Header Ads

పోలీసులకు ఊహించని షాకిచ్చిన బాబు గోగినేని

మాదాపూర్ పోలీసులకు హేతువాది బాబు గోగినేని షాకిచ్చారు. బాబు గోగినేని పై మాదాపూర్‌లో కేసు నమోధైన విషయం అందరికి తెలిసిందే. అయితే నమోదైన కేసు దర్యాప్తును రెండు నెలల పాటు నిలిపివేయాలంటూ తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బిగ్‌బాస్‌షోలో ఉన్నందున విచారణకు హాజరుకాలేనంటూ బాబుగోగినేని హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు మీద తన తరుపు న్యాయవాదులు ఇప్పటికే కోర్ట్ ని ఆశ్రయించారు. కౌంటర్ దరఖాస్తు వేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు కేసు దర్యాప్తును రెండు నెలల పాటు ఈ కేసుని తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది. బిగ్‌బాస్‌ షోకు వెళ్లి బాబు గోగినేనికి నోటీసులు ఇవ్వాలనుకున్న పోలీసులు కోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు వెనక్కి తగ్గారు.




హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా టీవీఛానళ్లు, సోషల్‌ మీడియాలో విమర్శలు చేస్తున్నారని, అలాగే నిబంధనలకు విరుద్ధంగా ఆధార్‌కార్డు నెంబర్లను సేకరిస్తున్నారని బాబు గోగినేనిపై గత నెల 26న మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో వీరనారాయణ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో బాబు గోగినేనిపై దేశద్రోహం, ఆధార్‌చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా రెండు నెలల పాటు దర్యాప్తు నిలిపివేయాలంటూ కోర్టు ఆదేశించింది. దీంతో బాబుగోగినేని బిగ్‌బాస్‌షోలో కొనసాగనున్నారు.

బిగ్ బాస్ చూసే జనంతో పాటు , ఆయన అభిమానులు కూడా ఏమవుతుందో అని చాల రోజులనుంచి ఎదురుచూస్తున్నారు . అయితే హైకోర్టు ఇలా ఆదేశించడంతో పోలీసులు తమ విచారణ బాబు గోగినేని బిగ్ బాస్ ఇంటి బయటకు వచ్చే వరుకు వేచి చూడాలి అని నిర్ణయించుకున్నారు. బహుశా పోలీసులు కూడా హైకోర్టు ఇలా తీర్పు ఇస్తుంది అని ఊహించి ఉండరు

No comments