Header Ads

ప్రేమించ‌డం తప్పు కాదు.,స‌రైన వారిని ప్రేమించ‌క‌పోవ‌డమే త‌ప్పు.! ఇదే త‌ప్పు చేసిన ఓ యువ‌తి రియ‌ల్ స్టోరి.

నా చిన్న‌నాటి స్నేహితుడ‌త‌ను.... తెల్లారడంతోనే మొద‌ల‌య్యేవి మా ఆట‌లు, క‌లిసి ప‌తంగులెగురేయ‌డం, మామిడి తోట‌లో దొంగ‌త‌నాలు చేయ‌డం, మా ఊరి చెరువులో ఈత‌కొట్ట‌డం..త‌నెక్క‌డుంటే నేన‌క్క‌డ ఉండాల్సిందే.. అలా ఉండేది మా స్నేహం.! కాలంతో పాటు మా స్నేహం కూడా పెరిగి ప్రేమ‌గా మారింది. అది కాస్త ఇంట్లో తెలిసి...మా నాన్న‌, అన్న‌య్య ఇద్ద‌రూ క‌లిసి న‌న్ను కొట్టారు... ఆ దెబ్బ‌ల‌కు నా బొక్క‌లు విరిగాయి, నోట్లోంచి రక్తం ప‌డింది. అయినా అత‌నిపై నా ప్రేమ ఇంకా పెరిగింది. ఇద్ద‌రం క‌లిసి ఊరొదిలి పారిపోయాము.

ఇద్ద‌రం క‌లిసి ...ఓ పెద్ద టౌన్ లో చిన్న రూమ్ ను అద్దెకు తీసుకొని మా కొత్త జీవితాన్ని ప్రారంభించాము. అత‌ను టెక్స్ టైల్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. నేను మా ఇంటి ఏరియాలో ఉండే ఇండ్ల‌లో పాచిప‌ని చేసేదానిని. చిన్న ఉద్యోగాలు, చిన్న ఇళ్ళు...కానీ మ‌న‌సుల నిండా బోలెడంత ప్రేమ‌.! ఒక్కోసారి ఆయ‌న నైట్ డ్యూటీ కూడా చేసేవారు...ఆయ‌న కోసం తెల్లారేవ‌ర‌కు ఎదురుచూసిన రోజులు అనేకం...అయినా ఆ ఎద‌రుచూపుల్లో భ‌లే ఆనందముండేది.!
ఓ రోజు....సాయంత్రం నేను ఇంట్లో ఉన్న స‌మ‌యాన‌..మా ఆయ‌న‌తో పాటు అదే టెక్స్ టైల్స్ కంపెనీలో ప‌నిచేసే మ‌రో వ్య‌క్తి నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాడు. మీ ఆయ‌న మా కంపెనీలో ప‌నిచేసే ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, కంపెనీ ద‌గ్గ‌రే ఓ ఇళ్లు రెంట్ కు తీసుకొని వాళ్లిద్ద‌రూ ఉంటున్నార‌ని చెప్పాడు. అత‌ని మాట‌ల్లో నిజం లేద‌ని నాక‌నిపించింది...ఎందుకంటే మా ప్రేమ అంత స్వ‌చ్ఛ‌మైన‌ది.! కానీ అత‌ను నిజం నిజం నే చెప్పేది నిజం అంటుంటే....అత‌ని మాట‌ల‌ను అబద్దమ‌ని నిరూపించ‌డానికి ఇద్ద‌రం క‌లిసి అత‌నితో క‌లిసి బ‌య‌లు దేరాను.

దూరంగా ఓ ఇంటిని చూపించాడు...ఇదే మీ ఆయ‌న ఉంటున్న ఇళ్ల‌ని చెప్పాడ‌త‌ను... కొద్దిసేప‌టికే మా ఆయ‌న మ‌రో అమ్మాయితో క‌లిసి న‌వ్వుకంటూ ఆ ఇంట్లోకి ఓ సంచితో వెళ్ళ‌డం చూశాను. త‌ట్టుకోలేక‌పోయాను. నా కాళ్లు అక్క‌డ నిల‌బ‌డ‌లేక‌పోయాయి..ఇంటికెళా వ‌చ్చానో కూడా తెలియ‌దు.

నా మ‌న‌స్సును రాయి చేసుకున్నాను... మా ఆయ‌న‌కు ఇష్ట‌మైన చేప‌ల కూర వండాను, నాకు తెలుసు ఇదే నేను మా ఆయ‌న‌కు వ‌డ్డించే చివ‌రి భోజ‌మ‌ని.! ఆయ‌నొచ్చాడు...ఎప్ప‌టిలాగే స్నానం చేసి, తిన‌డానికి కూర్చున్నారు. నేను కూడా నాకేం తెలియ‌ద‌న్న‌ట్టు వండిన అన్నం, కూర వ‌డ్డించాను, బాగుంది , చాలా బాగుందంటూ తిన్నాడు. ఆ క్ష‌ణం ఆయ‌న క‌ళ్ళ‌ల్లోకి చూసి....మీరు న‌న్ను నిజంగానే ప్రేమిస్తున్నారా? అని అడిగాను. ఆయ‌న‌క‌ర్థ‌మ‌య్యింది...ఏడ్వ‌డం స్టార్ట్ చేశాడు..అప్ప‌టికే ఏడ్చి ఏడ్చి నా క‌న్నీరంతా ఇంకిపోయింది. ఒంటిమీద ఉన్న ఓకే ఒక చీర‌తో ఆ ఇంటినుండి బ‌య‌లు దేరాను. బ్ర‌తిమాలాడాడు. కానీ ప్ర‌పంచంలో అత్యంత క‌ఠినమైన విష‌యం ఏంటంటే....సెకండ్ ఛాన్స్ ఇవ్వ‌డం...అది నేను ఇవ్వ‌ద‌ల్చుకోలేదు. నా దారి నే వెతుక్కున్నాను.

అలా వ‌చ్చేసి ఇప్ప‌టికీ 15 సంవ‌త్స‌రాలు.... నా బ‌తుకేదో నే బ‌తుకుతున్న‌... నా గ‌తం ఎవ్వ‌రికీ చెప్పుకోకుండా...నా వాళ్ళెవ్వ‌రూ లేరు, నేనో అనాథ‌ను అని నన్ను నేను ప‌రిచ‌యం చేసుకొని నా జీవ‌నం సాగిస్తున్న‌.!

No comments