రోజు ఒక ఆరెంజ్ పండు తినడం వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు
మన దేశం లో మనకి బాగా దొరికే పండు లో ఒకటి ఆరెంజ్. మరియు ఎక్కువ ధరకు అమ్మే ఆపిల్ పండు కన్నా తక్కువ ధరకే మనకు మార్కెట్ లో ఆరెంజ్ లభిస్తుంది. పులుపు, తీపి కలగలిసిన ఆ రుచి.. కేవలం ఆరెంజ్లలోనే లభిస్తుంది. మరి ఆరెంజ్ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
![]() |
రోజు ఒక ఆరెంజ్ పండు తినడం వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు |
- చలికాలం ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిది. చర్మానికి కావాల్సిన పోషకాలను అందిస్తూనే.. మందగించిన జీర్ణప్రక్రియను వేగవంతం చేస్తుందీ పండు.
- ఆరంజ్లోని లెమొనాయిడ్స్లో సిట్రస్ పుష్కలం. సిట్రస్ క్యాన్సర్ల నివారిణి. చర్మం, ఊపిరితిత్తులు, ఉదరం, రొమ్ము క్యాన్సర్ల బారి నుండి రక్షిస్తుంది కమలాపండు.
- ఆంరజ్లోని కెరోటినాయిడ్స్కు లివర్ క్యాన్సర్లను అడ్డుకునే శక్తి అపారం. జపాన్లో చేసిన ఒక అధ్యయనంలో ఈ విషయం తేలింది.
- ఆధునిక జీవనశైలిని అనుసరించే వారికి కొలెసా్ట్రల్ అతి పెద్ద సమస్య. గుండెజబ్బులకు కారణమయ్యే అధిక కొవ్వుకు చక్కటి విరుగుడు ఆరంజ్. ఇందులోని పీచుపదార్థం జీవక్రియల్ని ఉత్సాహంగా ఉంచి.. కొవ్వు పేరకుండా చూస్తుంది.
- గుండె పనితీరు మెరుగుపడాలంటే పొటాషియం, ఎలకో్ట్ర మినరల్స్ అవసరం. ఇవన్నీ ఆరంజ్లో దొరుకుతాయి. తద్వార హృద్రోగాలు దరిచేరవు.
- శీతాకాలం, వర్షాకాలంలలో వైరల్ ఇన్పెక్షన్లు సోకడం సహజం. శరీరంలో మార్పుల వల్ల, వ్యాధినిరోధకశక్తి సన్నగిల్లడం వల్ల ఇన్పెక్షన్లు సోకుతాయి. ఆరంజ్లోని పోలిఫినోల్స్ వీటికి అడ్డుకట్ట వేస్తుంది.
- భోజనానికి ముందు ఆరంజ్ జ్యూస్ తీసుకోవడం వల్ల జీర్ణప్రక్రియ చురుగ్గా సాగుతుంది. తిన్న ఆహారం ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీర్ణం అవుతుంది.
- కంటిచూపు మెరుగుపడి దృష్టిలోపాలు పోవాలంటే విటమిన్ ఎ కీలకం. అది ఆరంజ్లో దొరుకుతుంది.
- బీటా కెరోటిన్ అనేది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. చలికాలంలో చర్మం పొడిబారకుండా, పగుళ్లు రాకుండా కాపాడుతుంది. ఆరంజ్ ద్వారా వీటిని శరీరానికి సమకూర్చవచ్చు.
- వయసు పెరుగుతున్నకొద్దీ కిడ్నీలలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. అందుకని క్రమం తప్పకుండా ఆరంజ్జ్యూస్ తాగితే.. రాళ్లు ఏర్పడవు. ఒకవేళ చిన్నగా వృద్ధి చెందుతున్నప్పటికీ తొలగిస్తుంది ఈ జ్యూస్.
ఇవి ఆరెంజ్ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు.
Post a Comment