Header Ads

కొన్ని రోజుల్లో తెలంగాణలో ప్రతి సిలిండర్‌తో పాటు మూడు మొక్కలు ఉచితం

తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న కార్యక్రమం హరితహారం . ఈ కార్యక్రమంలో భాగంగా చాలా లక్షల్లో మొక్కలు తెలంగాణా వ్యాప్తంగా నాటుతున్నారు. అనేక సంస్థలు ప్రైవేట్ వారు కూడా స్వచ్చంధంగా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.




అయితే ఇప్పుడు ఆ వంతు గ్యాస్ డీలర్ల వద్దకు కూడా చేరింది. హరితహారం కార్యక్రమంలో పాల్గొనడానికి గ్యాస్ డీలర్ల సంఘం కూడా ముందుకు వచ్చింది.. రాష్ట్ర గ్యాస్ డీలర్ల సంఘం నాయకులతో సచివాలయంలో ముఖ్యమంత్రి ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్ మంగళవారం సమావేశమయ్యారు. సమాజంలో ప్రతీ ఒక్కరూ హరితహారంలో భాగస్వామ్యం కావాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షను డీలర్ల సంఘం దృష్టికి ప్రియాంక వర్గీస్ తీసుకరాగా వారు సంసిద్ధత వ్యక్తం చేసారు.

అయితే ఇంక ఇప్పటినుంచి ప్రతి గ్యాస్ సిలిండర్‌తో పాటు ప్రతీ ఇంటికి మూడు మొక్కలు అందజేయాలని గ్యాస్ డీలర్ల సంఘం నిర్ణయించింది. రాష్టవ్య్రాప్తంగా ఏడు వందల మంది ఎల్‌పీజీ డీలర్లు ఉన్నారు అని , అంతకి ఆరు ఇంతలా సంఖ్యలో గ్యాస్ డెలవరీ బాయ్స్ ఉన్నారని డీలర్ల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రావు తెలిపారు. రాష్ట్రంలో సగటున రోజుకు లక్షా యాబై వేల సిలిండర్లను డెలివరీ చేస్తున్నామన్నారు. సిలిండర్లతో పాటు గ్యాస్ వినియోగదారులకు తులసి, కరివేపాకు, పూలు, పండ్ల మొక్కలను అందించే విధంగా కార్యాచరణను రూపొందించుకోవాలని ఓఎస్‌డీ ఆదేశించినట్టు వెంకటేశ్వర్‌రావు తెలిపారు. సీఎం ఇచ్చిన హరితహారం పిలుపులో తాము భాగస్వామ్యం అవుతామని ఆయన తెలిపారు.

అయితే ఈ మొత్తం కార్యాచరణలోకి రావడానికి కొంచం సమయం పట్టినా , ఈ మంచి ఆలోచనని మనం అందరం అభినందిచాలి , కచ్చితంగా 3 మొక్కలు మటుకు ప్రతి గ్యాస్ డెలివరీ తో ఇవ్వాలి అనేది నిర్ణయించారు , గ్యాస్ డీలర్ల కూడా తాము ఇవ్వడానికి రెడీ గా ఉన్నాం అని చెప్పడం హర్షణీయం

No comments