Header Ads

ఏ వయసు వారు ఎంత దూరం ప్రతిరోజు నడవాలో తెలుసుకోండి

ఏ వయసు వారు ఎంత దూరం ప్రతిరోజు నడవాలి , వాకింగ్ చేసేటప్పుడు ఈ కింద విధంగా మీ వయసు కి తగ్గట్టుగా ఈ కింద ఇచ్చిన సమయం లో పూర్తి చేయాలి మీ వాకింగ్.



వయసు - దూరము - ఎన్ని నిమిషాల్లో పూర్తి చేయాలి ::

  •  40 సంవత్సరాలు మరియు అంతకన్నా తక్కువ వయసు ఉన్నవారు - ఒక కిలోమీటర్ ని 8 నిమిషాల్లోపు పూర్తి చేయాలి

  • 40 సంవత్సరాలు నుంచి 45 సంవత్సరాలు వరకు వయసు ఉన్న వారు - ఒక కిలోమీటర్ ని 8 నిమిషాలు నుండి 8.5 నిమిషాల్లోపు పూర్తి చేయాలి

  • 45 సంవత్సరాలు నుంచి 50 సంవత్సరాలు వరకు వయసు ఉన్న వారు - ఒక కిలోమీటర్ ని 8.5 నిమిషాలు నుండి 9 నిమిషాల్లోపు పూర్తి చేయాలి

  • 50 సంవత్సరాలు నుంచి 55 సంవత్సరాలు వరకు వయసు ఉన్న వారు - ఒక కిలోమీటర్ ని 9 నిమిషాలు నుండి 9.5 నిమిషాల్లోపు పూర్తి చేయాలి

  • 55 సంవత్సరాలు నుంచి 60 సంవత్సరాలు వరకు వయసు ఉన్న వారు - ఒక కిలోమీటర్ ని 9.5 నిమిషాలు నుండి 10 నిమిషాల్లోపు పూర్తి చేయాలి

  • 60 సంవత్సరాలు మరియు అంతకన్నా ఎక్కువ వయసు ఉన్నవారు - ఒక కిలోమీటర్ ని 11 నిమిషాల్లోపు పూర్తి చేయాలి.

వయసు తో నిమ్మితం లేకుండా ప్రతి రోజు ప్రతి ఒక్కరు కనీసం 30 నిమిషాలు తప్పకుండా నడవాలి .

ఏ వయసు వారు ఎంత నడవాలి :

  • 40 సంవత్సరాలు మరియు అంతకన్నా తక్కువ వయసు ఉన్నవారు ప్రతి రోజు కనీసం 3.75 కిలోమీటర్లు నడవాలి .

  • 45 సంవత్సరాలు నుంచి 50 సంవత్సరాలు వరకు వయసు ఉన్న వారు ప్రతి రోజు కనీసం 3.5 కిలోమీటర్లు నడవాలి.

  • 45 సంవత్సరాలు నుంచి 50 సంవత్సరాలు వరకు వయసు ఉన్న వారు ప్రతి రోజు కనీసం 3.3 కిలోమీటర్లు నడవాలి .

  • 50 సంవత్సరాలు నుంచి 55 సంవత్సరాలు వరకు వయసు ఉన్న వారు ప్రతి రోజు కనీసం 3.1 కిలోమీటర్లు నడవాలి.

  • 55 సంవత్సరాలు నుంచి 60 సంవత్సరాలు వరకు వయసు ఉన్న వారు ప్రతి రోజు కనీసం 2.8 కిలోమీటర్లు నడవాలి.

  • 60 సంవత్సరాలు మరియు అంతకన్నా ఎక్కువ వయసు ఉన్నవారు ప్రతి రోజు కనీసం 2.5 కిలోమీటర్లు నడవాలి.

ఒక సర్వే ప్రకారం ఎ మనిషి అయితే ప్రతి వారం కనీసం 2 గంటలు నడుస్తాడో , అతని 40% మిగాతవారికన్నా ఆరోగ్యంగా మరియు వ్యాధులు రాకుండా ఉంటాయి. రోజు వాకింగ్ చేయడం వల్ల వొంట్లోని కొవ్వు కరుగుతుంది. మన రక్తపోటు కూడా కంట్రోల్ లో ఉంటుంది. రోజు నడవడం వలన మధుమేహం రాకుండా ఉంటుంది. రోజు వాకింగ్ మరియు వ్యాయామం చేస్తే హార్ట్ ఎటాక్ లాంటివి రావడానికి అతి తక్కువ ఆస్కారం ఉంది.


రోజు నడవడానికి సమయం లేని వారు ఈ కిందివి దయచేసి గుర్తుంచుకోండి  :


1) నడకకు కాలంతో పనిలేదు కాళ్ళతోనే
2) కాళ్ళు కష్టపడితే , ఒళ్ళు సుఖపడుతుంది
3) కాళ్ళు ముందడుగు వేస్తే రోగం వెనుకంజ వేస్తుంది
4) నడక ఆరోగ్యాన్నే కాదు, పరిచయాలనీ మెరుగుపరుస్తుంది
5) కాళ్ళు రోడ్డునపడితే ఒళ్ళు తేలికపడుతుంది
6) నవ్వుతూ నడవండి సుఖంగా బ్రతకండి
7) ఆయుష్ ప్రమాణం పెరగాలంటే కాళ్ళ మీద ప్రయాణం కావాలోయ్
8) కలసి నడుద్దాం , వెతలు మరుద్దాం
9) కాళ్ళు రోడ్డున పడితే జబ్బులు దిగాలు పడతాయి
10) రోగానికి లింగభేదం లేదు వయోభేదం లేదు
11) ఉదయపు నడకకు రారండి ఉచితంగా విటమిన్ " & " పొందండి
12) కాళ్ళు రోడ్డెక్కి తే రోగం అటకెక్కుతుంది !

మీ మిత్రులతో ఈ సమాచారం షేర్ చేయండి

No comments