OUT SIDE FOOD NOT ALLOWED కు చెల్లు చీటి.! ఇక మల్టిఫ్లెక్స్ లోకి మనకిష్టమొచ్చిన ఫుడ్తీసుకెళ్ళొచ్చు.!
మహారాష్ట్ర ప్రభుత్వం ఓ మంచి నిర్ణయాన్ని తీసుకుంది. ఇన్ని రోజులు OUT SIDE FOOD NOT ALLOWED అంటూ 10 రూపాయల సమోసాకు 50 రూపాయలు, 20 రూపాయల పాప్ కార్న్ కు 150 రూపాయల వరకు వసూల్ చేసిన మల్టిఫ్లెక్స్ దోపిడికి చెక్ పెట్టింది. ఆగస్ట్ 1 నుండి ఎవరికి ఇష్టమొచ్చిన ఫుడ్ వారు థియేటర్స్ లోకి తీసుకెళ్ళి నిరభ్యంతరంగా తినొచ్చు...ఇక మిమ్మల్ని ఏ థియేటర్ యాజమాన్యం కూడా అడ్డుచెప్పదు.( ముంబాయ్ లో మాత్రమే )
ముంబాయ్ కు చెందిన జైనేంద్ర బాక్సీ గత ఏడాది మల్టి ఫ్లెక్స్ ల అడ్డగోలు దోపిడిపై కోర్ట్ ను ఆశ్రయించాడు.. ఈ విషయంపై ఆరా తీసిన న్యాయస్థానం దీనిపై చర్యలు తీసుకొని, ఓ పర్మినెంట్ సొల్యూషన్ ను చూపించాల్సిందిగా మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించగా..... ఫడ్నవిస్ సర్కార్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 - జీవించే హక్కు ప్రకారం...మనిషి ఏ వస్తువైనా, ఎక్కడైనా తినే స్వేఛ్చ ఉంది, దానిని నిరాకరించే అధికారం ఎవ్వరికీ లేదు..కాబట్టి ఇదే పాయింట్ పై పిటిషనర్ తరఫు న్యాయవాది ఆదిత్య ప్రతాప్ తన వాదనలు వినిపించారు.
ఈ నిబంధన అన్ని రాష్ట్రాలకు వర్తింపజేస్తే బాగుంటుందనే డిమాండ్స్ వినిపిస్తున్నాయ్.... ఓ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమిచ్చిన తీర్పు కాబట్టి ఇది త్వరలోనే ఇతర రాష్ట్రాలకు వర్తించే అవకాశముంది.!

Post a Comment