సైరా నరసింహారెడ్డి చిత్ర యూనిట్ కి షాక్ , సెట్స్ కూల్చివేసిన అధికారులు
సైరా నరసింహారెడ్డి మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా 151వ చిత్రం. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, రేనాటి సూర్యుడుగా కొలవబడే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా నిర్మించబడుతోంది. రాం చరణ్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహస్తున్నాడు. ఆగస్టు 16, 2017 బుధవారం ఈ సినిమా కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభమైంది.
రాం చరణ్ భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రానికి హైదరాబాద్ రెవెన్యూ అధికారులు షాకిచ్చారు. మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ బ్లాక్‌బస్టర్ ‘రంగస్థలం’ చిత్రం షూటింగ్ జరిగిన సెట్స్‌లోనే ప్రస్తుతం సైరా షూటింగ్ కూడా జరుగుతోంది. శేరిలింగంపల్లి రెవెన్యూ పరిధిలో ఉన్న ఈ సెట్స్‌లో రంగస్థలం షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే ఇది ప్రభుత్వ భూమి కావడంతో ప్రభుత్వం నుంచి అనుమతి లేకుండా ఇప్పుడు సైరా చిత్రం కోసం అక్కడ సెట్స్ నిర్మించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రెవెన్యూ అధికారులు సైరాలో కథానాయకుడి ఇంటి సెట్‌ని కూల్చివేశారు.
రంగస్థలం సినిమా అప్పుడు అనుమతి తీసుకున్నారు అని , ఇప్పుడు సైరా నరసింహారెడ్డి సినిమాకి అనుమతి తీసుకోలేదు అని , ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని పలుమార్లు నోటీసులు అందించినా ఫలితం లేకుండా పోయిందని, అందుకే కూల్చివేయాల్సి వచ్చిందని తెలిపారు. అనుమతి తీసుకోకుండా సెట్ వేయడమే చిత్ర యూనిట్ చేసిన తప్పు అని, అనుమతులు కోరితే ఉచితంగానైనా పర్మిషన్ ఇచ్చి ఉండేవారమని అధికారులు పేర్కొన్నారు. భూకబ్జాకు ఇది ముందస్తు ప్లాన్ అని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అనుమతుల్లేకుండా సెట్ వేసి, ఆ తర్వాత ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలనేది చిత్ర యూనిట్ ప్రణాళికలో ఓ భాగమని అధికారులు ఆరోపిస్తున్నారు. అందుకనే కూల్చేసినట్టు తెలిపారు. ఈ ఘటనపై చిత్ర బృందం ఇంకా స్పందించలేదు.
కీలకమైన హీరో సెట్ కూల్చివేయడం తో మరి సైరా నరసింహ రెడ్డి చిత్ర యూనిట్ ఈ సారి అయినా అనుమతి తెచ్చుకుంటారా , లేక వేరే సెట్ వేస్తారో చూడాలి

Post a Comment