కొన్ని ఉల్లిపాయలు తెల్లగా, ఇంకొన్ని ఎర్రగా ఉంటాయెందుకు? ఎందులో పోషక విలువలు ఎక్కువ?
సాధారణం వంటకాలలో వినియోగించే ఉల్లిపాయ శాస్త్రీయ నామము ఆలియమ్ సీపా. వెల్లుల్లి కూడా ఇదే ప్రజాతికి చెందినది. ఉల్లిపాయను సంస్కృతంలో పలాండు అని, హిందీలో ప్యాజ్ అని, ఇంగ్లీషులో ఆనియన్ అని అంటారు. తెలుగులో దీనిని ఉల్లిపాయ లేదా ఉల్లిగడ్డ అంటాము. నిజానికి దీనిని నీరుల్లిపాయ అనడం సరైనది. నీటి వసతి ఉన్న ప్రదేశాలన్నింటిలోనూ, వర్ష రుతువులోనూ దీనిని సాగు చేస్తారు.ఉల్లి చేసే మేలు తల్లి కుడా చేయదనే సామెత ఉన్నది .
ఉల్లి పాయ వెనక దాదాపు 5000 ఏళ్ళ చరిత్ర ఉంది. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి . ఇది ఆసియాలో పుట్టిందని కొందరంటే ... పాకిస్తాన్ లో పుట్టిందని కొందరంటారు. ఇప్పుడు అన్ని దేశాల్లో ఉల్లి పండుతుంది . పచ్చి ఉల్లి మంచి ఊఫ్రొడయజిక్ గా పనిచేయును . ఎన్నో హార్మోన్ల గుణాలు ఉల్లి రసంలో ఉన్నాయి. టేస్తోస్తేరాన్ , ఇన్సులిన్ , గ్రౌత్ హార్మోన్ , ఆక్షితోసిక్ వంటి లక్షణాలు ఉన్నాయి., పచ్చి ఉల్లి ఎక్కువగా తింటే గుండె మంట వస్తుంది . దీనిలో గంధకం పాలు ఎక్కువగా ఉంటుంది కావున కోసేటప్పుడు కళ్ళల్లో నీళ్లు వస్తాయి . ఉల్లిలో కేలరీలు శక్తి ఎక్కువ .. వేయిస్తే ఈ శక్తి విలువ ఇంకా పెరుగుతుంది . ఉల్లిని అన్ని కూరలలోలో వాడుతారు . విందు భోజనాల్లో ఉల్లి పెరుగు చట్ని తప్పని సరిగా ఉంటుంది .
ఉల్లి ఈ కింద రకాలు గా ఉంటాయి ::
కొన్ని ఉల్లిపాయలు తెల్లగా, ఇంకొన్ని ఎర్రగా ఉంటాయెందుకు? ఎందులో పోషక విలువలు ఎక్కువో తెలుసుకుందాం :
తెలుపు, ఎరుపు ఉల్లిపాయలు రెండింటిలోనూ ప్లావనాయిడ్ క్వెరసిటిన్ ఉంటుంది. ఇది ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల ఉల్లిపాయరంగు ఎరుపుగా ఉంటుంది. ఈ రెండు రకాల ఉల్లిపాయల్లో యాంటికార్సినోజనిక్, యాంటివైరల్, యాంటి ఆక్సిడెంట్ లక్షణాలున్నాయి. తెలుపు ఉల్లిపాయల్లో 0.5 గ్రాముల పీచు, గంధకం అధికంగా ఉన్నప్పటికీ ఎరుపు ఉల్లిపాయల్లో లాభదాయకమైన పోషకాలున్నాయి. ఎరుపు ఉల్లిపాయల్లో యాంటిఆక్సిడెంట్లు ఎక్కువ. క్యాన్సర్ రాకుండా కాపాడగలగడమే కాక రక్తాన్ని పలుచబడేట్లు చేస్తుంది. తెల్ల ఉల్లిపాయల కన్నా ఎర్ర ఉల్లిపాయల్లో షుగర్ తక్కువ. ఈ ఉల్లిపాయలకు ఎరుపు రంగు రావడానికి మరొక కారణం వాటిలో ఎక్కువగా యాంతోసయనిన్లు ఉండటం.
ఈ రెండు రకాల ఉల్లిపాయల్లో విటమిన్ ‘సి’ ఉంటుంది. ఇది నీటిలో కరిగే విటమిన్. శరీరం కొలాజిన్ తయారు చేసుకోవాలంటే ఈ ‘సి’ విటమిన్ అవసరం. ఇది శరీరానికి గాయాలైతే వెంటనే నయం చేయగలదు. శరీర రోగనిరోధక శక్తిని ఈ కొలాజిన్ పెంచుతుంది. ఇటీవల కనుగొన్న కొత్త విషయం ఏమిటంటే... తెల్ల ఉల్లి కన్నా ఎర్ర ఉల్లి శరీరంలో బ్లడ్ షుగర్ని తగ్గిస్తుంది. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది అని తేలింది.

- తెల్లనివి
- ఎర్రనివి
- చిన్నవి
- పెద్దవి
- ఎక్కువ వాసన కలవి
- తక్కువ వాసన కలవి
- తియ్యటివి

Post a Comment