Header Ads

దేశమంత‌టినీ...షేక్ చేస్తున్న ఫేక్ న్యూస్ కు...ఒక్క పాట‌తో చెక్ పెట్టిన పోలీస్ మేడ‌మ్.!!

ఈ మ‌ధ్య కాలంలో వాట్సాప్ లో విప‌రీతంగా షేర్ అవుతున్న మెసేజ్ లో .. బ‌హుప‌రాక్....చిన్న‌పిల్ల‌ల్ని ఎత్తుకెళ్లే గ్యాంగ్ ఒక‌టి తిరుగుతుంది. వారు చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసి, వారి కిడ్నీల‌ను తింటున్నారనే వ‌దంతులు అనేకంగా చూశాం. నిన్న‌టికి నిన్న గుల్బ‌ర్గ‌లో హైద్రాబాద్ యువ‌కుల‌ను చిన్న‌పిల్ల‌ల‌ను ఎత్తుకెళ్ళే వాళ్ళంటూ... అక్క‌డి గ్రామ‌స్తులు ప‌ట్టుకొని కొట్టి మ‌రీ చంపేశారు.!




ఇలాంటి ఫేక్ వార్త‌ల‌కు చెక్ పెట్టేలా....గ‌ద్వాల సూప‌రిండెంట్ ఆఫ్ పోలీస్ (S.P) రెమా రాజేశ్వ‌రీ ఓ స‌రికొత్త ఐడియాతో ముందుకొచ్చారు. గ్రామాల్లో ఉండే జాన‌ప‌ద క‌ళాకారుల‌ను పిలిపించి...ఓ పాట రాయించి...వారిని ప్ర‌తి ప‌ల్లెను తిప్పించి...చిన్న‌పిల్ల‌ల్ని ప‌ట్టుకెళుతున్నార‌నేది ఫేక్ న్యూస్ అని గ్రామ‌స్తుల‌లో అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. ఇలా...దాదాపు 400 గ్రామాల‌ను S.P ప్ర‌త్య‌క్షంగా ప‌ర్య‌టించి...ఆ గ్రామ‌స్తుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించారు. ఈ విష‌యంపై ఊరికొక పోలీస్ ను నియ‌మించారు.! ఎవ‌రిపైనైనా అనుమానం ఉంటే వెంట‌నే ఆ గ్రామ పోలీస్ కు ఆ విష‌యాన్ని తెలియ‌జేయాల‌ని...అంతే కాని చ‌ట్టాన్ని చేతులోకి తీసుకొని...అమాయ‌కులను చావ‌గొట్టొద్ద‌ని వివ‌రించారు.




ఈ ఆలోచ‌న ఎలా వ‌చ్చింది?
నా ద‌గ్గ‌ర‌కు కొన్ని రోజుల క్రితం ఓ కేస్ వ‌చ్చింది... ఓ ఇద్ద‌రు జాన‌ప‌ద గాయ‌కులు..ఓ ప‌నిమీద ఓ గ్రామానికి వెళ్లి తిరిగి వ‌చ్చే క్ర‌మంలో వారు ఎక్కాల్సిన చివ‌రి బ‌స్ మిస్ కావ‌డంతో అక్క‌డే ఉండాల‌ని నిశ్చ‌యించుకున్నారు. ఈక్ర‌మంలో వారిని చూసిన ఆ గ్రామ‌స్తులు వారిపై అనుమానం వ‌చ్చి...చిన్న‌పిల్ల‌ల‌ను ఎత్తుకెళ్లే గ్రూప్ గా భావించి వారిని బంధించి...గ్రామ‌పంచాయితీ భ‌వ‌నంలో ఉంచారు. ఈ విష‌యం తెలుసుకున్న త‌ర్వాత‌...నాకు ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం కూడా వారేన‌ని అనిపించింది. అందుకే ఈ పాట‌ను రాయించి, జ‌నాల్లో అవ‌గాహ‌న క‌ల్పించే ప్ర‌య‌త్నం చేస్తున్నాం. మా పోలీసులంద‌రూ ఈ విష‌యంపై చాలా సీరియ‌స్ గా ప‌నిచేయ‌డం కూడా మా జిల్లాలో అలాంటి కేసులు న‌మోదు కావడం లేదు.

Watch Video:

https://www.youtube.com/watch?v=jVgjbsPFupY

No comments