Header Ads

మేడమ్‌ టుస్సాడ్స్ మ్యూజియంలో మహేశ్ బాబు మైనపు విగ్రహం : వైరల్‌ అయిన ఫోటో

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ ఘట్టమనేని మహేశ్ బాబు గారి అభిమానులకి శుభవార్త . మహేశ్ బాబు గారి మైనపు విగ్రహాన్ని ప్రతిష్టాత్మక మేడమ్‌ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ మైనపు విగ్రహం తయారు అయిపోడానికి సిద్ధం అయ్యింది . ఆ మైనపు విగ్రహం మొదటి లుక్ మేడమ్‌ టుస్సాడ్స్ మ్యూజియం వారు విడుదల చేసారు. భారత్‌ నుంచి కొద్ది మంది హీరోలు మాత్రమే ఈ ఘనత దక్కించుకున్నారు. తెలుగులో ఈ గౌరవం అందుకున్న రెండో హీరోగా మహేశ్‌ నిలిచారు. అంతకు ముందు ప్రభాస్ విగ్రహాన్ని ఈ మ్యూజియంలో ఏర్పాటు చేశారు.



ప్రముఖ శిల్పి ఇవాన్‌ రీస్‌ మహేశ్‌ విగ్రహాన్ని తయారుచేస్తున్నారు . ఆయన తయారు చేసిన విధానం అభిమానులను ఆకట్టుకుంటుంది. ప్రతిష్టాత్మక మ్యూజియంలో తమ అభిమాన హీరో విగ్రహం ఎలా ఉంటుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు తెరదించుతూ, నిర్మాణంలో ఉన్న మహేశ్‌ మైనపు విగ్రహానికి సంబంధించిన ఫొటో విడుదల అయింది. కొద్ది గంటల్లోనే ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అతి త్వరలోనే మహేశ్‌ మైనపు విగ్రహం మ్యూజియంలో కొలువుదీరనుంది. కాగా, ప్రస్తుతం మహేశ్‌.. వంశీ పైడిపల్లి చిత్రంలో నటిస్తున్నారు.

దీనితోపాటు సూపర్‎స్టార్ మహేశ్‌బాబు నటించిన 'భరత్ అనే నేను' చిత్రం ఈ నెల 28తో 100 రోజులు పూర్తి చేసుకోనుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 20న విడుదలైంది. హీరో మహేశ్ బాబు ముఖ్యమంత్రిగా కన్పించారు. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో పాటు బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. మరో రెండు రోజుల్లో 100 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా 100 రోజుల పోస్టర్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్. మైనపు విగ్రహం మరియు 100 రోజులు వేడుకలు ఒకే సారి రావడం తో మహేష్ బాబు అభిమానులు సంతోషంగా ఉన్నారు.

No comments