క్రీడా సంచలనం హిమదాస్‌పై బయోపిక్ తీస్తాను అంటున్న అక్షయ్‌కుమార్
భారతీయ క్రీడారంగంలో ఒక సంచలనం హిమదాస్.హిమదాస్ అండర్-20 వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ 400 మీటర్ల ఈవెంట్లో స్వర్ణ పతకం గెలుచుకున్నది.ప్రపంచ అథ్లెటిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారతీయ మహిళా అథ్లెట్‌గా హిమదాస్ చరిత్ర సృష్టించినది. అంతర్జాతీయ ట్రాక్ మీద పరుగులు మొదలు పెట్టిన తరువాత కేవలం 18 నెలలలోనే ఈ విజయం సాధించినది. ఈ బంగారు పతకం జూనియరు విభాగంలో పొందిన సీనియరు మరియు జూనియరు విభాగాల్లో బంగారు పతకంపొందిన భారతీయ ఏకైక మహిళ హిమదాస్.
18 ఏళ్ల వయస్సులోనే అంతర్జాతీయ అథ్లెటిక్ ఈవెంట్లో సత్తా చాట. భారత్ తరఫున తొలి గోల్డ్ మెడల్ సాధించిన స్ప్రింటర్‌గా ఆమె చరిత్ర సృష్టించారు. ఇప్పుడామె జీవితకథ ఆధారంగా బయోపిక్ తెరకెక్కించాలని అక్షయ్‌కుమార్ ఆసక్తి కనబరుస్తున్నారు. నిర్మాతగా ఆమె జీవితచరిత్రను తెరకెక్కించడానికి ఇష్టపడతానని బాలీవుడ్ యాక్షన్ స్టార్ అక్షయ్‌కుమార్ తాజాగా తెలిపాడు.
2018 ఆసియా గేమ్స్ కోసం సిద్ధమవుతున్న భారతీయ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈడెల్వీస్ గ్రూప్ అనే సంస్థ గడిచిన శనివారం ఓ కార్యక్రమం నిర్వహించింది. హాకీ నేపథ్యంతో తెరకెక్కిన తన ‘గోల్డ్’ సినిమా ప్రమోషన్లో భాగంగా ఈ కార్యక్రమంలో అక్షయ్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీరు నిర్మాతగా ఏ భారతీయ క్రీడాకారుడిపై సినిమా తీసేందుకు ఇష్టపడతారని అక్షయ్‌ని అడుగ్గా. ‘హిమదాస్‌పై బయోపిక్ తీసేందుకు నేను ఇష్టపడతాను. ఆమె ట్రాక్ రన్నర్. భారత్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి.. పరుగు పోటీల్లో స్వర్ణపతకం సాధించడమనేది చాలా అరుదైన ఘనత. ఇది నిజంగా అసాధారణమైన విషయం’ అని ఆయన అన్నారు.
మన దేశం ఇంకా క్రీడల విషయంలో ఇంకా దృడంగా లేదు అని ఇంకా కొంచం గెట్టిగా మనం వారికి సహకరించాలి అని ఆయన చెప్పారు .మనం అన్ని క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరముంది. మన దగ్గర కూడా గొప్ప ప్రతిభావంతులు ఉన్నారని ప్రపంచానికి చాటాలి. హిమదాస్‌పై నేను బయోపిక్ తీయడానికి ఇష్టపడతాను అని అక్షయ్ కుమార్ అన్నారు.

Post a Comment