Header Ads

గురు పూర్ణిమ రోజు వేద వ్యాస పూజ ఎలా చేయాలో తెలుసా

జన్మ సార్థకతకు మోక్షమే ముఖ్యమని దానిని పొందుటకు బ్రమ్హసుత్రములను, అష్టాదశ పురాణములను, శ్రీమద్ భాగవతము, మహా భారతము, అందించి వేదం వాన్గ్మయము నాలుగుగా విభజించి పామరులకు కూడా అర్థము అయ్యేటట్లు మనకు అనుగ్రహించిన వసిష్టుని ప్రపౌత్రుడు శక్తి మహర్షి పౌత్రుడు పరాశర మహర్షి తనయుడు అయిన కృష్ణ ద్వైపాయనుడు అనే వ్యాస మహర్షి పూజ చేయవలసిన రోజు వ్యాస పూర్ణిమ లేక గురు పూర్ణిమ. (ఆషాఢ శుద్ద పౌర్ణమి)

*వ్యాసం వశిష్ట నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం ||వ్యాస మహర్షి సాక్షాత్ శ్రీ మహావిష్ణు అవతారమే. సన్యాసులు అందరు ఈ రోజు విధిగా నారాయణ, బ్రంహ, వశిష్టుడు, శక్తి, పరాశరుడు, వ్యాస, శుక, గౌడపాద, గోవింద భగవత్పాద, ఆదిశంకర, పద్మపాద, హస్తామలక, తోటకాచార్య, వార్తికాచార్య మొదలగు బ్రమ్హసంప్రదాయక గురువులకు పూజ చేసి ఏ ఒక్క జీవముకు బాధ కలిగించకూడదనే సదుద్దేస్యముతో ఆషాఢ పౌర్ణమి నుండి నాలుగు పక్షములు ఒకే చోట ఉండుటకు సంకల్పము చేసుకొందురు.

మనము సన్యాసులు ఉండు స్థలమును అందరు దర్శించి నమస్కరించి వారి అనుగ్రహ భాషణములు శ్రవణము అవస్యము చేయవలనని శాస్త్రములు నొక్కి చెపుతున్నవి. మనమందరూ వేదవ్యాస మహర్షిని మన పూజ్య గురువులను దర్శించి ఆనదము పొందెదము గాక.

వేద వ్యాస పూజ విధానము:


ఒక పరిశుద్దమైన స్థలమును ఎంచుకొని గోమయముతో అలికి పసుపు అక్షతల మండలము ఎర్పరచుకోనవలెను (అక్షతలు కోన విరగని బియ్యముగా ఉండవలెను) తర్వాత ౪౫ (నలుబది ఐదు) నిమ్మ కాయలను సేకరించుకొని కింద చెప్పే విధముగా ఆవరణములు ఎర్పరచుకోవలెను:

౧.) మధ్యలో ఐదు నిమ్మ పండ్లను తీసుకొని కృష్ణ వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ అనే ఐదు దేవతలను ఆవాహన చేసి షోడశోపచారములతో పూజించవలెను

౨) ఈ ఐదు ఫలములకు దక్షిణముగా ఐదు అచార్య పురుషులు వ్యాస, సుమంతు, జైమిని, వైసంపాయన, పైల ఋషులను ఐదు ఫలములందు ఆవాహన చేసి షోడశోపచార పూజలతో పూజించవలెను

౩.) కృష్ణ వాసుదేవులకు ఉత్తరము పక్కన ఆదిశంకర, పద్మపాద, సురేశ్వర, తోటక, హస్తామలకులను ఐదు ఫలములందు ఆవాహనము చేసి షోడశోపచార పూజలతో పూజించవలెను

౪) కృష్ణునకు ఇరుప్రక్కల బ్రంహ రుద్రులను నాలుగు పక్కల నాలుగు ఫలములతో సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులను ఆవాహన చేసి షోడశోపచార పూజ చేయవలెను

౫) కృష్ణునకు పూర్వ భాగమున ఐదు ఫలాము ఉంచి స్వగురు, పరమగురు, పరమేష్టి గురు, పరాత్పర గురు, బ్రంహవిద్య సంప్రదాయ గురువులను ఆవాహన చేసి షోడశోపచార పూజ చేయవలెను

౬) గురు మండలమునకు పూర్వ భాగమున ద్రావిడ ఆచార్యులైన దర్విడాచార్య, గౌడపాద, గోవింద భగవత్పాద, సంక్షేప సారీరికాచార్య, వివరనాచార్యులను ఐదు ఫలముండు ఆవాహన చేసి షోడశోపచారములతో పూజించవలెను వీరితో కూడా శుక నారద ఆచార్యులను ఇరు ఫలములందు ఆవాహన చేసి షోడశోపచార పూజలతో పూజించ వలెను

౭) దిక్ దేవతలైన ఇంద్రుని పూర్వ భాగమున, అగ్నిని ఆగ్నేయ భాగమున, యముని దక్షిణమున, నిర్రుతిని నైరుతి యందు, పశ్చిమమున వరుణుని, వాయవయమున వాయువును, ఉత్తరమున కుబేరుని, ఈశాన్యమున ఈశ్వరుని వరునునికి పశ్చిమమున గణపతి క్షేత్రపాలక, దుర్గ, సరస్వతులను వేవ్వేరుగా ఫలములందు ఆవాహన చేసి షోడశోపచారములతో పూజించవలెను.

పైన చెప్పబడిన అన్ని దేవతలను ప్రతి ఒక్కరు విధిగా పూజించవలెను, శక్తి సౌకూర్యములు లేకపోతె వ్యాస పూజ జరిగే స్థలమునకు వెళ్లి భక్తీ శ్రద్దలతో వీక్షించి వ్యాసాది మహర్షుల కృపకు పాత్రులు కావలెను.

మరింత సమాచారం మీకోసం  :

1.  అసలు గురు పౌర్ణమి ఎందుకు జరుపుకుంటారో , సాయి బాబాని ఎందుకు ఈ రోజు పూజిస్తారో తెలుసా ??

2.   గురుపూర్ణిమ గురించి చాల మందికి తెలియని విషయాలు ఇవే

No comments