Header Ads

మిగతా మోటారు వాహనాల టైర్లలో లాగా రేస్‌కార్ల టైర్లలో మామూలు గాలి ఎందుకు నింపరో తెలుసా

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును. అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం.




మిగతా మోటారు వాహనాల టైర్లలో లాగా రేస్‌కార్ల టైర్లలో మామూలు గాలి ఎందుకు నింపరు అనేదానికి సమాధానం ఇదే :

మనం తిరిగే కార్లు, బైక్స్‌ ఇతర వాహనాల టైరల్లోకి గాలిని వాడతాం. రేస్‌కార్ల టైర్లలో గాలికి బదులు నైట్రోజన్‌ వాయువును నింపుతారు. మన బైక్ లో నింపే గాలి లో 78 % నైట్రోజన్ , 21 % ఆక్సిజన్ ,మిగతావి కొంచం నీటియావిరి కార్బన్ డయాక్సైడ్ ఉంటాయి.

అన్నిటికన్నా ముఖ్యమైనది నైట్రోజన్ గ్యాస్ టైర్ రబ్బర్ నుండి తరలిపోవుడానికి తక్కువ ఆస్కరాం ఉంది ఆక్సిజన్ కన్నా. దీనిబట్టి ఏం చెప్పచ్చు అంటే నైట్రోజన్ గ్యాస్ ఎక్కువ సేపు టైర్ లో ఉంటుంది మరియు అలాగే మీ టైర్ ని స్థిరమైన స్థానంలో ఉంచుతుంది. మీ టైర్ నిలకడైన ప్రదర్శన ఇస్తుంది అలాగే తక్కువ సార్లు గ్యాస్ నింపుకోవాల్సివుంటుంది.

రేస్ కార్లు చాలా వేగం గా వెళ్లడం ద్వారా టైర్ కి చాలా ఒత్తిడి పడుతుంది అలాగే టైర్ కూడా చాలా వేడిఎక్కుతుంది . అలాగే నైట్రోజన్ గ్యాస్ ఎంత వేడిఎక్కినా తక్కువ శాతం తన వైఖరిని మార్చుకుంటుంది . దీని ద్వారా ఎక్కువ దూరం తక్కువ సేపు వెళ్ళడానికి ఆస్కారం ఉంది.

దీనికి కారణం నైట్రోజన్‌ వాయువులో ఉష్ణం వల్ల ఉత్పన్నమయే సంకోచ, వ్యాకోచాలు సమంగా ఒకే తీరులో ఉంటాయి. మామూలు గాలిలో కొంత శాతం తేమ కూడా ఉండటం వల్ల దాని సంకోచ, వ్యాకోచాలు ఒకే తీరుగా ఉండవు. ఫలితంగా టైర్లలో ఉండే ఒత్తిడిలో తేడాలు వస్తాయి. రేస్‌ కార్లు అత్యంత వేగంతో ప్రయాణించేటపుడు టైర్లలో ఎక్కువ వేడి పుడుతుంది. దాని ప్రభావం వాటి లోపల ఉండే వాయువు మీద పడుతుంది. గాలి కన్నా నైట్రోజన్‌పై ఉష్ణ ప్రభావం తక్కువగా ఉంటుంది కాబట్టి నైట్రోజన్‌ను వాడటం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

ఇదే ఆక్సిజన్ శాతం ఎక్కువగ మనం నింపే బైక్ లో తేమ శాతం ఉంటుంది. ఇది బైక్ ఎక్కువ స్పీడ్ వెళ్లినా లేకా రేస్ కార్ లో నింపినా , ఈ తేమ వేడికి ఎక్కువ అవుతుంది .టైర్ లో తేమ సైతం ఎక్కువ అవ్వడం వళ్ళ బయట ఉన్న వేడికి ఇంకా ఎక్కువ ఒత్తిడికి గురి అయ్యి టైర్ ని పాడు చేయడానికి మరియు టైర్ తో పాటు ఉండే స్టీల్ మరియు అల్యూమినియం రిం ని క్షయించడం ప్రారంభిస్తుంది.

నైట్రోజన్ గ్యాస్ నింపడం ద్వారా మీ టైర్ మీద పడే ఒత్తిడి ఒకే లాగ ఉండటం వళ్ళ మీకు మైలేజీ ఎక్కువ ఇవ్వటం మరియు టైర్ కి ఎక్కువ రోజులు కొనసాగించు ఆస్కారం ఉంది.

No comments