మనిషి రూపంలో పంది.! ఇదంతా ఫేక్..మరి అసలు నిజమేంటి.?
పంది కడుపున మనిషి...బ్రహ్మంగారు చెప్పిన మాట అక్షరసత్యమైంది....అంటూ రెండు రోజుల నుండి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న వార్త ఉత్త బోగస్ వార్త. అదంతా ఆకతాయిల సృష్టి. మొదట కెన్యాలో..ఓ పంది కడుపున మనిషిని పోలిన జీవి పుట్టిందంటూ వచ్చిన వార్తలు తర్వాత తర్వాత తెలుగు రాష్ట్రాల్లోనే ఈ వింత జరిగిందంటూ పుకార్లు వచ్చాయి.! ఎవరికి వారు ఈ వార్తకు తమదైన మసాలా దట్టించి.... వాట్సాఫ్, ఫేస్ బుక్..ఇలా దేంట్లో పడితే దాంట్లోకి తోసేశారు.! అది కాస్త వైరల్ గా మారి ...ఔరా అనేలా చేసింది!
ఇంతకీ నిజమేంటి..?
అది ఓ సిలికాన్ బొమ్మ.! మగానుకో లైరా అనే ఓ ఆర్టిస్ట్ రూపొందించిన కళాఖండం. ఆమె ఇలాంటి అనేక బొమ్మలను తయారు చేశారు. వాటిని స్వయంగా తన వెబ్ సైట్ లో అమ్మకానికి కూడా పెడుతుంటారు. అయితే ఈ వార్త తెలుసుకున్న లైరా స్పందిచారు. ప్రపంచ వ్యాప్తంగా వైరల్ గా మారిన ఈ రూపాన్ని రూపొందించింది మరెవరో కాదు..నేనే అంటూ తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు లైరా.! మీకు కావాలంటే 80 వేలకు కొనుక్కోవొచ్చు అని తన వెబ్ సైట్ లింక్ కూడా ఇచ్చారామె.!
దీనికి మనోళ్లు...చేతికొచ్చింది రాసుకుంటూ పోయారు. గతంలో కర్నాటకలో కూడా ఇలాంటి ఓ ఫేక్ వార్తే హల్చల్ చేసింది. ఓ కోతికి కాస్త మేకప్ వేసి...ఏలియన్ గా చిత్రీకరించిన వీడియో దాదాపు అందరి వాట్సాప్ లను పలకరించింది.! అలాంటిదే ఈ వార్త కూడా....షేర్ చేసే ముందు కాస్త ఆలోచిద్దాం. వాట్సాప్ ను శుద్ది చేద్దాం.!

Post a Comment