Header Ads

‘నా చావు నా చేతుల్లోనే ఉంది, శత్రువుల చేతుల్లో చావను’ అని త‌న‌ను తానే కాల్చుకొని అమ‌రుడైనచంద్ర‌శేఖ‌ర ఆజాద్ జ‌యంతి నేడు.!

చంద్ర‌శేఖ‌ర ఆజాద్...దేశ స్వాతంత్ర్య పోరాటంలో సువ‌ర్ణ అక్ష‌రాల‌తో లిఖించిన పేరు. గాంధీజీ పిలుపుతో స్వాతంత్ర్య ఉద్య‌మంలోకి అడుగుపెట్టిన చంద్ర‌శేఖ‌ర్ అన‌తి కాలంలోనే త‌న‌దైన పంథాను ఎంచుకొని బ్రిటీష్ పాల‌కుల‌కు కొర‌క‌రానికొయ్య‌గ మారాడు.! చిన్న‌ప్ప‌టి నుండి దుందుడుకు స్వ‌భావి అయిన ఆజాద్ మ‌ర‌ణించే వ‌ర‌కు కూడా త‌న ఆత్మ‌గౌర‌వాన్ని ఎక్క‌డా త‌గ్గించుకోలేదు.
ఆజాద్ జీవితంలోని కీలక స‌న్నివేశాలు.

బ్రాహ్మ‌ణ కుటుంబంలో పుట్టిన చంద్ర‌శేఖ‌ర్ ను సంస్కృతం చ‌దివించాల‌నేది వారి త‌ల్లిదండ్రుల బ‌ల‌మైన కోరిక‌, కానీ శేఖ‌ర్ కు అది ఇష్టం లేదు..దీని కార‌ణంగా ఇంట్లోంచి పారిపోయి....ముంబాయ్ మురికి వాడ‌ల్లో రెండేళ్లు కూలిప‌ని చేస్తూ జీవ‌నం సాగించాడు.! త‌ర్వాత మ‌ళ్లీ త‌ల్లిదండ్రుల ఇష్టం మేర‌కు వార‌ణాసిలోని సంస్కృత పాఠ‌శాల‌లో జాయిన్ అయ్యాడు.

అది స‌హాయ నిరాక‌ర‌ణ ఉద్య‌మం సాగుత‌న్న కాలం..... గాంధీ పిలుపుతో విదేశీ వ‌స్తువుల‌ను వీధుల్లో త‌గ‌ల‌బెడుతున్నారు. విద్యార్థి గా ఉన్న చంద్ర‌శేఖ‌ర్ కూడా త‌న పాఠ‌శాల ముందే ద‌ర్నా చేస్తున్న సంద‌ర్భంలో పోలీసులు అత‌నిని ప‌ట్టుకెళ్ళి న్యాయ‌మూర్తి ఎద‌ట ప్రవేశ‌పెట్టారు.
న్యాయ‌మూర్తి- చంద్ర‌శేఖ‌ర్ మ‌ద్య జ‌రిగిన సంభాష‌ణ‌....

భార‌త‌దేశ స్వాతంత్ర్య పోరాటంలో చిర‌స్థాయిగా నిలిచిపోతుంది. 15 ఏళ్ళ వ‌య‌స్సులోనే...చంద్రశేఖ‌ర్ కు దేశ‌మంటే ఎంత ప్రేమో తెలిసిపోతుంది.!

  • న్యాయ‌మూర్తి:  నీపేరేంటి?

  • చంద్ర‌శేఖ‌ర్:  ఆజాద్

  • న్యాయ‌మూర్తి: నీ తండ్రి పేరేంటి?

  • చంద్ర‌శేఖ‌ర్ :  స్వాతంత్ర్యం

  • న్యాయ‌మూర్తి: మీ ఇల్లెక్క‌డ‌?

  • చంద్ర‌శేఖ‌ర్ :  జైలు.....    15 ఏళ్ళ కుర్రాడి నుండి ఇలాంటి స‌మాధానాలు విన్న జ‌డ్జ్ అత‌నికి 15 రోజుల జైలు శిక్ష వేశాడు...త‌ర్వాత ఆ శిక్ష‌ను 15 కొర‌డా దెబ్బ‌లుగా మార్చాడు.! అలా ఒక్కొక్క దెబ్బ‌కు భార‌త్ మాతాకీ జై, ఇంక్విలాబ్ జిందాబాద్, వందేమాత‌రం అంటూ నినాదాలు చేశాడు. శిక్ష త‌ర్వాత కోర్ట్ వారిచ్చిన 3 అణాల‌ను కూడా వారి మొఖం మీద విసిరికొట్టాడు.!#వేషం మార్చి- ప‌థ‌కాల రూప‌క‌ల్ప‌న‌.

కాకోరి రైలు ఘ‌ట‌న త‌ర్వాత ...ఆజాద్ ను త‌ప్ప ఆ ఘ‌ట‌న‌కు పాల్ప‌డిన అంద‌ర్నీ పోలీసుల‌కు ప‌ట్టుకున్నారు. ఈక్ర‌మంలో ఆజాద్ ఉత్త‌ర ప్ర‌దేశ్ లోని ఓర్చా అరణ్యంలో సతార్ నది ఒడ్డున వున్న ఆంజనేయ స్వామి ఆలయం ప్రక్కన ఓ కుటీరము నిర్మించుకుని మరిశంకర బ్రహ్మచారీ అనే సాధువుగా మారాడు. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేఖంగా అనేక కుట్ర‌ల‌ను అక్క‌డి నుండే ప్లాన్ చేశాడు.

# వీరుల‌ను విడిపించాల‌ని నెహ్రూని క‌లిసిన ఫ‌లితం లేదు.
భ‌గ‌త్ సింగ్, సుఖ్ దేవ్ , రాజ్ గురు లు ముగ్గురు క‌లిసి బ్రిటీష్ పార్ల‌మెంట్ మీద బాంబు దాడి చేశారు. ఆ క్ర‌మంలో వారు ప‌ట్టుబ‌డ్డారు, వారికి ఉరిశిక్ష ఖ‌రారైంది., వారిని విడిపించ‌డం కోసం ఆజాద్ నెహ్రూని క‌లిశాడు, కానీ నెహ్రూ నుండి మాత్రం ఏ స‌మాధానం ల‌భించ‌లేదు, దీంతో త‌న‌వారిని తానే విడిపించాల‌నే కార‌ణంతో అల‌హాబాద్ లోని ఆల్ఫ్రెడ్ పార్క్ లో త‌న స‌హ‌చ‌రుల‌తో స‌మావేశం జ‌రుపుతుండ‌గా పోలీసులు చుట్టుముట్టారు.


#‘నా చావు నా చేతుల్లోనే ఉంది, శత్రువుల చేతుల్లో చావను..
పై డైలాగ్ ను ఆజాద్ ఎప్పుడూ చెబుతుండే వాడు.... ఆల్ఫ్రెడ్ పార్క్ లో ఆజాద్ ఉన్నాడ‌న్న స‌మాచారాన్ని తెల్సుకున్న పోలీసులు ఆ పార్క్ ను చుట్టుముట్టి కాల్పులు ప్రారంభిచారు. ఈ క్ర‌మంలో ఓ బుల్లెట్ ఆజాద్ తొడ నుండి దూసుకెళ్లింది, అయినా ఆజాద్ పోరాటం ఆప‌లేదు.... ముగ్గురు పోలీసు అధికారుల‌ను కాల్చాడు...ఆయ‌న గ‌న్ లో కేవ‌లం ఒకే బుల్లెట్ ఉండ‌డంతో...అప్ప‌టికే త‌న శరీరంలో మూడు బుల్లెట్ గాయాలుండడంతో...త‌న గ‌న్ తో తానే కాల్చుకొని అమ‌రుడ‌య్యి...తాను చెప్పే మాట‌ను నిజం చేసుకున్నాడు.!

No comments