ఈ రోజు నుండి యాహూ మెసెంజర్ సేవలు నిలిపివేస్తున్నారు , కారణాలు ఇవే
మనలో చాలా మందికి మొదటి ఈ మెయిల్ యాహు అయివుంటుంది. యాహు ఈమెయిలు తో పాటు యాహూ మెసెంజర్ ని అప్పట్లో ప్రవేశ పెట్టారు . అప్పట్లో ఇంటర్నెట్ సెంటర్ లో ఎక్కువ మంది తమ మిత్రులతో యాహూ మెసెంజర్ లో చాటింగ్ చేసేవారు . చాల సంవత్సరాలు తరువాత ఇప్పుడు యాహూ తన మెసెంజర్ సేవలను బుధవారం నుంచి నిలిపివేసింది. దీని స్థానంలో కొత్తగా స్కిరల్ పేరుతో సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకునిరానున్నట్టు ప్రకటించింది. వాస్తవానికి యాహూ మెసెంజర్ సేవలను నిలిపివేయనున్నట్టు యాహూ సంస్థ గతంలోనే ప్రకటించింది. ఆ విధంగానే మెసెంజర్ సేవలను నిలిపివేసింది.
గూగుల్ అంతగా అభివృద్ధి చెందని రోజుల్లో యాహూ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందనే చెప్పవచ్చు. మెయిల్ చేయాలన్నా.. మెసేజ్ చేయాలన్నా యాహూ నుంచే చేయాల్సి వచ్చేది. అది.. మార్చి 9,1998. అప్పుడు ఒకరితో మరొకరు ఫోన్లలో మాట్లాడుకోవడమే గొప్ప. అప్పుడప్పుడే ఇంటర్నెట్ విస్తరిస్తోంది. సరిగ్గా ఆ రోజు యాహూ పేజర్ ప్రారంభమైంది. నెటిజన్ల నుంచి యమ రెస్పాన్స్ రావడంతో మరిన్ని మార్పులు చేసి కొన్ని జూన్ 21, 1999న 'యాహూ మెసెంజర్' పేరుతో మెసెంజర్ చాట్‌ను లాంచ్ అయ్యింది. వాట్సాప్, ఫేస్‌బుక్‌లు లేని కమ్యూనికేషన్ ప్రపంచాన్ని ఒక ఊపు ఊపింది ఈ యాహూ మెసెంజర్.
1998లో ప్రారంభమైన యాహూ మెసెంజర్ ఒకప్పుడు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ఒకపుడు చాటింగ్ అంటే నెటిజన్లకు యాహూ మెసెంజరే గుర్తుకు వచ్చేది.
అయితే యాహూ మెసెంజర్ సేవలు నిలిచిపోయినా త్వరలో స్కిరల్ పేరిట యాహూ మరో కొత్త మెసెంజర్ యాప్‌ను వాట్సాప్, ఫేస్బుక్ మెసెంజర్లకు దీటుగా విడుదల చేయనుంది. ఇక ఇప్పటికీ యాహూ మెసెంజర్‌ను వాడుతున్న వారు ఆ యాప్‌లో ఉన్న తమ డేటాను మరో 6 నెలల లోపల డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని యాహూ తెలియజేసింది.
2006 వరుకు వీరి పరిస్థితి బాగున్న , ఆ తరువాత వచ్చిన ఆర్కుట్, ఆ ఆర్కుట్ ని దీటుగా ఫేస్బుక్ రావడం, ఆ తరువాత వాట్సప్ మరియు హ్యాంగౌట్ లాంటి కొత్త సర్వీసులు రావడంతో యాహూ మెసెంజర్ తొలిసారి తీవ్రమైన పోటీని ఎదుర్కొంది. ఆతరువాత మెసెంజర్ కొత్త వెర్షన్, అప్డేట్లు రిలీజ్ చేసినా నెటిజన్లను పెద్దగా ఆకట్టుకోలేదు. యువత కూడా వాట్సప్, ఫేస్బుక్ మోజులో పడి మెసెంజర్ని పూర్తిగా మర్చిపోయారు. డౌన్లోడ్ సంఖ్య కూడా తగ్గిపోవడంతో.. ఈ ప్లాట్‌ఫామ్‌ను శాశ్వతంగా మూసేద్దామని ఓ నిర్ణయానికి వచ్చింది. జులై 17, 2018 నుంచి యాహూ మెసెంజర్‌ను షట్‌డౌన్ చేసింది . అయితే ఇప్పుడు ఆ యాప్ సేవలు నిలిచిపోవడంతో యూజర్లు పలు రకాలుగా సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. యాహూ మెసెంజర్ సేవలను నిలిపివేస్తుండడం బాధాకరమని ట్వీట్లు చేస్తున్నారు. నెటిజన్లు పలురకాల కామెంట్లు చేస్తున్నారు. తాము కుటుంబంతో టచ్‌లో ఉండేందుకు మెసెంజర్ ఉపయోగపడిందని కొందరు కృతజ్ఞతలు చెప్పగా.. మరికొందరు యాహూ మెసెంజర్ రిప్, గుడ్‌బై అంటూ ట్వీట్ చేస్తున్నారు.
యూజర్లు తమ ఛాట్ హిస్టరీని డౌన్లోడ్ చేసుకోవడానికి 6 నెలల గడువు ఇచ్చిన కంపెనీ.. ఆ తర్వాత సర్వర్‌లోంచి ఆ డేటా మొత్తం డిలిట్ అవుతుందని పేర్కొంది. యాహూ మెసెంజర్ని ఆదరించినవారందరికీ కంపెనీ కృతజ్ఞతలు చెప్పింది. అయితే కంపెనీ కొత్తగా తీసుకొస్తున్న గ్రూప్ మెసేజింగ్ యాప్ యాహూ స్క్విరెల్కు యాహూ మెసెంజర్‌లా హిట్ అవుతుందో లేదో లేదో వేచి చూడాలి.

Post a Comment