Header Ads

దేశంలోని మ‌హిళ‌లంద‌రి త‌రుఫున కేంద్ర ప్ర‌భుత్వంతో పోరాడి గెలిచిన యువ‌తి.!

కండోమ్స్ పై టాక్స్ ఫ్రీ, నెల‌స‌రికి వాడే శానిట‌రిప్యాడ్స్ పై మాత్రం 12 శాతం టాక్స్....ఇదెక్క‌డి న్యాయం? ప‌్యాడ్స్ పై GST నిషేదించాలంటూ ఓ విద్యార్థిని ఈ విష‌యంలో ప్ర‌భుత్వానికి వ్య‌తిరేఖంగా న్యాయ‌పోరాటం చేసింది, ఈమె పిటిష‌న్ కార‌ణంగా కోర్ట్ కూడా ప్ర‌భుత్వాన్ని నిల‌దీసింది. ఈ కేసు మ‌రియు దేశ వ్యాప్తంగా మ‌హిళ‌ల నిర‌స‌న కార‌ణంగా శానిట‌రీ ప్యాడ్స్ పై టాక్స్ ను మిన‌హాయిస్తున్న‌ట్టు GST కౌన్సిల్ తాజా నిర్ణ‌యం తీసుకుంది.




ఆ విద్యార్థిని పేరు జర్మీనా ఇస్రార్ ఖాన్...జవహర్ లాల్ యూనివర్సిటీ లో స‌మాజ‌శాస్త్రంలో Ph.D చేస్తోంది. 1st జూలై, 2017 న ఒకే దేశం-ఒకే ప‌న్ను అనే నినాదంతో ఇండియాలో GST అమ‌లులోకి వ‌చ్చింది. అప్పుడు శానిటరీ న్యాప్‌కిన్స్‌పైన 12 శాతం జీఎస్టీ ని వేశారు. అదే సంద‌ర్భంలో...కండోమ్స్ పై టాక్స్ ను లేకుండా చేశారు.




ఇప్పుడిప్పుడే గ్రామీణ ప్రాంత మ‌హిళ‌లల్లో....నెల‌స‌రి స‌మ‌యంలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై అవ‌గాహ‌న పెరిగి శానిట‌రీ ప్యాడ్స్ ను ఉప‌యోగిస్తున్న త‌రుణంలో...ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం వల్ల మ‌ళ్లీ....ఆ మ‌హిళ‌ల‌ను పాత ప‌ద్ద‌తులైన కాట‌న్ క్లాత్, బూడిద, న్యూస్ పేప‌ర్లు, ఇసుక ను నెల‌సరి స‌మ‌యంలో ఉప‌యోగించి వారి వారి ఆరోగ్యాల‌ను రిస్క్ లో ప‌డేసుకుంటార‌ని...ఇది క‌రెక్ట్ కాద‌ని జ‌ర్మీనా ఢిల్లీ కోర్ట్ ను ఆశ్ర‌యించింది. అదే సమయంలో ...దేశంలోని వివిధ ప్రాంతాల నుండి శానిట‌రీ ప్యాడ్స్ పై GST కి వ్య‌తిరేఖంగా చాలా మంది కోర్ట్ ను ఆశ్ర‌యించారు.




ప్ర‌భుత్వాన్ని కోర్ట్ అడిగిన కీల‌క ప్ర‌శ్న‌లు:
1) 31 మంది సభ్యులున్న జీఎస్టీ కౌన్సిల్లో ఒక్క మహిళ కూడా ఎందుకు లేదు?
2) శానిటరీ న్యాప్‌కిన్స్‌ను జీఎస్టీ పరిధిలో పెట్టడానికి ముందు మహిళా, శిశు సంక్షేమ శాఖను సంప్రదించారా?
3) మీ దృష్టిలో శానిట‌రీ న్యాప్ కిన్స్ విలాస వ‌స్తువా? అత్య‌వ‌స‌ర వ‌స్తువా?

#Zarmina Israr Khan:

No comments