Header Ads

పేరుకే ప్రభుత్వ పాఠశాల , కాని ఇక్కడ వచ్చే ఫలితాలు , సదుపాయాలు ప్రైవేటు స్కూల్ కన్నా ఎక్కువ

విద్యార్థుల్లో ఆసక్తి , కళాశాలలో సరైన శిక్షణ ఉండాలేగాని ఎన్నో అవకాశాలు సాధించవచ్చు అనే నిజాన్ని నిరూపించారు ఈ విద్యార్ధులు ,మీరు తెలుసుకోబోయే ఈ విద్యార్థులు నారాయణ, శ్రీ చైతన్యనో మారే కార్పోరేట్ కళాశాలకు చెందిన వారు కాదు ,ఒక మాములు గురుకుల కళాశాలకు చెందిన విద్యార్ధులు ,ఆవును మీరు చదివింది నిజమే ఇది మరెక్కడో లేదు మన హైదరాబాద్ లోని గౌలిదొడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల ఐఐటీ/నిట్ ప్రత్యేక శిక్షణ కళాశాల గచ్చిబౌలి లోనీ ఐటీ హబ్ కి కూతవేటు దూరం లో ఉంది ఈ విద్యాలయం ,ఈ విద్యార్థులంతా పేద కుటుంబం నుండి వచ్చిన వారే ,




ఈ కళాశాలకు చెందిన విద్యార్డులు సాధించిన ఘనా విజయాలు
1) 55 మెడిసిన్ సీట్లు 2015-2016 సంవత్సరం కు చెందిన విద్యార్థులు సాధించారు
2) 46 మెడిసిన్ సీట్లు 2016 - 2017 సంవత్సరం కు చెందిన విద్యార్థులు సాధించారు
3) 35 మెడిసిన్ సీట్లు ఇప్పటి వరకు సాధించారు ఇంకా నిట్ కౌన్సిలింగ్ కొనసాగుతోంది , ఇక్కడ చదివే విద్యార్థులకు ఐఐటీ శిక్షణ తో పాటు పర్సనల్ డెవలప్మెంట్ స్కిల్స్ చాలా నేర్పిస్తారు ,తల్లిదండ్రలతో ఎలా మెలగాలి ఆత్మ విశ్వసం తో ఎలా ఉండాలి అన్న అంశాలను చర్చిస్తారు , ఇక్కడ చదివి పాత విద్యార్థులైనా డాక్టర్లు ఇంజినీర్లు ఉన్నత అధికారులు సైకోలోజిస్టులు ఈ గురుకులానికి వచ్చి మిగితా విద్యార్థుల్లో స్ఫూర్తి నింపుతారు.

ఇక్కడి బోధించే ఉపాధ్యాయుల ఎంపిక విషయం లో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు వారి బోధనలో ఒక దృఢ సంకల్పం ఉంటుంది ,వేసవి లో అయితే ఆటలు పైనార్ట్స్ , గుర్రపు స్వారీ , జర్నలిజం సినిమాలు ఇలా దాదాపు ఆరవై రంగాలకు సంబంధించిన శిక్షణ అందిస్తారు ఇక్కడ చదివే విద్యార్థులకు ,ఒక సబ్జెక్టు గంట సేపు బోధిస్తారు . అర్ధం కానీ వాటిని త్రీడీ లో చిపిస్తారు దీనికోసం పిల్లలకు టాబ్లు ఇచ్చారు లాప్టాప్ లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఇంతటి పేరు ప్రక్యాతలు  సాదించిన  ఈ విద్యాలయం లో చాల మంది తల్లితండ్రులు తమ పిల్లలను చేర్పించడానికి ఆసక్తి చూపిస్తున్నారు

No comments