Header Ads

తన పుట్టిన రోజున కోటి రూపాయలు రైతులు అభివృద్ధికి దానం చేసిన సూర్య

సినీ నటుడు సూర్య ఎన్నో గొప్ప సమాజసేవ కార్యక్రమాలు చేస్తుంటారు. నిన్న ఆయన తన 43 వ పుట్టిన రోజు జరపుకున్నారు . ఇటీవల తన సొంత బ్యానర్ లో రైతు సమస్యల నేపథ్యంలో చినబాబు సినిమాను ఆయన నిర్మించారు స్టార్‌హీరో సూర్య, ఈ సందర్భంగా రైతులకు భారీ విరాళం ప్రకటించారు. స్వయంగా ఆరుగురు రైతులకు 12 లక్షల రూపాయలు అందజేసిన సూర్య, రైతుల సంక్షేమం కోసం వ్యవసాయాభివృద్ధి సంస్థకు కోటి రూపాయల విరాళం ప్రకటించారు.




తమిళ నాట చినబాబు సినిమా ఘనవిజయం సాదించటంతో సినిమా లాభాలనుంచి ఈ సాయం అందిస్తున్నట్టుగా ప్రకటించారు సూర్య. తన పుట్టిన రోజు సందర్భంగా సోమవారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. కార్తీ, సయేషా హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చినబాబు సినిమాను సూర్య తన సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై స్యయంగా నిర్మించారు. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్‌ అయిన ఈ సినిమా తెలుగు నాట పరవాలేదనిపించగా కోలీవుడ్ లో మాత్రం భారీ వసూళ్లను సాదిస్తూ దూసుకుపోతోంది. రైతు సమస్యలతో పాటు కుటుంబ బంధాలు, అలకలు, కోపాలు మనసుకు హత్తుకునేలా తెరకెక్కించారు దర్శకుడు పాండిరాజ్‌.

సూర్య కుటుంబం డబ్బు సమస్యతో చదువుకు దూరం అవుతున్న చిన్నారులకు విద్యను అందించడమే లక్ష్యంగా అకుంటిత దీక్ష బూనిన హీరో సూర్య తన స్థాపించిన 'ఆగారం ఫౌండేషన్' ద్వారా తన ఆశయ సాధనకు ముందుకు సాగుతున్నారు. ఇటీవల ఆయన ఈ విషయాన్ని వెల్లడిస్తూ... 'డబ్బు లేక చదువుకు దూరం అవుతున్న వారికి ఆగారం ఫౌండేషన్ ద్వారా హెల్ప్ చేయదలుచుకున్నాం. 9841091000కు ఫోన్ చేయండి అని తెలిపారు. ఈ కార్యక్రమం గురించి అందరికీ తెలియజేయండి' అని కూడా ప్రకటించారు . ఈ కుటంబం యొక్క విశాల హృదయానికి హ్యాట్స్ ఆఫ్

No comments