Header Ads

భారత్‌ మహిళా ఫుట్‌బాల్‌ జట్టు కెప్టెన్‌గా తెలుగమ్మాయి సౌమ్య

మన తెలుగు అమ్మాయి, ఫుట్‌బాల్‌ క్రీడాకారిణి సౌమ్య కు అరుదైన అవకాశం దక్కింది. నిజామాబాద్‌ జిల్లా రేంజల్‌ మండలం కిసాన్‌ నగర్‌ తండాకు చెందిన గుగులోత్‌ సౌమ్య భారత అండర్‌-17 మహిళా ఫుట్‌బాల్‌ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైంది.

చాలా టాలెంట్ ఉన్నప్పటికీ మొదట అసలు జట్టులోకి ఎంపిక అవుతుందో లేదో అని అందరూ ఎదురు చూసారు . మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన సౌమ్య ఫుట్‌బాల్‌ క్రీడలో అద్భుత ప్రతిభ కనబరుస్తూ అంచెలంచెలుగా ఎదిగింది.ఇక చివరికి ఆ రోజు రానే వచ్చింది , సౌమ్య భారత మహిళల ఫుట్‌బాల్‌ జట్టులో చోటు దక్కించుకున్నట్లు తెలంగాణ ఫుట్‌బాల్‌ సంఘం ఇటీవలే ప్రకటించింది. ఇంతలోనే సెలెక్ట్ అయిన అందరిలో కన్నా ఎక్కువ ప్రతిభ కనబరిచింది అని ఆమెను భారత జట్టుకు సారథ్యం వహించమని కోరారు . సౌమ్య సారథ్యం వహించనుందనే వార్త రావడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

సౌమ్యది నిరుపేద కుటుంబం. ఆమె తల్లి దండ్రులకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక అబ్బాయి. ఆడపిల్లల్లో అందరి కంటే చిన్న అమ్మాయి సౌమ్య. పాఠశాల దశలో జరిగిన పోటీ ల్లో పరు గుపందెంలో అద్భుత ప్రతిభ కనబరిచిన సౌమ్య ఏడో తరగతిలో ఉండగానే జిల్లా అధికారుల దృష్టిని ఆకర్షించింది. 400మీ, 800మీ. పరుగులో అద్భుతంగా రాణించిన సౌమ్య ప్రతిభను గుర్తించిన నాగరాజు కోచ్‌ అవతారమెత్తారు. ప్రత్యేకంగా అకాడమీ ఏర్పాటు చేసి శిక్షణ ప్రారంభించారు. కోచ్ నాగరాజు ప్రత్యక శ్రద్ధ తీసుకుని సౌమ్య కి ఫుట్ బాల్ ఆటలో మెళుకువలు నేర్పించారు .


దక్షిణాఫ్రికాలో జరుగుతున్న బ్రిక్స్‌ అండర్‌ 17 ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో పాల్గొనడానికి సౌమ్య సారథ్యంలోని భారత జట్టు అక్కడికి వెళ్లింది. సౌతాఫ్రికాతో జరిగే మ్యాచ్‌ కోసం ముమ్మరంగా సాధన చేస్తోంది. సౌతాఫ్రికాతో పాటు బ్రెజిల్‌, రష్యా, చైనా జట్లతో భారత జట్టు తలపడనుంది.

సౌమ్య మరియు తన తోటి క్రీడాకారులు మన దేశానికి మంచి పేరు తీసుకొస్తారు అని కోరుకుందాం

No comments