Header Ads

మీ పళ్లు ముత్యాల్లా మెరవాలి అంటే ఈ చిన్న చిట్కాలను వాడండి

ఫ్రెషర్స్ డే కావచ్చు మరో వేడుక కావచ్చు. ఆ సమయంలో పెదవులకు వేసుకునే లిప్స్టిక్ రంగు ఏదయినా పళ్లు మాత్రం ముత్యాల్లా మెరిస్తేనే అందం. అలాంటి మెరుపును సొంతం చేసుకోవాలంటే ఈ చిన్న చిట్కాలని పాటించండి .

చాక్లెట్లు, గ్రేవీల వల్ల పళ్లపై వాటి తాలూకు మరకలు పడతాయి. అలాంటివి ఏవయినా తిన్నప్పుడు వెంటనే నీళ్లతో పళ్లను శుభ్రం చేసుకోవడం చాలా అవసరం. అదే సమయంలో శీతలపానీయాలూ, జిగురు ఎక్కువగా ఉండే క్యాండీలను సాధ్యమైనంతవ రకూ మానేయాలి. వాటిల్లోని రకరకాల రసా యనాలు పళ్ల ఎనామిల్ లో ఉండే ఖనిజాల పై ప్రభావం చూపి సమస్యలు తెచ్చిపెడతాయి. రోజూ రెండుసార్లు కనీసం రెండు నిమిషాలు పళ్లు తోముకోవాలి. అప్పుడే నోట్లో బ్యాక్టీరియా సమస్య ఉండదు.




టూత్ బ్రష్ ని మరీ బలంగా కాకుండా నెమ్మదిగానే తోముకోవాలి. లేదంటే పళ్ల ఎనామిల్ కి హాని జరుగుతుంది. అలాగే ప్రతి మూణ్నెల్లకోసారి టూత్ బ్రషని మార్చేసి కొత్తది కొనుక్కోవాలి.. కుదిరితే రోజుకోసారి బ్లాక్ టీని తాగడం అల వాటుగా చేసుకోండి. ఈ టీ పళ్ల సమస్యను పెంచే బ్యాక్టీరియాను నశింపచేస్తుంది. అయితే ఆ టీలో చక్కెర లేకుండా చూసుకోవాలి. ఐసు, క్యాండీల్లాంటివి బలంగా కొరకడం కూడా మం చిది కాదు. అవి పళ్లపూ భారం పడేలా చేస్తాయి.

ఏదో ఒక మౌత్ వాష్ అని కాకుండా ఆల్క హాల్ లేని రకాన్ని మాత్రమే ఎంచుకోవాలి. లేదంటే నోట్లోని టిష్యూలు పొడిబారి, బ్యాక్టీ రియా సమస్య ఇంకా పెరుగుతుంది. కమలాఫలంలో ఉండే క్యాల్షియం పళ్లను బలంగా మారుస్తుంది. అందుకే కమలాఫలం తి నడమే కాదు, తొక్కలోని తెల్లభాగంతో పళ్లను తోముకోవాలి. అలాగే క్యారెట్లలో విటమిన్ ఎ ఉంటుంది. ఇది పళ్ల ఎనామిల్ ని బలంగా మారుస్తుంది.

యాపిల్ తినడం వల్ల పళ్లు ఆరో గ్యంగా ఉంటాయి. యాపిల్ లో ఉండే ప్రత్యేకమై న రసాయం పళ్లను తెల్లగా కూడా మారుస్తుంది.  పాలు, చీజ్, పెరుగు నోట్లోని బ్యాక్టీరి యాను నివారించడమే కాదు.. నోటి దుర్వాసనకు కారణమైన రసాయనాలను నియంత్రిస్తాయి. అప్పుడప్పుడూ పుదీనా, లవంగాలూ, యాలకులూ నమిలితే మంచిది.

క్యాల్షియం రిచ్ ఫుడ్స్ ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మాత్రమే కాదు, దంతాలకు చిగుళ్లకు కూడా మంచిదే . చిగుళ్ల వ్యాధులు మరియు దంతక్షయం వంటి వ్యాధులు సోకకుండా ఉండాలంటే క్యాల్షియం ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవాలి. పాలు, పెరుగు మరియు చీజ్, కేల మరియు బ్రొకోలీ వంటి వాటిలో క్యాల్షియం ఎక్కువగా ఉన్నాయి. ఈ చిట్కాలు అన్ని తప్పకుండా పాటించండి స్నేహితులారా

No comments