Header Ads

మీ శుభలేఖ పంపండి , పట్టు వస్త్రాలు పొందండి . సినిమా ప్రమోషన్ కోసం దిల్ రాజు కొత్త ఐడియా

పెళ్లి’ పవిత్రత గురించి, దాంపత్య బంధంలోని తీయదనం గురించి చెప్పే సినిమాలు తెలుగునాట అనేకం వచ్చాయి. కొన్ని సూపర్ హిట్స్ అయ్యాయి, కొన్ని క్లాసిక్స్ అయ్యాయి. ఎన్ని సినిమాలు వచ్చినప్పటికీ ‘పెళ్ళి’ కాన్సెప్ట్ రిలేటెడ్ సినిమాలు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతాయి . ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. ఈ పరంపరలో మరో పెళ్లి సినిమా వస్తోంది. అదే ‘శ్రీనివాస కల్యాణం’.ఇది వరకూ ఇదే టైటిల్‌తో వచ్చిన వెంకటేష్, భానుప్రియల సినిమా సూపర్ హిట్ అయ్యింది. దశాబ్దాల తర్వాత ఆ టైటిల్ రిపీట్ అవుతోంది. ఈ సారి నితిన్, రాశీ ఖన్నాలు హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. సతమానంభావతి లాంటి గొప్ప సినిమా తీసిన సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ వారంలోనే విడుదల కానుంది.
ప్రముఖ నిర్మాత దిల్‌రాజు శ్రావణ మాసంలో పెళ్లి చేసుకోబోతున్న జంటలకు సర్‌ప్రైజ్‌ న్యూస్‌ చెప్పారు. నితిన్‌ కథానాయకుడిగా ఆయన నిర్మించిన సినిమా ‘శ్రీనివాస కల్యాణం’. ఇద్దరు వ్యక్తుల్ని, కుటుంబాల్ని ఒక్కటి చేసే వివాహం విలువను తెలుపుతూ ఈ సినిమాను తెరకెక్కించారు. మిక్కీ జే మేయర్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఆగస్ట్‌ 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రాజేంద్ర ప్రసాద్, గిరిబాబు, ఆమని, జయసుధ, నరేశ్‌, సితార తదితరులు ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.

అయితే కాబోయే దంపతులకు కానుకలు ఇవ్వాలని దిల్‌రాజు నిర్ణయించుకున్నారట. ‘శ్రావణ మాసంలో కల్యాణం జరుపుకుంటున్న వారు మీ శుభలేఖలు మాకు పంపిస్తే ఆ జంటలకు పట్టు వస్త్రాలు పెట్టాలని సంకల్పించాం’ అంటూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ నిర్మాణ సంస్థ సోషల్‌మీడియాలో పేర్కొంది. వీరిలో కొందరిని ఎంపిక చేసి ‘శ్రీనివాస కల్యాణం’ బృందంతో మాట్లాడే అవకాశం కల్పించనున్నట్లు తెలిపింది. ప్రత్యక్షంగా కలవలేని వారికి చిరు కానుకను ఇంటికి పంపాలని భావిస్తున్నామని చెప్పింది.
ఏంటి ఇదేదో.. ఫోన్‌కొట్టు పట్టుచీర పట్టు లాంటి ప్రోగ్రామ్‌ అనుకుంటున్నారా? ఇది అలాంటి కాన్సెప్ట్‌ కాదులేండి. అచ్చమైన తెలుగుదనాన్ని చూపిస్తూ.. పెళ్లి వైభవాన్ని వెండితెరపై ఆవిష్కరించబోతోన్న ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా నిర్మాత దిల్‌ రాజు పెట్టిన కాంటెస్ట్‌. ఈ సందర్భంగా సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ చేసింది చిత్ర బృందం.

శ్రావణ మాసంలో పెళ్లి జరుపుకుంటున్న జంటలు తమ శుభలేఖలు పంపిస్తే.. ఆ జంటలందరికీ పట్టు వస్త్రాలు పెట్టాలని సంకల్పించినట్టు తెలిపారు. ఇలా అందులోంచి కొందరిని ఎంపిక చేసి.. శ్రీనివాస కళ్యాణం బృందంతో మాట్లాడే వీలును కల్పించనున్నట్లు ప్రకటించారు. మరి శ్రావణ మాసంలో పెళ్లి చేసుకునే వారంతా.. వారి శుఖలేఖలు పంపించి.. పట్టువస్త్రాలను పొందండి. ప్రత్యక్షంగానైనా కలవచ్చు లేక పోస్ట్‌లోనైనా పంపొచ్చు అని పేర్కొన్నారు.

ఈ సినిమాలో పెళ్లి సీన్లు హైలెట్ అవుతాయని యూనిట్ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. పెళ్లి సీన్లే ఈ సినిమాకు ప్రాణమని కూడా చెబుతున్నారు. కుటుంబకథా చిత్రమని, అందరినీ ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. సినిమా విజయం పట్ల నిర్మాత దిల్ రాజు పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ‘పెళ్లి’ కాన్సెప్ట్‌తో ఈ సినిమా హిట్ కొడితే.. విజయ పరంపరను కొనసాగిస్తున్నట్టే. రెండేళ్ల కిందట నందినీ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘కల్యాణ వైభోగమే’ పెళ్లి కాన్సెప్ట్‌తో హిట్ కొట్టింది. ఆ తర్వాత ఇప్పుడు నితిన్ సినిమా లక్‌ను పరీక్షించుకోబోతోంది. ఆగస్టు తొమ్మిదో తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది.

ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి ఎవరైతే ఈ సీజన్ లో పెళ్లి చేసుకోబోతున్నారో వాళ్ళ శుభలేఖ కనక టీమ్ కు ఈ మెయిల్ చేస్తే అందులో నుంచి కొన్ని జంటలను ఎంపిక చేసి సినిమా నటీనటులతో మీటింగ్ లాంటిది ఏర్పాటు చేసి అక్కడ పట్టు వస్త్రాలు బహూకరిస్తారట. ఒకవేళ ఎంపిక కాకపోతే ఎలా అనే దిగులు వలదు. మిగిలిన వారికి అడ్రెస్స్ కు కొరియర్ రూపంలో పట్టు వస్త్రాలు నేరుగా ఇంటికి వచ్చేస్తాయి. ఇదేదో బాగుంది.

లక్కీగా తగిలితే నితిన్ రాశిఖన్నాలతో పాటు యూనిట్ అందరి మధ్య కూర్చుని బట్టలు తీసుకోవచ్చు. కాకపోయినా పైసా ఖర్చు లేకుండా నేరుగా ఇంటికే వస్తాయి. అయితే ఎన్ని జంటలకు ఈ అవకాశం అనేది మాత్రం బయటికి చెప్పలేదు. ఇప్పటికే వందల్లో కిట్స్ రెడీ చేసి ఉంచారు. వీటికి స్పాన్సర్ గా కెఎల్ ఎం షాపింగ్ మాల్ వ్యవహరిస్తోంది. ప్రతి బాక్సు మీద శ్రీనివాస కళ్యాణం లోగోతో పాటు ఈ సంస్థ ఎంబ్లెమ్ ను హై లైట్ చేసారు. సో ఉభయ తారకంగా అటు బట్టల సంస్థ అడ్వర్టైజింగ్ తో పాటు సినిమా ప్రమోషన్ ను ఏకకాలంలో చేసే ఈ ప్లాన్ ఏదైతే ఉందొ నిజంగా మెచ్చుకోదగ్గదే. వీటితో పాటు మరో రెండు న్యూస్ ఛానెల్స్ ఓ ఈవెంట్ మానేజ్మెంట్ సంస్థలు కూడా ఈ గిఫ్ట్ పార్టనర్స్ గా ఉన్నాయి.

No comments