Header Ads

పాక్ ప్ర‌ధానిగా ఇమ్రాన్ ఖాన్- ఇండియాతో పాక్ సంబంధాలు ఎలా ఉండ‌బోతున్నాయి?

ఎంతో ఉత్కంఠ‌, ఒక‌రిపై ఒక‌రు తీవ్ర ఆరోప‌ణ‌లు, వాడి వేడి ప్ర‌చారం... ఆత్మ‌హుతి దాడులు...ఇలా మొత్తంగా పాక్ ఎన్నిక‌లు ముగిశాయి, ఫ‌లితాలు కూడా వ‌చ్చేశాయి. ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ ప్ర‌ధాని కాబోతున్నారు. ఈ నేప‌థ్యంలో అస‌లు ఇమ్రాన్ ఖాన్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి.? ఖాన్ ప్ర‌ధాని అయితే...ఇండియా- పాక్ రిలేష‌న్స్ ప‌రిస్థితి ఏంటి? అనే విష‌యాల‌ను క్లుప్తంగా తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం.!

1) ఇమ్రాన్ పాకిస్థాన్ లోని పంజాబ్ లో జ‌న్మించాడు. ఇమ్రాన్ తండ్రి సివిల్ ఇంజ‌నీర్. ఆర్థికంగా బాగా సెటిల్ అయిన కుటుంబం.

2) ఆక్స్‌ఫర్డ్ యూనివ‌ర్సిటీ నుండి ఫిలాస‌పి, పొలిటిక‌ల్ సైన్స్, ఎక‌నామిక్స్ లో గ్యాడ్యుయేష‌న్ చేశాడు.

3) 1992లో క్రికెట్ ప్రపంచకప్‌ గెలిచిన పాకిస్తాన్ టీమ్ కు కెప్టెన్ ఇమ్రాన్ యే...ఈ క‌ప్ గెల‌వ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు.



4) వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచాక‌..క్రికెట్ నుండి త‌ప్పుకున్న ఖాన్...స్వ‌చ్చంధ సంస్థ‌ను ప్రారంభించి..త‌ల్లి పేరు మీద రెండు క్యాన్స‌ర్ హాస్పిట‌ల్స్ ను
స్థాపించాడు.

5) 1996 లో PTI ( పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ ) పార్టీని స్థాపించాడు.

6) 2002లో తొలిసారి మియాన్‌వాలి స్థానం నుంచి జాతీయ అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

7) ఇమ్రాన్ ఖాన్ 3 పెళ్లిళ్లు చేసుకున్నారు. 1) జెమిమా గోల్డ్ స్మిత్ ( 1995-2004), 2) రెహ‌మ్ ఖాన్ ( 2015-2015)., 3) బ‌ష్రా మ‌నేక ( ప్ర‌స్తుతం)




భార‌త్ తో సంబంధాలు...?

గెలిచాక ఇమ్రాన్ త‌న తొలి ప్రెస్ మీట్ లో... భారత్ మా వైపు ఒక్క అడుగు వేస్తే చాలు.. మేం రెండడుగులు వేస్తాం. కానీ, భారత్ వైపు నుంచి ఆ ప్రక్రియ మొదలైతే మంచిది. అని చాలా సాఫ్ట్ గా అన్న‌ప్ప‌టికీ ....ఇమ్రాన్ ప్ర‌ధాని కావ‌డం భార‌త్ కు కాస్త వ్య‌తిరేఖ‌మే అని చెప్పాలి. ఇండియాకు అనుకూలంగా ఉన్నారంటూ గ‌తంలో అనేక‌మార్లు మాజీ పాక్ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్ పై తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు చేశాడు. 72 ఏళ్ళ స్వాతంత్ర్య పాకిస్థాన్ లో మొట్ట మొద‌టి సారిగా ఓ ప్ర‌భుత్వం 5 ఏళ్ళ ప‌రిపాల‌న త‌ర్వాత ప్ర‌జాస్వామ్య ప‌రంగా ఎన్నికైన ఇమ్రాన్ ఖాన్ పై ....సైన్యానికి అనుకూలంగా ఉంటార‌నే విమ‌ర్శలు సైతం ఉన్నాయి. పార్టీ పెట్టిన కొత్తలో ఇస్లామిక్‌ తీవ్రవాదానికి, అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన ఖాన్ క్ర‌మంగా తన వైఖరి మార్చుకుంటూ వ‌చ్చారు. మత ఛాందసవాదిగా మారడంతో పాటు సైన్యానికి దగ్గరయ్యా రు. పాక్‌లోని ఉగ్ర సంస్థ హర్కతుల్‌ మొజాహిదీన్‌ అధినేత మౌలానా ఫజులుర్‌ రెహమాన్‌ వంటి వారు ఇమ్రాన్‌ పార్టీకి మద్దతు ప్రకటించారు. ఇమ్రాన్‌కు పాక్‌ సైన్యం, ఐఎస్‌ఐ, తాలిబాన్, ఇతర ఉగ్ర సంస్థల మద్దతు కూడా ఉందన్నది కాదనలేని వాస్తవం.


ఇమ్రాన్ సైన్యం చేతిలో కీలుబొమ్మ‌గా మార‌తాడా..? లేదా సైన్యాన్ని పూర్తిగా త‌న కంట్రోల్ లో పెట్టుకుంటాడా? అనేది రాను రాను చూడాలి.? రెండిటిలో ఏది జ‌రిగినా ...ఇండియాతో పాక్ స‌త్సంబంధాలు కొన‌సాగ‌డం క‌ష్ట‌మే. ప్ర‌పంచంలో ఎక్క‌డ బాంబ్ పెట్టినా ఇండియా పాకిస్థాన్ యే పెట్టింది అని ఆరోపిస్తుంద‌ని, ఇండియ‌న్ మీడియా త‌న‌ను బాడివుడ్ విల‌న్ లాగా చూపిస్తుంది అన‌డంతో..ఇమ్రాన్ ఖాన్ ఆటిట్యూడ్ అర్థం చేసుకోవొచ్చు.! జిన్నా ఆశ‌యాల‌ను కొన‌సాగిస్తాను, 50 శాతం ప్ర‌జ‌లు పేద‌రికంలో ఉంటే నేను విలాస‌వంత‌మైన భ‌వనాల్లో ఎంజాయ్ చేయ‌ను అంటూ ఖాన్ చెప్పిన మాట‌లు మాట‌లుగానే మిగులుతాయా? లేక పాక్ లో ఓ స‌రికొత్త ప్ర‌జాస్వామ్య పాల‌న‌ను అందిస్తాడా? అనేది చూడాలి.

No comments