Header Ads

బిగ్ బాస్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన నూతన్ నాయుడు

తెలుగు బిగ్ బాస్ హౌస్ లో అప్పుడే టైటిల్ పోరు మొదలైపోయింది. హౌస్ లో ఒకరి మీద మరొకరి చేసుకునే ఆరోపణలు అన్ని చూస్తుంటే హౌస్ లో సభ్యుల పెర్ఫామెన్స్ కొంచం మెరుగు అయ్యింది అని చెప్పచ్చు. ఇంక టైటిల్ దక్కించుకోవడం కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఈ మధ్యలో వైల్డ్ కార్డు ఎంట్రీ, ఎలిమినేట్ అయిన వారిని తిరిగి ఓటింగ్ ద్వారా హౌస్ లోకి తీసుకుని వచ్చే విధానం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కాగా ఈ వారం మాత్రం మటుకు ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎలిమినేషన్ లేకుండా, ఓటింగ్ ప్రక్రియలో ఎలిమినేట్ అయిన సభ్యులలో ఎవరు తిరిగి హౌస్ లోకి చేరుకుంటారు అనేది ఉత్కంఠగా మారింది.




ఇక ఇప్పటివరుకు ఎలిమినేట్ అయిన వారిలో సంజన , నూతన్ నాయుడు , కిరీటి , శ్యమలా , భాను , తేజస్వి ఉన్నారు . ఇక ఇప్పటివరకు ఎవరికి ఎక్కువ ఓట్లు ఈ వారం వస్తే వారే మళ్ళి రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు.

అందరి అంచనాలు తగినట్టే నూతన్ నాయుడు మళ్ళి తరిగి తెలుగు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నారా అంటే అవుననే మాట వినిపిస్తున్నది. ఎందుకంటే బిగ్‌బాస్ హౌస్ నుంచి ఆరంభంలోనే ఎలిమినేట్ అయిన నూతన్ మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త పలువురు ధృవీకరించడమే కాకుండా స్వయంగా నూతన్ ఆ దిశగా సోషల్ మీడియాలో సిగ్నల్స్ ఇస్తున్నారు. నూతన్ నాయుడు రీ ఎంట్రీ గురించి ఆసక్తికరమైన అంశాలు ఇవే..
ఓటింగ్ పూర్తయిన తర్వాత బిగ్‌బాస్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఎలిమినేట్ అయిన సెలబ్రిటీలను తిరిగి మళ్లీ వెనకకు రప్పిస్తున్నారు. అందులో భాగంగానే ఓటింగ్ నిర్వహించారు. శుక్రవారం రాత్రి వరకు ఓటింగ్ పూర్తయింది. ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత నూతన్ నాయుడు జోష్ సోషల్ మీడియాలో హోరెత్తుతున్నది.

అదేంటీ ఎపిసోడ్‌ జరగక ముందే ఎలా తెలిసిందంటారా? అదంతే.. గత అయిదు ఎపిసోడ్‌లుగా తెలిసినట్టే ఈ సారి కూడా లీకైంది. ఆదివారం జరగాల్సిన ఎపిసోడ్‌ ఒక రోజు ముందు షూటింగ్‌ చేస్తారన్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఆ షూట్‌కు వెళ్లే ప్రేక్షకులు ఎలిమినేషన్‌ విషయాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుండటంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది.

నూతన్ నాయుడు కి కౌశల్ అభిమానులు , మరియు వివిధ హీరోలు అభిమానులు అతనికి అండగా ఉన్నారు . తేజస్వి ఇంక లోపాలకి వెళ్లట్లేదు అని ధ్రువీకరించింది. ఈ రోజు పొద్దున్న ఇంస్టాగ్రామ్ లో తాను పోస్ట్ చేసింది .

No comments