Header Ads

ఇక మీ ఆధార్ కార్డు అడ్రస్ ని మీ ఇంట్లో నుంచే మార్చుకోవచ్చు , వివరాలు ఇవే

ఆధార్ అనేది 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య,ఇది భారతదేశ నివాసితులు వారి బయోమెట్రిక్ మరియు జనాభా డేటా ఆధారంగా దీనిని పొందవచ్చు.ఈ డేటాను యునిక్ ఐడెంట్టిఫికెషన్ అధారిటి ఆఫ్ ఇండియా(యుఐడిఏఐ) సేకరించడం జరుగుతుంది. ఇది భారత ప్రభుత్వంచే జనవరి 2009 లో స్థాపించబడిన ఒక చట్టబద్ధమైన అధికారం పరిధిలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ఆధార్ చట్టం 2016 యొక్క నిబంధనలను అనుసరిస్తుంది.
ఆధార్ ప్రపంచంలో అతిపెద్ద బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థ. మన భారతదేశం లో ఉపాధికోసం కోసం కాని , సొంత ఇల్లు లేక అద్ది ఇంట్లో ఉండే వాళ్ళు పలు ప్రాంతాలకు తిరుగుతూ ఆధార్‌లో అడ్రస్‌ మార్చుకోలేక ఇబ్బందిపడుతున్న విషయం మన అందరికి తెలిసిందే . మన దేశ ప్రజలకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడిఎఐ) శుభవార్త తెలిపింది. అది ఏంటి అంటే వచ్చే సంవత్సరం అంటే 2019 జనవరి నుంచి ఆధార్‌ కేంద్రాలకు వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని ఆన్‌లైన్‌ ద్వారా తమ ఆధార్‌కార్డులోని అడ్రస్‌ను మార్చుకోవచ్చని తెలిపింది. ఇందుకోసం లేఖ ద్వారా ప్రత్యేకమైన పిన్‌ జారీ చేస్తామని పేర్కొంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలకు ఆధార్‌ ముఖ్యమన్న సంగతి విదితమే.

ఈ నేపథ్యంలో ఉద్యోగంలో భాగంగా వేర్వేరు ప్రాంతాలకు బదిలీ అవుతున్న వారు, ఉపాధి కోసం మరోప్రాంతానికి వెళ్లి స్థిరపడ్డవారు ఆధార్‌ కార్డులో అడ్రస్‌ మార్పుకు తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తోంది. సాధారణంగా ఆధార్ లో మన ఇంటి చిరునామా మార్చాలి అంటే మన డ్రైవింగ్ లైసెన్స్ , మూడు నెలల గ్యాస్ బుకింగ్ చేసినవి , గ్యాస్ బుక్ ఇవన్ని తీసుకెళ్తే గాని మార్చరు . దీనితో మూడు నెలలు వరుకు ఆగి ఆ తరువాత ఆధార్ లో ఇంటి చిరునామా మార్చడానికి చాల సమయం పడుతుంది.

ఈ విషయం ఎక్కువ మంది ఫిర్యాదు చేయడం వల్ల యునిక్ ఐడెంట్టిఫికెషన్ అధారిటి ఆఫ్ ఇండియా(యుఐడిఏఐ)  వారు బ్యాంకులు తమ ఖాతాదారులకు డెబిట్‌, క్రెడిట్‌ కార్డు పిన్‌ నంబర్లను లేఖలో ఇచ్చినట్లు ప్రత్యేకమైన పిన్‌ను సంబంధిత వ్యక్తులు కోరుకున్న అడ్రస్‌కు పంపిస్తామని యుఐడిఎఐ వెల్లడించింది. అడ్రస్‌ మార్పులుచేర్పుల కోసం తమకు పిన్‌ పంపాలని ప్రజలు యుఐడిఎఐని కోరవచ్చని ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి తెలిపారు. ఆన్లైన్ లో ఇక మీరు మీ కొత్త ఇంటి అడ్రస్ ఎంటర్ చేసి పిన్ జెనరేట్ అవుతుంది . అది మీ కొత్త ఇంటికి పోస్ట్ ద్వారా వస్తుంది . మళ్ళి ఆన్లైన్ లో మీ ఆధార్ ఖాతా ఓపెన్ చేసి ఇంటికి వచ్చిన పిన్ ఎంటర్ చేస్తే మీ అడ్రస్ ఇక ఆధార్ లో మారుతుంది .

ఈ ప్రాజెక్టును వచ్చే ఏడాది జనవరిలో ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామని, ఫలితాలను పరిశీలించి అదే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి తెస్తామని పేర్కొన్నారు. భారత నివాసులందరికి ఆధార్ గుర్తింపు సంఖ్యను ఇచ్చి ఆ సంఖ్య ఎక్కడైనా , ఎప్పుడైనా అధీక్రుతము చేసుకొనే విధంగా అవకాశాన్ని కల్పించడం యు.ఐ.డి.ఎ.ఐ ముఖ్య ఉద్దేశ్యం. ఆధార్ ఫ్లాట్ ఫారం నివాసుల యొక్క గుర్తింపును త్వరితగతిని సులభంగా అయ్యేటట్టు సర్వీస్ ప్రొవైడర్స్ కు సహాయపడుతూ సంక్షేమ పధకాల సేవలను సమర్ధ వంతముగా తక్కువ ఖర్చుతో కొనసాగించడానికి దోహదపడుతుంది.

1 comment: