Header Ads

మహా సంప్రోక్షణ సందర్భంగా తిరుమల దర్శన సమయాలు ప్రకటించిన టీటీడీ

మహా సంప్రోక్షణ సందర్భంగా ఆగష్టు 11 నుంచి 16 వరకు తిరుమల శ్రీవారి దర్శనం నిలిపివేస్తున్నం అని టీటీడీ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైన సంగతి అందరికి తెలిసిందే. జనం ఎక్కువ మందికి ఈ నిర్ణయం నచ్చకపోవడం , మరియు ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకోవడంతో టీటీడీ వెనక్కి తగ్గింది. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలిస్తామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఇప్పటికే అందరికి తెలిపారు. ఇందుకోసం పోయిన సోమవారం వరకు టీటీడీ భక్తుల స్పందన తెలుసుకుని. నిన్న బోర్డు సమావేశంలో దర్శనం విషయమై నిర్ణయం తీసుకోనున్నారు.




తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)లో మహాసంప్రోక్షణ జరిగే ఆగస్టు 11 నుంచి 16వ తేదీ వరకు పరిమితంగా భక్తులను దర్శనానికి అనుమతివ్వాలని తితిదే పాలక మండలి నిర్ణయం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఆ రోజుల్లో అన్ని రకాల సేవలతో పాట , వి.ఐ.పి దర్శనాలు కూడా రద్దు చేస్తూ సిఫార్సులు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే). ఆ రోజుల్లో తిరుమలకు వచ్చే ప్రతి ఒక్కరికీ సర్వదర్శనమే కల్పిస్తామని తేల్చి చెప్పింది తితిదే.

ఈ నిర్ణయం తీసుకోవడానికి తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశమైంది. ఇందులో తీసుకున్న నిర్ణయాలను తితిదే ఈవో అనిల్ సింఘాల్‌లు , తితిదే ఛైర్మన్ సుధాకర్, మీడియాకు వెల్లడించారు. ఇది ఇలా ఉంటె భక్తులుకు ఎక్కువ మందికి దర్శనం కల్పించలేని పరిస్థితుల్లో ఎలా చేస్తే బాగుంటుందనేది భక్తుల నుంచి అభిప్రాయాలను సేకరించారు . ఇందులో ఎక్కువశాతం మంది సర్వదర్శనం ద్వారా క్యూలైన్‌లో అనుమతించాలని సూచించారని చెప్పారు.

ఇకపోతే, మహాసంప్రోక్షణ ఘట్టంలో భాగంగా, అందరికి సర్వదర్శనమే ఇస్తున్నా ప్రతి రోజు కొన్ని గంటలు మాత్రమే సర్వదర్శనం ఉంటుంది . ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఆగస్టు 11వ తేదీన అంకురార్పణం రోజున 9 గంటలు,
ఆగస్టు 12న 4 గంటలు,
ఆగస్టు 13న 4 గంటలు
ఆగస్టు 14న 6గంటలు,
ఆగస్టు 15న 5 గంటలు,
ఆగస్టు 16న 4 గంటలు

ఇలా మాత్రమే దర్శనాలకు అవకాశం ఉంటుందన్నారు. యాగశాల ఏర్పాటువల్ల విమాన ప్రాకారంలో సగభాగం ఆక్రమిస్తుందని, దాంతో దర్శనం చేసుకున్న భక్తులు కొద్దికొద్ది మంది మాత్రమే ముందుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఈ సమయాలను అనుసరించి రోజులో ఎంతమందిని అనుమతించాలన్న సంఖ్యను త్వరలో ప్రకటిస్తామన్నారు. ప్రకటించిన దర్శనం సమయం ప్రకారం ఎంత మంది జనంని పంపాలో నిర్ణయించి. ఆ సంఖ్య చేరుకొన్న తర్వాత క్యూలైన్‌ను మూసివేస్తామన్నారు.

No comments