30 ఏళ్ళ నుంచి రెండు రూపాయలకే వైద్యం చేస్తున్న డాక్టర్ వీరరాఘవన్
నేడు ఖరీదైన వైద్యం పేదవాడికి అందని ద్రాక్షనే చెప్పాలి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఈ డాక్టర్ ఫీజులు చెల్లించలేక ఏ నాటు వైద్యంతోనో, ఆర్ఎమ్పి డాక్టర్ వైద్యంతోనో సరిపెట్టేసుకుంటారు చాలామంది. అయితే తమిళనాడులోని వ్యాసర్పాడిలో మాత్రం అలా కాదు. అక్కడ వైద్యం పేదవారికి అందుబాటులో ఉంటుంది. కరువు కారణంగా ఎంతోమంది గ్రామాన్ని విడిచి వెళ్లినా తను మాత్రం ఆ గ్రామంలోనే ఉంటూ అతి తక్కువ ఫీజుకే గ్రామస్తులకు వైద్య సేవలందిస్తున్న డాక్టర్ వీరరాఘవన్ గురించి మీరూ చదివి తెలుసుకోండి.
తమిళనాడులోని ఒక గ్రామీణ ప్రాంతం వ్యాసర్పాడి. అక్కడే పుట్టిపెరిగాడు వీరరాఘవన్. చెన్నరులోని స్టాన్లీ మెడికల్ కాలేజ్‌లో ఎమ్బిబీఎస్ పూర్తి చేశారు. తన బ్యాచ్‌లో దాదాపు అందరూ విదేశాల్లో సెటిలవ్వాలనుకుంటే వీరరాఘవన్ మాత్రం సొంతూరుకు సేవ చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు. అలా 1973లో ఒక సొంత క్లినిక్‌ను ప్రారంభించాడు. అప్పుడు తను పేషెంట్ల నుంచి తీసుకున్న ఫీజు రెండు రూపాయలు. ఆ తర్వాత తన ఫీజు ఐదురూపాయలు చేసినా ఎక్కువమంది చెల్లించలేమని చెప్పడంతో తిరిగి రెండు రూపాయల ఫీజునే తీసుకోవడం మొదలు పెట్టాడు వీరరాఘవన్. అలా ఆ ప్రాంతంలో తన పేరుతో కంటే రెండు రూపాయల డాక్టర్‌గానే వీరరాఘవన్ ఎక్కువమందికి తెలుసు. అయితే ఈ డాక్టర్ ఇప్పటికీ అంతే ఫీజు వసూలు చేస్తుండడం గొప్ప విషయం.
2015లో చెన్నరులో వచ్చిన వరదల ప్రభావం వ్యాసర్పాడిని తీవ్ర కరువులోకి నెట్టివేసింది. ఈ కరువు కారణంగా ఎంతో మంది గ్రామాన్ని విడిచి పక్క గ్రామాలకు వెళ్లిపోయారు. గ్రామంలో తీవ్ర అనారోగ్య పరిస్థితులు ఉన్నా కొందరైనా ఈ గ్రామాన్ని అంటిపెట్టుకుని ఉన్నారంటే దానికి కారణం వీరరాఘవన్ అనే చెప్పాలి. వరదలు సంభవించిన ఆ ఏడాదే వ్యాసర్పాడి గ్రామంలో కుష్టువ్యాధి ప్రబలింది. దగ్గరలోని ఎరుకంచెర్రి ప్రాంతంలో ఉన్న తన క్లినిక్‌లో ఉదయం ఎనిమి గంటల నుంచి రాత్రి పదిగంటల వరకు రోగులను పరీక్షించడంతోపాటు అర్ధరాత్రి సమయంలోనూ కుష్టురోగులకు ఉచిత వైద్యసేవలందించేవారు వీరరాఘవన్. తను అందించిన సాయం ఎంతో మంది ప్రాణాలను కాపాడగలిగింది. ఆ తర్వాత అతితక్కువ ఫీజు కారణంగానే తాము మెరుగైన వైద్య సేవలను అందుకోగలుగుతున్నామంటూ అక్కడి వారు చెప్పిన మాటలు తనని మరింతగా పేదవారికి సాయపడేలా చేశాయి.
వీరరాఘవ్ చేస్తున్న సేవల గురించి పక్కగ్రామాలకీ పాకేయడంతో అక్కడ నుంచి కూడా రోగులు ఆయన వద్దకు రావడం మొదలు పెట్టారు. ఇదంతా మిగిలిన డాక్టర్లకు తలభారంగా మరింది. ఇంత తక్కువ ఫీజుకే వైద్యాన్ని అందించడంపై స్థానికంగా ఉన్న కొందరు తీవ్ర వ్యతిరేకతను వెలిబుచ్చారు. కనీసం వందరూపాయలైనా ఫీజు వసూలూ చేయాలంటూ ఆయనపై వత్తిడి తేవడం మొదలు పెట్టారు. అయితే దీనికి వీరరాఘవన్ ఎంతో తెలివిగా వ్యవహరించాడు. అప్పటి వరకు తను వసూలు చేస్తున్న రెండు రూపాయల ఫీజుకు బదులు ఫూర్తి ఉచిత వైద్యాన్ని మొదలు పెట్టాడు. అందుకు బదులుగా పేషెంట్స్ ఇచ్చే పళ్లు, స్నాక్స్, కూరగాయలు ఇలా ఎవరి తాహతకు తగ్గట్టు వారు ఇచ్చే వస్తువులను తీసుకునేవారు. ఇలాంటివన్నీ ఇతర డాక్టర్లలో మార్పుకు దోహదపడ్డాయి. అయితే ఇలా ఉచితంగా వైద్యం చేయడం వీరరాఘవన్‌కు ఎలా సాధ్యపడిందనే సందేహం మీకు రాకమానదు. ఇండియన్ ఫెలో ఇన్ ఇండిస్టియల్ హెల్త్ (ఎఎఫ్ఐ హెచ్)లో రిక్రూటింగ్ బోర్డ్ మెంబర్‌గా వ్యవహించడం ద్వారా వచ్చే పూర్తి ఆదాయాన్ని తను రోగుల కోసమే వినియోగిస్తున్నారు వీరరాఘవన్. ఆయన భార్య పిల్లలు కూడా వీరరాఘవన్ చేస్తున్న కృషికి అండగా నిలవడంతో ప్రస్తుతం చెన్నరులోని స్లమ్‌ల్లో ఉండే పేదలకు ఉచిత వైద్యం అందించేందుకు ఒక హాస్పిటల్‌ను నిర్మించేందుకు కృషిచేస్తున్నారు. ఆయన అందిస్తున్న సేవలు మరెందరికో స్ఫూర్తి దాయకం.

Post a Comment