Header Ads

పెళ్ళైన‌.... యేడాది త‌ర్వాత నా భార్య‌కిచ్చిన విలువైన గిఫ్ట్.!?

నేనుండేది ముంబాయ్ స్ల‌మ్ ఏరియాలో.....నా అనే వాళ్లెవ్వ‌రూ లేకుండా పెరిగిన ఏక్ నిరంజ‌న్ ని.! య‌వ్వ‌న‌మంతా...టైమ్ పాస్ తోనే గ‌డిచిపోయింది. పాత సామాను ఏరుకోవ‌డం అమ్మ‌డం...వ‌చ్చిన డ‌బ్బుతో...గుట్కా, మ‌ట్కా ఇలా సాగింది. ఏ రోజు ఎక్క‌డ ప‌డుకుంటానో కూడా నాకు తెలియ‌దు.! అలాంటి స్థితిలో ఉన్న నాకు ఓ అమ్మాయితో పెళ్ళైంది....ఆమె కూడా మా స్ల‌మ్ ఏరియా ఏంజిల్ యే.! ఆమె ఉద్యోగం కూడా సేమ్ టు సేమ్ నాదే.! అంటే పాత సామాను ఏరుకోవ‌డం...అమ్మ‌డం.. ఒక్క‌టే తేడా...నేను అలా వ‌చ్చిన డ‌బ్బు ఎంజాయ్ కి కేటాయిస్తే...ఆమె మాత్రం వాళ్ళ అమ్మ మందుల‌కు ఖ‌ర్చు చేసేది.!

పెళ్లి త‌ర్వాత నేను కూడా వాళ్లుండే ఇంటికే షిఫ్ట్ అయ్యాను... ఆ ఇల్లు అటు ఇటుగా బాత్ రూమ్ కంటే కాస్త పెద్ద‌దిగా ఉంటుంద‌తే.! ఆ రోజు రాత్రి మా అత్తామామ బ‌స్టాండ్ లో ప‌డుకొని వాళ్లింటిని మాకోసం ఇచ్చేవారు...శోభ‌నం క‌దా.!!!
తెల్లారింది.... నా భార్య ప‌బ్లిక్ టాయిలెట్ కు ప‌రిగెత్తింది. 5 రూపాయ‌లిచ్చి త‌న కాల‌కృత్యాలు తీర్చుకుంది. రోజూ వాళ్లింట్లో ఆడ‌వాళ్ల‌ది ఇదే ప‌రిస్థితి. మ‌న ప‌రిస్థితి అలా కాదు...రోడ్డు మీదే స్నానం అది కూడా వారానికోసారి, ఇక కాల‌కృత్యాలైతే ఎక్క‌డ ప్లేస్ దొరికితే అక్క‌డే.!! అప్ప‌టి వ‌ర‌కు నేను చాలా మంది అమ్మాయిలు ఇలా ప‌బ్లిక్ టాయిలెట్స్ ముందు లైన్లు క‌ట్ట‌డం చూశాను...బ‌ట్ నా భార్యది కూడా అదే ప‌రిస్థితి అనే స‌రికి నా మ‌న‌స్సులో క‌ళుక్కుమంది.!

ఇక ఆ రోజు నుండి నేను ఎక్కువ‌గా శ్ర‌మించ‌డం స్టార్ట్ చేశాను...డ‌బ్బుకోసం ఏ ప‌నిదొరికితే ఆ ప‌నిచేశాను... కొంత డ‌బ్బు పోగు చేసుకున్నాను. కాలం గిర్రున్న తిరిగింది...తెల్లారితే నా పెళ్లిరోజు... తెల్లారింది అప్ప‌టి వ‌ర‌కు నేను దాచుకున్న డ‌బ్బుతో....నా భార్య‌ను ఓ 3 స్టార్ హోట‌ల్ కు తీసుకెళ్లాను..ఓ రూమ్ బుక్ చేశాను...ఆ రూమ్ లో బాత్రూమ్ దాదాపు మా ఏరియాలో నాలుగు ఇండ్లు ప‌ట్టేంత పెద్ద‌దిగా ఉంది.!
ఆ రోజు ఇద్ద‌రం దాదాపు 5 సార్లు ష‌వ‌ర్ కింద స్నానం చేశాం. నాకే కాదు నా భార్య‌కు కూడా ష‌వ‌ర్ రూమ్ లో అది కూడా విశాలమైన బాత్రూమ్ లో స్నానం చేయ‌డం అదే ఫ‌స్ట్ టైమ్.! ఆనందంతో నా భార్య ఏడ్చేసింది.! స్నానం కోసం బ‌కెట్ నీళ్ళ‌కు పెద్ద యుద్ద‌మే చేయాల్సిన మాలాంటి బ‌తుకుల్లో...3 స్టార్ హోట‌ల్ స్నానం నిజంగా ఆకాశంలో తేలిన అనుభూతే.!!

No comments