డ్రైవర్ గా మారిన టీచర్... నిలబడిన స్కూల్.!!!
అది కర్నాటకలోని ఉడిపికి దగ్గర్లోని బారాలి అనే గ్రామం. ....ఆ ఊరి పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య 50., క్రమంగా ఆ సంఖ్య ఇంకా తగ్గుముఖం పట్టింది, కారణం 6 కిలో మీటర్ల దూరం నడిచి పిల్లలు ఆ స్కూల్ కు వెళ్ళాలి. అది కూడా దట్టమైన అడవి మీదుగా , కంకర తేలిన రోడ్డు గుండా...దీంతో ఈ గ్రామస్తులు తమ పిల్లల్ని స్కూల్ కు పంపించడం మానేశారు....ఈ విషయం తెలుసుకున్న ఆ స్కూల్ మ్యాథ్స్ టీచర్ రాజారామ్ ..ఓ ఆలోచన చేశాడు.!
ఏంటా ఆలోచన.?
టీచర్లంతా కలిసి కొద్దోగొప్పో చందాలు వేసి...ఓ పాత బస్ ను కొనాలి, తనకెలాగో డ్రైవింగ్ వచ్చు కాబట్టి..ఆ గ్రామానికి వెళ్లి పిల్లల్ని తీసుకొచ్చే బాధ్యత నాది..అని చెప్పేశాడు. అంతేకాదు బస్ మెయింటేనెన్స్, డీజిల్ ఖర్చులు తాను భరిస్తానని ముందుకొచ్చాడు...అతడి ఆలోచన కార్యరూపం దాల్చింది. టీచర్లంతా కొంత డబ్బు జమా చేసి..అనుకున్నట్టుగానే ఓ పాత బస్ కొన్నారు.
రోజు ఉదయాన్నే స్కూల్ కు రావడం....బస్ స్టార్ట్ చేయడం..అడవి గుండా ఆ గ్రామానికి వెళ్ళి....పిల్లల్ని తీసుకొని స్కూల్ కు రావడం...ఇదే రాజారామ్ దినచర్యగా మారింది. స్కూల్ టు విలేజ్, విలేజ్ టు స్కూల్ ఇలా రోజూ 4 ట్రిప్పులు తిరిగేవాడు ఆ లెక్కల మాస్టార్ .. 9. 35 వరకూ అందర్ని స్కూల్ లో దించి...తను మళ్లీ టీచర్ గా పిల్లలకు పాఠాలు చెప్పడం స్టార్ట్ చేస్తాడు.
మాస్టార్ గారి ఈ ఆలోచన వల్ల...ఇప్పుడు ఆ స్కూల్ స్ట్రెంత్...50 నుండి 90 కి పెరిగింది, పేరెంట్స్ కూడా తమ పిల్లల్ని ఆ బస్ ఎక్కించి పంపిస్తున్నారు.
Watch Video:
https://www.youtube.com/watch?v=LdWY6OM2FD8

Post a Comment