువులకి తిండి పెడుతున్నారా,ఐతే ఈ 10 పద్ధతులు తప్పక పాటించండి.


1) ఒక స్థలాన్ని ఎంచుకొని అక్కడే వాటికి ప్రతి రోజు ఆహారం పెట్టండి. ఒక వేళా మీరు వేరే జంతువులని పెంచుకుంటున్నట్టు ఐతే, ఆ స్థలం మీ ఇంటికి కొంచెం దూరంగ ఉండేట్టు చూసుకోండి,లేకపోతే మీ ఇంటికి దేగ్గర్లో ఉండే స్థలాన్ని ఎంచుకోండి

2)వాటితో మంచిగా మెలగండి , వాటికీ వాక్సిన్ వేపియడం మరవకండి,

3)ఉడకపెట్టిన తిండి పదార్థాలు పెట్టడానికి ప్రయత్నించండి, ఎక్కువ కారం మరియు నూనెలో వేయించిన తిండి పదార్థాలను పెట్టకండి.

4) వీధి జంతువులకి తిండి పెట్టడానికి పలు స్వచ్చంధ సంస్థలు ఉన్నాయ్ . వాటి బాగోగులు చూసుకోడానికి జంతు సంరక్షక సంస్థలు ముందుకు వచ్చాయి.

5)ఏవి పడితే అవి పెట్టకండి , మనం పెట్టె ఆహరం వల్ల వాటికీ రోగాలు సంభవించొచ్చు,జంతువులకి ఆహారం పెట్టె ముందు,ఆహ్ ఆహారం వాటికీ తగినదా కాదా తెలుసుకోవాలి

6) జంతువులు గుంపులుగా ఉన్నప్పుడు వాటికీ ఆహారం పెట్టకండి .ఆహారం కోసం ఘర్షణకు పాల్పడి గాయాల పాలవుతాయి,వీలైనంత వరకు జంతువులు గుంపుగా ఉన్నప్పుడు ఆహారం పెట్టకపోడం ఉత్తమం

7) ఆహారం పెట్టిన వెమ్మట త్రాగు నీరు అందించండి .ఆహారం పెట్టిన వేళనే కాకుండా మాములు సమయములలో కూడా త్రాగు నీరు అందించడానికి ప్రయత్నించండి

8) జనసంఖ్య ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో మరియు చిన్న పిల్లలు ఆడుకొనే స్థలములలో ఆహారం పెట్టడం అలవాటు చేయకండి

9) అమితంగాను మరియు తక్కువగాను వాటికీ తిండి పెట్టకండి,తగినంత మోతాదులో తిండి పెట్టండి

10) పాలు పోసే సమయం లో జాగ్రత్తగా ఉండండి,జంతువులకి పాల వాళ్ళ వామిటింగ్స్ మరియు గ్యాస్ట్రిక్ ఇబ్బందులు సంభవించొచ్చు,కనుక పాలు తాపే సమయంలో జాగ్రత్త వహించండి

ఈ 10 జాగ్రత్తలు పాటిస్తూ వీధి జంతువులకి ఆహారం తినిపిస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు,ఇవే కాకుండా జంతువులు అనారోగ్యాంగా ఉన్నప్పుడు జంతు వైద్య డాక్టర్ని సంప్రదించి వాటికి చికిత్స చేపించండి,వీధి జంతువులు అనగా చాల వరకు కుక్కలు మరియు పిల్లులే ఉంటాయి,కనుక ఒకే సరి ఆహ్ రెండిటికి తిండి తినిపియ్యకండి

No comments