ఎట్టకేలకు బిగ్‌బాస్ షో నుంచి తేజస్వీ ఔట్
అందరూ ఊహించినట్లే బిగ్‌బాస్ హౌస్ నుంచి ఈ వారం తేజస్వీ మడివాడ ఎలిమినేట్ అయింది. అదేంటీ ఎపిసోడ్ జరగక ముందే ఎలా తెలిసిందంటారా? అదంతే.. గత నాలుగు ఎపిసోడ్లుగా తెలిసినట్టే ఈ సారి కూడా లీకైంది. ఆదివారం జరగాల్సిన ఎపిసోడ్ ఒక రోజు ముందు షూటింగ్ చేస్తారన్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఆ షూట్‌కు వెళ్లే ప్రేక్షకులు ఎలిమినేషన్ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండటంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. నిజానికి తేజస్వీయే ఎలిమినేట్ అవుతుందని అందరూ ఊహించినదే. ఓ టాస్క్‌లో కౌశల్‌తో ప్రవర్తించిన తీరు , ఆమెపై ప్రేక్షకుల్లో వ్యతిరేకతను తీసుకురాగా కౌశల్‌ను హీరో చేసింది. మొదటి నుండి తనకి వ్యతిరేకత ఉన్నప్పటికీ తనకన్నా బలహీన ఆటగాళ్లు ఎలిమినేట్ అయ్యారు . ఇక ఈ వారం తన వంతు అయ్యింది. పోయిన వారు అయిన గొడవ వల్ల తేజస్వికి నెగిటివిటీ బయట ఎక్కువగా పెరిగింది . ఈ దెబ్బతోనే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన భాను శ్రీ గతవారం ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.
ఇక హౌస్ నుంచి వెళ్లిపోయేది తనే అని కూడా తేజస్వీ హౌస్‌మెట్స్‌కు క్లారిటీ ఇచ్చింది. కౌశల్ వ్యవహారంలో చేసిన తప్పుకు ప్రేక్షకులు భానుని శిక్షించారని, ఇప్పుడు తనువంతు వచ్చిందని, హౌస్ నుంచి నిష్క్రమించడానికి లక్ష కారణాలున్నాయని పేర్కొంది. ఈ విషయం శనివారం ఎపిసోడ్లో కనిపించింది. ప్రస్తుతం తేజస్వీ ఎలిమినేట్ అయిన విషయం సోషల్‌మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.ఇక తనని సీక్రెట్ రూమ్ లో కూడా ఉంచలేదు అని తెలుస్తుంది .
అయితే నిన్నటి ఎపిసోడ్ లో ఎవరు ఇంటి నుంచి వెళ్తారో తెలియదు కాబట్టి అందరూ వెళ్లిపోవడానికి సిద్ధం అయ్యారు. ఇక అర్థరాత్రి లైట్స్ ఆఫ్ అయినా పడుకోకుండా ఎలిమినేషన్ జాబితాలో ఉన్న రోల్‌రైడా దీప్తి, తనీష్‌లు, సామ్రాట్, తేజస్వీలు హౌస్‌లోకి ఎందుకు వచ్చామో ఒక్కొకరు తెలిపారు. ఈ సందర్భంగా తేజస్వీ మాట్లాడుతూ.. 100 రోజుల్లో 75 లక్షలు గెలుచుకోవచ్చని, సినిమాలు చేసిన ఇంత సంపాదించలేనని అందుకే బిగ్‌బాస్‌కు వచ్చినట్లు పేర్కొంది. నిజానికి తాను ఎవరిని ప్రభావితం చేయలేదని, సామ్రాట్‌ను అనుసరించడానికి ప్రయత్నించానని చెప్పుకొచ్చింది. ఈ చర్చ సందర్భంగా సామ్రాట్ మాట్లాడుతూ.. ‘నిజానికి నాకు బిగ్‌బాస్ హౌస్‌కు రావాలని లేదు. నా జీవితంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో నేనేంటో నిరూపించుకోవడానికి వచ్చా. ఇక్కడికి వచ్చాక నాకు తేజస్వీ నుంచి స్వచ్చమైన ప్రేమ దొరికింది.’ అని చెప్పుకొచ్చాడు. అయితే వీరి బంధం బయట కూడా కొనసాగుతుందా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిందే.
ఇప్పటివరకు బిగ్ బాస్ హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అయ్యారో , మరియు ఏ వారం లో ఎలిమినేట్ అయ్యారో చూడండి
మొదటి వారం - సంజన అన్నే
రెండో వారం - నూతన నాయుడు
మూడో వారం - కిరీటి దామరాజు
నాలుగో వారం - శ్యామల
ఐదో వారం - భాను శ్రీ
ఆరో వారం - తేజస్వి మడివాడ

Post a Comment