Header Ads

సిమ్ స్వాప్ పేరుతో సైబర్ నేరాలు చేస్తున్న మోసగాళ్ళు , జనాలు జాగ్రత్తగా ఉండాలి అంటున్న పోలీసులు

ఈ కాలం లో సైబర్ నేరగాళ్లు ఎక్కువ అయిపోయారు . వీటికి తోడు సైబర్ నేరగాళ్లు జనాన్ని మోసం చేయడంలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు. ఇప్పటికే బ్యాంక్ అకౌంట్లు హ్యాక్ చెయ్యడం, డెబిట్, క్రెడిట్ కార్డ్స్ క్లోనింగ్ చేయడంలాంటివి చేస్తున్నారు. అలాగే బ్యాంకు నుంచి చేస్తున్నామని చెప్పి , OTP లు తెలుసుకుని అకౌంట్స్ ఖాళీ చేస్తున్నారు. ఇప్పుడు వీటన్నింటిని పక్కన పెట్టి , కొత్తగా మళ్ళి ఒక కొత్త సైబర్ లూఠీ చేస్తున్నారు కేటుగాళ్లు.
టెక్నాలజీని ఉపయోగించడం లో సైబర్ నేరగాళ్ళు మనకన్నా ముందుంటున్నారు. ఇప్పటికే బ్యాంక్ అకౌంట్ల హ్యాకింగ్స్, డెబిట్, క్రెడిట్ కార్డ్ప్ క్లోనింగ్స్ తో ఆన్ లైన్లో అందినకాడి దోచుకుంటున్న సైబర్ దొంగలు.ఇప్పడు మరో కొత్త సైబర్ లూఠీకి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని హ్యాక్ చేసిన మొబైల్ ఫోన్ నంబర్లను టార్గెట్ చేసి సైబర్ నేరగాళ్లు పక్కా స్కెచ్ వేసి సిమ్ కార్డ్ నెట్ వర్క్ ను బ్లాక్ చేస్తున్నారు. ఆ తర్వాత సర్వీస్ ప్రొవైడర్ కస్టమర్ సర్వీస్ నుండి కాల్ చేస్తున్నామంటూ బ్యాంక్ అకౌంట్లను హ్యాక్ చేస్తున్నారు.

ప్రాధమికంగా వీరు చేసేది మీ మొబైల్ నెంబర్ బ్యాంకు ఎకౌంటు కి లింక్ అయ్యిందో లేదో హ్యాక్ చేయడం ద్వారా తెలుసుకుంటారు . మీ మెసేజులు చదివి బాలన్స్ వుందో లేదో తెలుసకుంటారు . ఇక ఆ తరువాత తమ దగ్గరున్న నెంబర్ల మొబైల్ నెట్ వర్క్ ముందుగా జీరో లెవల్ కి తీసుకొస్తారు సైబర్ దొంగలు. నెట్ వర్క్ ఫెయిల్ అయిన తర్వాత కస్టమర్ కేర్ పేరుతో కాల్ వస్తుంది. అది కూడా మీ మొబైల్ నెట్ వర్క్ లో ప్రాబ్లం ఉంది. కీ ప్యాడ్ లోని నెంబర్ 1 ను నొక్కమని వాయిస్ వినిపిస్తుంది. అది నిజమే అనుకొని 1ని ప్రెస్ చేస్తే మొబైల్ నెట్ వర్క్ ఒక్కసారిగా జీరో లెవల్ కి వెళ్తుంది. ఆ టైంలోనే ఒక మాల్ వేర్ ని మొబైల్ కి పంపిస్తారు. దీంతో మొబైల్లో ఉన్న డేటాతో పాటు అంతకుముందు చేసిన ట్రాన్ క్షాషన్స్ డీటైల్స్, OTPలు కూడా సైబర్ నేరగాళ్లకు వెళ్తాయి. దీంతో ఆ నెంబర్ తో లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్ లను ఖాళీ చేస్తున్నారు కేటుగాళ్లు.

మనం ఏదైనా ఆన్లైన్ లో కొనే అప్పుడు మనకు ఒక OTP వస్తుంది , ఇప్పుడు వారు మన సిం దొంగాలించడం ద్వార ప్రతి మెసేజ్ వారు చదివి OTP వాళ్ళు చేసే కొనుగోలు లో వాడుతారు . సిమ్ స్వాప్ అనే సైబర్ క్రైమ్ తో రెచ్చిపోతున్న సైబర్ దొంగలు.. క్షణాల్లో బ్యాంకు అకౌంట్లను ఖాళీ చేస్తున్నారు. ఢిల్లీలో జరిగిన ఇలాంటి క్రైమ్ కేసులను స్టడీ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు….ప్రజలను అప్రమత్తం చేసే పనిలో పడ్డారు. అందుకోసం సోషల్ మీడియాలో సైబర్ నేరగాళ్ళ ఫేక్ కాల్స్ ఎలా వస్తాయి మన అకౌంట్లను ఎలా హ్యాక్ చేస్తారో ప్రచారం చేస్తున్నారు. ఇలా మీ ఫోన్ నెట్ వర్క్ ఫెయిల్ అయినా మీకు కస్టమర్ కేర్ పేరుతో కాల్ వస్తే స్పందిచకపోవడం మంచిదంటున్నారు పోలీసులు. టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతుందో అంతకంటే ఎక్కువ సైబర్ దొంగల క్రైమ్ కూడా డెవలప్ అవుతోంది. ఇలాంటి నేరగాళ్ల పట్ల అలెర్ట్ గా లేకపోతే మన బ్యాంకు సొమ్ము పూర్తిగా పోతుందని హెచ్చరిస్తున్నారు పోలీసులు.

దయచేసి మీరు కూడా ఇలా ఎవరినా మీ సిమకార్డ్ ని స్వాప్ చేయాలనీ ప్రయత్నిస్తే పోలీస్ వారికి సమాచారం అందించండి , మీతో పాటు ఇంకో ముగ్గురిని మోసపోకుండా కాపాడండి

No comments