కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇస్తున్న కేంద్రం , వివరాలు ఇవే
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ఓ బంపర్ ఆఫర్ ఊరిస్తున్నది. ఉద్యోగులకు ఇచ్చే లీవ్ ట్రావెల్ కన్సెషన్ (ఎల్టీసీ) కింద ఇక నుంచి విదేశాలకు కూడా వెళ్లే అవకాశం కల్పించాలని కేంద్రం యోచిస్తున్నది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనను సంబంధిత మంత్రిత్వ శాఖ ఆమోదించింది.
ఈ ప్రతిపాదనపై అభిప్రాయం చెప్పాల్సిందిగా హోం, టూరిజం, పౌర విమానయాన శాఖలకు లేఖలు పంపించింది. కేంద్ర విదేశాంగ శాఖ ఈ ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఎల్టీసీలో భాగంగా ఉద్యోగులు వెళ్లేందుకు ఐదు మధ్య ఆసియా దేశాల పేర్లను పరిశీలిస్తున్నారు. మధ్య ఆసియా దేశాలపై భారత్ తన పట్టును మరింత పెంచుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ దేశాలకు వెళ్లే అవకాశం కల్పించాలని విదేశాంగ శాఖ ప్రతిపాదించింది.
నిజానికి ఈ ఏడాది మార్చిలోనూ ఎల్టీసీ కింద విదేశీ టూర్లు ఉంటాయని, సార్క్ దేశాలకు వెళ్లేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని ప్రభుత్వం వెల్లడించింది. ఎల్టీసీ కింద అర్హులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ఇవ్వడంతోపాటు టికెట్ రీయింబర్స్మెంట్ ఇస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 48.41 లక్షల మంది కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఈ ఏడాది మార్చిలో ఇటువంటి ప్రతిపాదనే ఒకటి రాగా అది ఆమోదానికి నోచుకోలేదు. అప్పట్లో ఎల్టీసీ కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను సార్క్ (దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి) పరిధిలోని దేశాలకు వెళ్లే అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావించింది.
దీంతో ఆయా దేశాలతో సత్సంబంధాలు పెరుగుతాయని అనుకుంది. అయితే, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్.. మార్చిలో ఓ ప్రకటన చేస్తూ... అన్ని అంశాలను పరిశీలించి, సాధ్యాసాధ్యాలను గురించి చర్చించిన తరువాత ఈ ప్రతిపాదన ఆమోదయోగ్యం కాదని తెలిసిందని ప్రకటించారు. సార్క్ దేశాల్లో ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మాల్దీవులు, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక ఉన్న విషయం తెలిసిందే.
కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఎల్టీసీ ప్రయోజనాల కింద మధ్య ఆసియా దేశాలకు వెళ్లే అవకాశం ఇవ్వాలని యోచిస్తోంది. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆయా దేశాలు సందర్శించేందుకు సెలవులు లభించడంతో పాటు టికెట్ రీయింబర్స్మెంట్ సదుపాయం ఉంటుంది.

Post a Comment