Header Ads

రోజు కదలకుండా కూర్చుంటే ఉంటే వచ్చే సమస్యలు , వాటికి పరిష్కారాలు

తెలిసి కొన్ని, తెలియకుండా చేసే కొన్ని పొరపాట్లు గుండెజబ్బులు, మధుమేహం వంటి సమస్యలను తెచ్చిపెడతాయి. వాటి తీవ్రతను అదుపులో ఉంచాలంటే, జీవన విధానంలో మార్పులు చేసుకోవాల్సిందే. వ్యాయామం చేయాలని ఉంది, కానీ జిమ్! వెళ్లే సమయం లేదు... అని చెబుతుంటారు చాలామంది మహిళలు. వ్యాయామం చేయా లంటే జిమ్కే వెళ్లాలని లేదు. రోజూ మీకోసం కొంత సమయం కల్పించుకుంటే చాలు. ఆ సమ యంలో కాసేపు నడిచినా ఎంతో ప్రయోజనం.
ఇంట్లోనే తాడాట ఆడొచ్చు విధుల్లో భాగంగా లేదా ఖాళీగా ఉన్నప్పుడు చాలామంది ఎక్కువ సేపు కదలకుండా కూర్చుండిపోతారు. రోజుకు మూడు గంటలూ అంతకన్నా ఎక్కువ సేపు కదలకుండా కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతాయినీ, కనీసం రెండేళ్ల ఆయుషు తగ్గు తుందనీ చెబుతున్నారు ఆస్ట్రేలియాకు చెందిన అధ్యయనకర్తలు. ఈ పరిస్థితి తలెత్త కుండా ఉండాలంటే మధ్యమధ్య లేచి నడవడం, ఫోన్లు మాట్లాడుతున్నప్పుడు నుంచోడం మంచిది .

చాలామంది ఉద్యోగులు ఇంట్లో చకచకా పనులు చేసినా కార్యాలయానికి వెళ్లాక ఆరేడు గంటలు కదలకుండానే కూర్చుంటారు. అంతెందుకు మధ్యాహ్నం భోజనం కూడా ఉన్నచోటే కూర్చుని తినేస్తూ, పనిచేసేస్తుంటారు. దానివల్ల శారీరక, మానసిక విశ్రాంతి ఉండదు. ఒత్తిడితోపాటూ అలసటా తప్పదు. ఆ ప్రభావం పనిపైనా పడుతుంది. మరెలా అంటారా , మీ రోజు ప్రారంభించే ముందే ఓ ప్రణాళిక తయారు చేసుకోవడం మంచిది. అందులో మీ భోజనానికీ కొంత సమయం పెట్టుకోవడం మరవకండి.  మీ కుర్చీలోనే కూర్చోని తినకుండా. క్యాంటీన్‌కి సహోద్యోగులతో కలిసి వెళ్లి సరదాగా భోజనం చేయడం అలవాటుగా మార్చుకోండి. దానివల్ల సత్సంబంధాలు పెరగడమే కాదు, పని ప్రభావం నుంచి బయట పడగలుగుతారు.

ఎంత పని ఉన్నా సరే.. ప్రతి గంటకోసారి లేచి కనీసం రెండు మూడు నిమిషాలు నడవడం మంచిది. దానివల్ల శరీరానికి కాస్త వ్యాయామం అందినట్లు అవుతుంది.  కూర్చీలో కూర్చున్నా సరే.. పాదాల్ని గుండ్రంగా సవ్య, అపసవ్య దిశలో తిప్పాలి. దానివల్ల కాళ్ల కండరాలు పట్టేసే సమస్య ఎదురుకాదు. అదేవిధంగా చేతుల్ని పైకెత్తడం, మెడను కుడి, ఎడమల వైపునకు తిప్పడం మంచిది. అలాగే కూర్చున్నా, నిల్చున్నా నిటారుగా ఉండేలా చూసుకోవాలి.ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల ఈ సమస్యలు ఎక్కువ వచ్చే అవకాశం వుంది హార్ట్ ఎటాక్ , డయాబెటిస్ , కాన్సర్ , తిండి అరుగుదల సమస్య , మెదడు తక్కువగా పని చేయడం , వంటి నెప్పులు , రక్తఘనీభవనము , స్థూలకాయం , క్రుంగియుండుట , మొద్దుబారిపోవడం జరుగుతుంది , దయచేసి ఎక్కువసేపు కూర్చోకుండా కుదిరిన అప్పుడు 30 నిమహాసాలకి ఒక సారి ఒక 20 అడుగులైనా వేయండి

No comments