నిజాయతిగా ఉండి తన హీరో ని , ప్రజల మనసు గెలుచుకున్న యాసిన్
నిజాయితీగా ఉంటే ఈ రోజు కాకపోయినా రేపు అయిన మనకి మంచి పేరు రావడం కచ్చితం అని , అదే నలుగురిలో గుర్తింపును తీసుకొస్తుంది అని నిరూపించాడు ఈరోడుకు చెందిన మహమ్మద్ యాసిన్. ఏడేళ్ల వయసులోనే సూపర్‌స్టార్ రజనీకాంత్ చేత శభాష్ అనిపించుకున్నాడు. సోషల్ మీడియాలో హీరోగా మారిన ఆ పిల్లాడి కబుర్లు ఇవి.
తమిళనాడులోని ఈరోడుకు చెందిన మహమ్మద్ స్థానిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. ఎప్పటిలాగే ఉదయాన్నే రెడీ అయి స్కూల్‌కు బయలుదేరాడు. దారిలో ఎవరో బ్యాగు పడేసుకుని ఉండటాన్ని చూశాడు. దాన్ని తెరిచి చూస్తే డబ్బులు కనిపించాయి. పాపం.. ఎవరో డబ్బులున్న బ్యాగును పడేసుకున్నారని అనుకున్నాడు. బ్యాగును తీసుకున్నాడు.
స్కూల్కెళ్లి టీచరుకు జరిగిన విషయం చెప్పా డు. ఆ బ్యాగును పోలీసులకు అందచేద్దామని టీచర్‌కు చెప్పాడు. టీచర్ ద్వారా నగర పోలీస్ కమిషనర్‌కు విషయాన్ని తెలియజేశారు. టీచర్‌తో కలిసి వెళ్లి ఆ బ్యాగును కమిషనర్‌కు అందజేశారు. ఆ చిన్నారి నిజాయితీని చూసి పోలీసు అధికారి మెచ్చుకున్నారు. ఆ పోలీస్ కమిషనర్ పిల్లవాడి మంచితనాన్ని చూసి 10,000 బహుమతిగా ప్రకటించాడు . ఆ పిల్లవాడు ఆ బహుమతిని తిరస్కరించాడు . తనకు ఎ బహుమానం అవసరం లేదు అని సాక్షాత్తు కమిషనర్ గారికే చెప్పాడు . దీనితో ఆయన ప్రెస్ వారిని పిలిచి అందరికి జరిగిన విషయం చెప్పారు .
యాసిన్ నిజాయితీ గురించి రజనీ పీపుల్ పోరం నిర్వాహకులు తెలుసుకుని అభినందించడానికి వచ్చారు. నగదు బహుమతి ఇవ్వబోయారు. కానీ యాసిన్ దాన్ని తిరస్కరించాడు. నాకు రజనీకాంత్ అంటే అభిమానమని, ఆయనను కలిసే అవకాశం కల్పించమని కోరాడు. దాంతో వాళ్లు విషయాన్ని సూపర్‌స్టార్‌కు తెలియజేశారు. యాసిన్ గురించి తెలుసుకున్న రజనీకాంత్ తన ఇంటికి ఆహ్వానించాడు. యాసిన్ తన తల్లిదండ్రులు, అన్నయ్యతో కలిసి పోయ్సగార్డెన్లో ఉన్న రజనీకాంత్ నివాసానికి వెళ్లారు. రజనీకాంత్ యాసిన్‌ను దగ్గరకు తీసుకొని అభినందించారు. బంగారు గొలుసును బహుమతిగా ఇచ్చారు. తన అభిమాన హీరో బహుమతి ఇచ్చే సరికి యాసిన్ ఎంతో ఆనందంగా ఫీలయ్యాడు. అంతేకాదు తన చదువుకయ్యే ఖర్చునంత భరిస్తానని రజనీకాంత్ హమీ ఇచ్చారు.
నిజాయతీగా బ్యాగును అందజేయడంతో యాసిన్ సూపర్‌స్టార్‌ను కలవడంతో పాటు సోషల్ మీడియాలో హీరో అయ్యాడు. నిజాయితీగా ఉంటే గుర్తింపు లభిస్తుందనడానికి యాసిన్ మంచి ఉదాహరణ. మరి మీరూ నిజాయితీగా ఉండి అందరి మన్ననలు పొందుతారు కదూ.

Post a Comment