సుకన్య సమృద్ధి యోజనకు సవరణ...ఆడపిల్లల సంక్షేమానికి మరింత అండ.!
సుకన్య సమృద్ధి యోజన ఖాతా నిర్వహణకు కనీస మొత్తాన్ని రూ. 1000 నుంచి రూ. 250కి తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. పేదవారు సంవత్సరానికి 1000 రూపాయలు అమ్మాయి పేరు మీద జమా చేయడం కాస్త ఇబ్బందికరం కాబట్టి... సెంట్రల్ గవర్నమెంట్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
అసలేంటి ఈ పథకం.?
సుకన్య సమృద్ధి యోజన పథకంలో భాగంగా.. ఆడబిడ్డ పుట్టిన వెంటనే తల్లిదండ్రులు పోస్ట్ ఆఫీస్ లో లేదా ఏదేనీ ప్రభుత్వ రంగ బ్యాంకులో అకౌంట్ ను తెరవాలి. దానిలో ఏడాదికి 250/- నుండి .1,50,000 లోపు మన ఇష్టమొచ్చినంత డిపాజిట్ చేయవచ్చు. 14 ఏళ్ల పాటు జమ చేస్తే.. ఆడపిల్లకు 21 ఏళ్లు నిండేసరికి ఖాతాలో ఉన్న మొత్తం డబ్బుకు 8.1 శాతం వడ్డీని కలిపి ప్రభుత్వం ఆమెకు చెల్లిస్తుంది.
స్కీమ్ గురించి మరింత డీటైల్డ్ గా.....
ఈ స్కీమ్ ను 2015 ఫిబ్రవరి 22న ప్రధాన మంత్రి మోడీ ప్రారంభించారు. అప్పుడే పుట్టిన ఆడపిల్ల మొదలు అమ్మాయికి 10 ఏళ్ళు వచ్చే వరకు ఈ స్కీమ్ లో భాగస్వామ్యులు అవ్వొచ్చు. ఈ డబ్బుకు ఇన్ కమ్ టాక్స్ నుండి మినహాయింపు ఉంటుంది. అమ్మాయికి 18 సంవత్సరాలు వచ్చాక...అప్పటి వరకు ఆమె అకౌంట్ లో ఉన్న డబ్బుల్లోంచి 50 శాతం అమౌంట్ ను డ్రా చేసుకోవొచ్చు. మిగిలిన అమౌంట్ 21 ఇయర్స్ నిండాక తీసుకోవాల్సి ఉంటుంది.
కండీషన్స్ ఏంటి...?
ఒక అమ్మాయికి ఒకే ఖాతా తెరవాలి. తల్లిదండ్రులు గరిష్ఠంగా ఇద్దరు అమ్మాయిలకు కోసం ఈ ఖాతా తెరవచ్చు. కవలల విషయంలో ఈ సౌకర్యం మూడవ అమ్మాయికి కూడా ఈ అకౌంట్ ఓపెన్ చేయవొచ్చు.
ఈ అకౌంట్ లో... ఏడాదికి 250/ నుండి .1,50,000 లోపు మన ఇష్టమొచ్చినంత డిపాజిట్ చేయవచ్చు.
ఈ డబ్బును 14 సంవత్సరాలు ఉంచాల్సి ఉంటుంది.
సుకన్య సంవృద్ది ఖాతాని తెరవడానికి కావలసిన పత్రాలు:

- బాలిక బర్త్ సర్టిఫికేట్
- తల్లిదండ్రుల అడ్రస్ ప్రూఫ్
- తల్లిదండ్రుల ఐడి ప్రూఫ్.
- తల్లిదండ్రుల ఆధార్ కార్డ్
- రేషన్ కార్డ్ .
- మరింత సమాచారం కోసం...దగ్గర్లోని పోస్ట్ ఆఫీస్ లేదా ఏదైనా ప్రభుత్వ బ్యాంక్ ను సంప్రదించగలరు.
Post a Comment