శుభవార్త ఆదాయపన్ను రిటర్నులకు గడువు పొడిగించిన ప్రభుత్వం
ఆదాయపన్ను రిటర్నులకు చివరి తారీఖుని ది సెంట్రల్‌బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) పొడిగించింది. ఈ విషయం వేతన జీవులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే విషయం అని చెప్పుకోవచ్చు . ఇప్పటి వరకు జులై 31ని తుదిగడువుగా ప్రకటించారు. కానీ దీనిని ఆగస్టు 31కి పొడిగిస్తూ సీబీడీటీ ఉత్తర్వులు జారీ చేసింది. తుది గడువును పొడిగించాలని పలు సంస్థలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2018-2019 సంవత్సరానికి కొత్త ఇన్‌కమ్‌ట్యాక్స్ అసెస్మెంట్ ఫారాలను ఏప్రిల్ 5వ తేదీన సీబీడీటీ విడుదల చేసింది. కొత్తఫారం కారణంగా ఆదాయపన్ను రిటర్నుల దాఖలులో జాప్యం జరుగుతోందని నిపుణులు పేర్కొన్నారు.తుదిగడువులోపు ఆదాయపన్ను రిటర్నులను దాఖలు చేయకపోతే రూ.1,000, రూ 5,000, రూ.10,000 అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. అపరాధరుసం ఎంతా అనేది రిటర్ను దాఖలు చేసిన తేదీ ఆధారంగా నిర్ణయిస్తారు.
ఈ సమాచారం ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ తుది గడువును పొడగిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించారు . జులై 31తో గడువు ముగుస్తుండగా తాజా నిర్ణయం ప్రకారం ఆగస్టు 31 వరకు ఐటీఆర్ ఫైలింగ్‌కు అనుమతి ఇచ్చారు. అయితే కొన్ని ప్రత్యేక విభాగాలకు సంబంధించిన టాక్స్ పేయర్లకు మాత్రమే ఈ అవకాశం ఇచ్చినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. ఆయా విభాగాలకు చెందిన ఉద్యోగుల నుంచి అందిన విజ్ఞప్తుల మేరకు తాజా నిర్ణయం తీసుకున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) తెలిపింది. ఇన్కమ్ టాక్స్ యాక్ట్‌లో చేర్చిన కొత్త నిబంధన 234ఎఫ్ ప్రకారం.. గడువులోగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయనివారికి రూ. 5000 అపరాధరుసుం విధిస్తారు. డిసెంబర్ 31 తర్వాత రూ. 10,000 అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది.
ఐటీ శాఖలో సూచించిన ఆదాయం పరిధిలో ఉన్నవారంతా పన్ను కట్టాల్సిందే. ఆయా వ్యక్తుల వృత్తి, ఆదాయ మార్గాల ఆధారంగా ఆదాయపు పన్ను రిటర్నులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. సాధారణంగా పాన్ సంఖ్య, ఐటీఆర్ ఫారం-16, బ్యాంక్ స్టేట్మెంట్లు, వడ్డీకి సంబంధించిన పాస్‌బుక్ తదితరాలకు సంబంధించిన కాపీలను జత చేయాల్సి ఉంటుంది . ఎల్ఐసీ, స్వచ్ఛంద సేవలకు రుణ వితరణ లాంటి వాటిని చూపెట్టి పన్ను మినహాయింపులు కోరదలుచుకున్నా, టీడీఎస్ రిటర్న్ రావాలనుకున్నా ఐటీ రిటర్న్స్ సమర్పించాల్సిందే.
2017 ఏప్రిల్ 1 నుంచి 2018 మార్చి 31 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,50,000 మించి ఆదాయం ఉన్నవారు ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రీఫండ్ కోరుకునే వ్యక్తులు, వార్షిక ఆదాయం రూ. 5 లక్షలకు మించి ఉన్నవారు తప్పనిసరిగా ఇ-ఫైలింగ్ చేయాలి.

Post a Comment