Header Ads

ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు లేకపోతే మోకాళ్ళ మీద క్షమాపణ చెప్పిన ఎమ్మెల్యే

అస్సాం రాష్ట్రం లోని జోహ్రాట్ అనే జిల్లాలోని ఒక ఎంఎల్ ఏ తన మోకాళ్ళమీద ఉండి హాస్పిటల్ కి వచ్చిన రోగులకు క్షమాపణ చెప్పాడు. వివరాల్లోకి వెళ్తే కాంగ్రెస్ పార్టీ కి చెందిన రూపజ్యోతి కూర్మి అనే ఒక ఎంఎల్ ఏ ప్రతి నెల తను ఒక రోజు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగుల సమస్యలు తెలుసుకుంటాడు .



అయితే గత కొద్ది నెలలుగా ప్రభుత్వ హాస్పిటల్ లో వైద్యులు కరువు అయ్యారు అని , ఎవరు తమని సరిగ్గా పట్టించుకోవట్లేదు అని రోగులు పోయిన నెల ఆయనకి విన్నపించుకున్నారు . అయితే తను తొందర్లో ఎవరో ఒకరిని ఏర్పాటు చేస్తా అని ఆయన చెప్పారు . ఆయన చెప్పినట్టే ఒక డాక్టర్ ని ఏర్పాటు చేశారు . కానీ అక్కడ చేరిన డాక్టర్ కూడా పాత డాక్టర్ లా రావడం మానేశారు .

మళ్ళీ రోగులు తమ మోర ఎమ్మెల్యే కి చెప్పారు ,ఆసుపత్రి కి వచ్చిన ఆయన చాలా మంది జనంని చూసి షాక్ కి గురి అయ్యారు . కొన్ని నెలలు నుంచి డాక్టర్లు రాకపోవడం తో రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది . దీనితో ఆయన అందరికి వ్యక్తిగతంగా క్షమాపణ చెప్పి అలాగే మోకాళ్ళు మీద ఉండి తనకి ఇంకో అవకాశం ఇవ్వాలి అని ఈ సారి తన సొంత డబ్బుతో పేషెంట్ కి ట్రీట్మెంట్ అయ్యేలా చూస్తాని , ఇంకోసారి ఇలా అవ్వకుండా చూస్తా అని ఆయన చెప్పారు .



మరి చూడాలి ఈ ఎమ్మెల్యే తన మాట మీద ఏ మాత్రం నిలబడతారో . కానీ ఏదేమైనా మొకాళ్ళ మీద ఉండి క్షమాపణ చెప్పడం ద్వారా ఆయన ప్రజల గుండెల్లో ఇంకో మెట్టు ఎక్కారు .

No comments