Header Ads

హిమ‌దాస్ గెలుపుపై...సెలెబ్రిటీల ట్వీట్స్.! మ‌హేష్ బాబు, NTR ల ప్ర‌శంస‌లు.!

అంత‌ర్జాతీయ అండ‌ర్-20 అథ్లెటిక్ ఛాంపియ‌న్ షిప్ లో భాగంగా...400 మీట‌ర్ల ఈవెంట్ లో గోల్డ్ మెడ‌ల్ సాధించిన హిమ‌దాస్ పై సెలబ్రిటీలు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఇండియాకు అథ్లెటిక్ లో ఫ‌స్ట్ టైమ్ గోల్డ్ మెడ‌ల్ రావ‌డం ఇదే కావ‌డంతో దాస్ ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు. మోఢీ, సచిన్, వీరేంద్ర సెహ్వాగ్ ల‌తో పాటు టాలీవుడ్ హీరోలైన మ‌హేష్ బాబు, NTR లు కూడా హిమ‌దాస్ ను ట్విట్ట‌ర్ ద్వారా అభినందించారు.

మ‌హేష్ బాబు:
"హిమాదాస్ గొప్ప ఘ‌న‌త సాధించింది. భారత క్రీడల చరిత్రలో చెప్పుకోద‌గ్గ క్ష‌ణమిది. మిమ్మ‌ల్ని చూసి గ‌ర్వంగా ఫీల‌వుతున్నాం. మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను .NTR
"కొత్త చ‌రిత్ర సృష్టించిన హిమ‌దాస్‌కు హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు. ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్‌లో స్వ‌ర్ణం నెగ్గిన అథ్లెట్‌గా నిలిచారు. ఇది గొప్ప సంతోష‌క‌ర స‌మ‌యం"

 

No comments