రైలు లో ఎక్కువ లగేజీ తీసుకెళ్తున్నారా ? అయితే ఈ రోజు నుంచి మీ టికెట్ కి ఆరింతలు జరిమానా కట్టాల్సిందే
రైలు లో ప్రయాణించే ప్రయాణికులారా మీకు ఒక ముఖ్యమైన సమాచారం. ఇకపై మీ వెంట తీసుకెళ్లే సామాన్ల (లగేజీ) బరువుపై జాగ్రత్తగా కన్నేయండి. పరిమితికి మించి లగేజీని వెంట మోసుకెళ్తే.. జరిమానా మోతెక్కిపోక తప్పదు! ఈ మేరకు సామాన్ల బరువుకు సంబంధించిన నిబంధనలను పక్కాగా అమలు చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది.
అదనపు లగేజీతో బోగీలు నిండిపోతున్నాయని.. ఫలితంగా ప్రయాణికులకు తీవ్ర ఇక్కట్లు ఎదురవుతున్నాయని ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో రైల్వేవర్గాలు ఈ అంశంపై దృష్టిసారించాయి. సామాన్లకు సంబంధించి దాదాపు మూడు దశాబ్దాల క్రితమే రూపొందించుకున్న నిబంధనలను ఇకపై కఠినంగా అమలు చేయాలని నిర్ణయించాయి. ఈ నిబంధనల ప్రకారం.. పరిమితికి మించిన బరువులను వెంట తీసుకెళ్లే ప్రయాణికులకు సదరు లగేజీ టికెట్ ధరకు ఆరు రెట్ల మొత్తాన్ని జరిమానాగా విధిస్తారు.
ప్రస్తుతం స్లీపర్ క్లాస్ ప్రయాణికులు : 40 కిలోల సామాన్లను తమతో పాటు ట్రైన్ లో తీసుకుని వెళ్ళవచ్చు ,
సెకండ్ క్లాస్ ప్రయాణికులు : 35కిలోల లగేజీని తమతో పాటు ట్రైన్ లో తీసుకుని వెళ్ళవచ్చు,
ఫస్ట్/టైర్2 ఏసీ క్లాస్ ప్రయాణికులు : 50కేజీలు లగేజీని తమతో పాటు ట్రైన్ లో తీసుకుని వెళ్ళవచ్చు,
ఫస్ట్ ఏసీ ప్రయాణికులు : 70కేజీల వరకు లగేజీని ఉచితంగా తమ వెంట తీసుకుని వెళ్ళవచ్చు,
గరిష్ఠ పరిమితి తర్వాత కూడా నిర్ణీత అదనపు ఛార్జితో మరింత లగేజీని తీసుకెళ్లొచ్చు.
సెకండ్ క్లాస్ ప్రయాణికులు : 70కేజీల సామాన్లను,
స్లీపర్ క్లాస్ 80కేజీలు,
ఏసీ 3టైర్/ఏసీ చైర్ కార్ ప్రయాణికులు 40కేజీలు,
ఫస్ట్ క్లాస్/ ఏసీ టైర్2 ప్రయాణికులు 100కేజీలు,
ఫస్ట్ ఏసీ ప్రయాణికులు 150కేజీల దాకా గరిష్ఠంగా లగేజీని తీసుకెళ్లే సదుపాయం ఉంది.
ఈ అదనపు సామానును అంతా నిర్దేశిత బోగీలో ఉంచాల్సి ఉంటుంది. ఇది ఇలావుంటే రైల్వే అధికారులు తక్కువ లగేజీ చాల శ్రేయస్కరం అంటున్నారు , ఎందుకంటే వీలైనంత వరకూ తక్కువ లగేజీతో ప్రయాణించడం మంచిది. బెర్త్ కింద భద్రపరుచుకున్న లగేజీని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. దొంగతనం జరగకుండా ఉండటానికి తక్కువ ఆస్కారం ఉంటుంది తక్కువ లగేజీ ఉంటే.

ప్రస్తుతం ఉన్ననియమాలు ఇవే ::

అయినప్పటికీ లగేజీ కి డబ్బులు టికెట్ కౌంటర్ లో కడితే రైల్వే ఈ కింద విధంగా అనుమతిస్తోంది :

Post a Comment