Header Ads

మజ్జిగ తాగడం వల్ల మన శరీరముకి కలిగే లాభాలు

కాస్త ఉప్పు, పచ్చిమిర్చి వేసుకుని మజ్జిగ తాగితే... హబ్బ! రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం! ఈ ఎండాకాలంలో అయితే మరీ మంచిది, ఇంతకూ మజ్జిగ చేసే ఆ మేలేంటో చూద్దామా!
అసలే మనది వేడి వాతావరణం. పైగా ఎండాకాలం! సెలవులు కదా అని ఆరు బయట ఆటలు ఆడుతూనే ఉంటారు పిల్లలు.వడదెబ్బ కొట్టే ప్రమాదం ఎక్కువ. దాన్నుంచి తప్పించుకోవటానికి కచ్చితంగా మజ్జిగ తాగాల్సిందే.


మజ్జిగ తాగడం వల్ల మన శరీరముకి కలిగే లాభాలు
మజ్జిగ తాగడం వల్ల మన శరీరముకి కలిగే లాభాలు 


పెరుగులో పాలలో ఉండే పోషకాలన్నిటితోపాటు మన శరీరానికి ఉపయోగపడే 'లాక్టోబాసిల్లై' అనే బాక్టీరియా ఉంటుంది. పెరుగును నేరుగా కంటే మజ్జిగ రూపంలో తీసుకుంటే త్వరగా అరుగుతుంది. అన్నట్టు.. ప్రిజ్ లో పెట్టిన అతి చల్లని పెరుగు తింటే చక్కెర వ్యాధి పెరుగుతుంది. మజ్జిగ కూడా అంతే. ప్రిజ్లో పెడితే అందులో ఉన్న మంచి బాక్టీరియా ప్రభావం పోతుంది. ఇక ఆ తర్వాత తాగినా ఏం ఉపయోగం ఉండదు.

వడదెబ్బ నుంచి రక్షణ ఇవ్వడమేకాదు రోజూ మజ్జిగ తాగేవాళ్ళకు ఏ జబ్బులు రావు. నీరసంగా ఉండటం, బరువు పెరగడం, చర్మ రోగాలు, క్షయలాంటి సమస్యల నుంచి ఇది బయటపడేస్తుంది. గ్యాస్, ఉబ్బరం, పేగుపూత, అమీబియాసిస్, టైఫాయిడ్, మొలలు, మలబద్దత, పేగుల్లో వచ్చే వ్యాధులు త్వరగా తగ్గుతాయి. అలాగే... ఎంత ఎక్కువ మజ్జిగ తాగితే అంత తొందరగా 'పుండూ మానిపోతుంది.


పొద్దున్నే అన్నంలో మజ్జిగ కలుపుకుని తింటే ఎంత శక్తి వస్తుందో తెలుసా! మీరెంతసేపు ఆరుబయట ఉన్నా సరే నీరసం రాదు. పైగా వడదెబ్బ తగలకుండా ఈ మజ్జిగన్నం కాపాడుతుంది. రక్తాన్ని, జీర్ణశక్తిని పెంచుతుంది. కామెర్లు తగ్గిస్తుంది. ఒకవేళ మామూలు మజ్జిగన్నం తినబుద్ది కాలేదనుకోండి 'దధ్యోధనం' తినొచ్చు. దధొధనం అంటే పెరుగన్నంలో మిరియాలు, అల్లం, మిర్చి వేసి తాలింపు పెడతారు. ఎండాకాలలో ఒంటికి చాలా మంచిది.


మజ్జిగలో పంచదార లేదా తేనె కలిపితే.. అదే మనకు బాగా ఇష్టమైన లస్సీ! నిమ్మరసం, జీలకర్రపొడి, ఉప్పు, పంచదార, పుదీనా ఆకులు వేసిన లస్సీ తాగితే వడదెబ్బ కొట్టదంటే కొట్టదు.
మజ్జిగని ఒక గిన్నెలో సగానికి పోయాలి. దానికి మూడొంతుల వరకూ నీళ్ళు కలపాలి. దాన్ని రెండు గంటలు కదల్చకుండా ఉంచాలి. తర్వాత మజ్జిగ మీద నీరు తేరుకుంటుంది. ఆ నీళ్ళను మంచినీళ్ళకు బదులుగా తాగుతుంటే వడదెబ్బ భయం ఉండదు.


అలాగే... ఎండలో బయటకు వెళ్ళాల్సి వస్తే ముందు కొన్ని చిట్కాలు పాటిస్తే మనకు ఏ భయమూ ఉండదు. ముం,దు మజ్జిగలో ఓ నిమ్మకాయ పిండాలి. దానికి తగినంత ఉప్పు, పంచదార, చిటికెడు తినే సోడా కలపాలి. ఆ తర్వాత ఇంకేముంది తాగేయటమే. ఎండాకాలంలో ప్రయాణాలు చెసేటప్పుడు దీన్ని ఓ సీసాలో పోసుకుని తీసుకెళ్ళడం మరీ మంచిది. శోష రాకుండా ఉంటుంది.
చూశారు కదా..... మజ్జిగతో ఎన్ని ఉపయోగాలున్నాయో! ఎండాకాలం కాబట్టి ఈ నెల రోజులు కాస్త ఎక్కువగానే దీన్ని లాగిచేద్దాం. అన్నట్టు ఇంట్లో మజ్జిగ కవ్వం ఉందా.......!?

No comments