Header Ads

మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ కలుషితమైన నగరాలు ప్రకటించిన కేంద్రం

కాలుష్యం అనేది రసాయనిక పదార్ధాలు లేదా ధ్వని, వేడిమి లేదా కాంతి శక్తి వంటి శక్తి రూపాలలో ఉండవచ్చు. కలుషితాలు, కాలుష్య కారక పదార్ధాలు, విదేశీ పదార్ధాలు లేదా శక్తులు లేదా సహజ సిద్దమైనవి . సహజ విధంగ లభిస్తున్నప్పుడు వాటి సహజ స్థాయి కన్నా ఎక్కువగా ఉంటే అప్పుడు కలుషితాలుగా గుర్తించబడతాయి.
ఇప్పటికే ప్రపంచం లో కాలుష్యం ఎక్కువున్న దేశాల్లో ఒకటి మన దేశం . కాలుష్యానికి ప్రధానమైన కారణం బొగ్గు ఉపయోగించటమే . ఇప్పటికీ 24 గంటల విద్యుత్తుని అన్ని పట్టణాలూ పల్లెలకు సరఫరా చెయ్యలేకపోతున్నాయి మన ప్రభుత్వాలు. కోట్లమంది యువతకు ఉద్యోగాలను కల్పించడమూ ఇక్కడ సమస్యే. ఈ కారణాల వల్ల బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలను భారత్‌ మూసెయ్యడం అసాధ్యం. కానీ కాలుష్య నివారణ చట్టాలను కఠినంగా అమలు చేసి, వాతావరణంలోకి రసాయనాలను విడుదలచేసే పరిశ్రమల పనిపట్టొచ్చు. కరెంటుతో నడిచే మెట్రో రైళ్లు కాలుష్యాన్ని బాగా తగ్గిస్తాయి.

మన దేశం మొత్తం లో కేవలం 23 రాష్ట్రాల్లో మాత్రమే కాలుష్యం ఎక్కువ ఉంది అని , ఆ 23 రాష్ట్రాల్లో 102 న‌గ‌రాలు మాత్రం అత్యంత కాలుష్యంతో ఉన్నా‌య‌ని .అందులో తెలుగు రాష్ట్రాల్లో 8 ఉన్నా‌య‌ని పేర్కొంది. దీంతో క‌లుషిత ప్రాంతాలుగా గుర్తించిన న‌గ‌రాల్లో కాలుష్య నియంత్ర‌ణ‌కు త‌గిన ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌ని ఆయా రాష్ట్ర కాలుష్య నియంత్ర‌ణ మండ‌ళ్ల‌ను ఆదేశించింది.

ఇక మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కాలుష్యం గురించి చెప్పాలి అంటే , మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని ఈ నగరాలు కాలుష్యం అధికంగా ఉన్న‌ట్లు కేంద్రం వెల్ల‌డించింది

 1. గుంటూరు,

 2. క‌ర్నూ‌లు,

 3. నెల్లూ‌రు,

 4. విశాఖ‌పట్నం

 5. విజ‌య‌వాడ‌

మన తెలంగాణ రాష్ట్రం లోని ఈ నగరాలు కాలుష్యం అధికంగా ఉన్న‌ట్లు కేంద్రం వెల్ల‌డించింది

 1. హైద‌ర‌బాద్‌,

 2. న‌ల్గొండ‌,

 3. ప‌టాన్ చెరు

మీరు ఈ నగరాల్లో ఉంటే మీరు మీ వంతుగా ఈ కింద చెప్పినవి తప్పకుండా పాటించండి : • మీ ఇంటి పక్కన ఎక్కువ మొక్కలు ఉండేటట్టు చూసుకోండి ,

 • వీలైనన్ని మొక్కలు నాటండి , వేరే వాళ్ళతో కూడా నాటించండి.

 • ఇళ్లనుంచి విడుదలయ్యే కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రధాన ప్రత్యామ్నాయం కట్టెల పొయ్యి వాడకాన్ని తగ్గించడమే.

 • చాలామంది వీధి చివర ఉన్న దుకాణానికెళ్లడానిక్కూడా బైక్‌ తీసేస్తారు. దానికి బదులు సరదాగా నడుచుకుంటూనో సైకిల్‌ మీదో వెళ్తే కాలుష్యాన్ని కొంతలో కొంత తగ్గించడంతో పాటు వ్యాయామమూ అవుతుంది.

 • వీలైనంత వరకూ ఆఫీసులకు దగ్గరగా ఇళ్లు తీసుకుని ఉండడం మేలు. కుదరదనుకుంటే ఇద్దరు ముగ్గురు కలిసి ఒకే కార్లో వెళ్లొచ్చు. బస్సులూ రైళ్లను ఉపయోగించుకుంటే ఇంకా మంచిది.

 • ట్రాఫిక్‌ సిగ్నళ్లలో పావుగంట సిగ్నల్‌ పడినా కొంతమందికి మోటారు వాహనాల ఇంజిన్‌ ఆపే అలవాటుండదు. కానీ అలా ఆపడం వల్ల కాలుష్యాన్ని తగ్గించుకోవచ్చు, ఇంధనమూ ఆదా అవుతుంది.

 • ఫ్యాన్లూ లైట్లతో పాటు ఇంట్లోని ఎలక్ట్రానిక్‌ వస్తువులతో పని పూర్తవగానే కట్టేయడం మంచి పద్ధతి. ఎంత విద్యుత్తును ఆదా చేస్తే వాతావరణ కాలుష్యం అంత తగ్గుతుంది. ఒక్క విద్యుత్తు వృథా కారణంగానే ప్రపంచవ్యాప్తంగా యాభైమెట్రిక్‌ టన్నుల కార్బన్‌డయాక్సైడ్‌ గాల్లోకి విడుదలవుతోంది.

 • ఏసీలూ ఫ్రిజ్జులూ కూలర్లూ విడుదల చేసే క్లోరోఫ్లోరో కార్బన్లు ఓజోన్‌ పొరకు చిల్లు పెడుతున్నాయి. విద్యుత్తుని తక్కువ ఉపయోగించుకునే పరికరాలూ యంత్రాలను కొనడం కూడా మంచి ప్రత్యామ్నాయం.

1 comment:

 1. Sai Ram Prasad Nakka4 August 2018 at 21:49

  Controlling Pollution Government should encourage Terrace Gardening because open place in cities are not available due to heavycost.

  ReplyDelete