Header Ads

మీరు మీ భర్త / భార్య తో తరుచూ గొడవ పడుతున్నారా . అయితే ఈ నియమాలు పాటించండి

భార్యాభర్తల మధ్య ఏదయినా సమస్య వచ్చి, వాదన చోటుచే సుకున్నప్పుడు చాలాసార్లు అది పరిష్కారం కాకపోగా , ఇద్దరిమధ్యా మనస్పర్థలు పెరుగుతాయి. అలాంటి సమస్యను నివారించాలంటే పాటించాల్సిన నియమాలు కొన్ని ఉన్నాయి.

ఎప్పుడైనా ఓ జంట వాదించుకోవడాన్ని గమనించండి. ఇద్దరూ ఒకరినొకరు అరు చుకుంటున్నారా.. ఒకరిమాట ఒకరు వినిపించుకోకుండా ఇద్దరూ గట్టిగా మాట్లాడుతున్నారా.. సహనం కోల్పోయిన ప్పుడే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి వాదనలో సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయకూడదు. ఇద్దరిమధ్యా చర్చ పూర్తయి మౌనంగా ఉన్నాక అప్పుడు సమస్య గురించి మాట్లాడుకో వాలి. పరిష్కారం ఆలోచించుకోవాలి. వాదనలో ఇద్దరూ తాము చెప్పిందే సరైం దని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తుం టారు. ఎదుటి వారిలోని లోపాలు ఎత్తి చూపుతుంటారు. దీనివల్ల సమస్య పరి . ష్కారం కాకపోగా పెరుగుతుందని మర వకండి.




భాగస్వామి వైపు ఆలోచించడం మనలో చాలామంది చేయని పని. కానీ ఆ కోణంలో ఆలోచించగలిగితే సమస్య చాలామటుకు తగ్గుతుంది. మీరు అవ తలి వారి స్థానంలో ఉంటే ఎలా ఆలోచి స్తున్నారనేది అంచనా వేసేందుకు ప్రయ త్నించండి. దానివల్ల సమస్యనూ, అవతలి వారి తీరునూ మీరు అర్థం చేసుకునే ఆస్కారం ఉంది. ఇక, చాలామంది భార్యాభర్తల మధ్య గొడవలు రావడానికి “నువ్వెప్పుడూ నేను చెప్పింది వినవు' అనే ఫిర్యాదు కూడా కారణమే. కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోండి. పూర్తిగా, ఆసక్తిగా వినేలా చూడండి.

మీరు మీ భాగస్వామిని నమ్మకపోతే, అవతలి వారి నుంచీ అదే ప్రతిస్పందన ఉంటుంది. అందుకే వైవాహిక బంధంలో సాధ్యమైనంత వరకూ నిజాయతీగా ఉండాలి. ప్రతిదీ భాగస్వామితో పంచుకో వాలి. అప్పుడే రెండో వారూ అంతే నిజా యతీగా ఉండేలా చూస్తారు. ఒకరి . గురించి మరొకరికి తెలుస్తుంది. ఇద్దరి మధ్యా వాదన ఉండొచ్చు. చిన్నచిన్న మనస్పర్థలూ రావచ్చు. అయినప్పటికీ ప్రేమా, ఒకరంటే మరొకరికి గౌరవం తప్పనిసరి. ఏదయినా ఒక విషయానికి సంబంధించి వంద శాతం అంగీకరించక పోయినా, దానికి సంబంధించి మాట్లాడేం దుకు రెండొందల శాతం ఆలోచించాలి. అప్పుడే ఎదుటివాళ్లు నొచ్చుకోకుండా ఉంటారు.

భాగస్వామిని అర్ధం చేసుకోవాలంటే ఎదుటివారి మనసు చదవాలని లేదు. వాళ్ల దేహభాషను అర్ధం చేసుకోగలిగితే చాలు. వాళ్ల ప్రవర్తనా, నిల్చునే తీరూ, హావభావాల లాంటి సంకేతాలు గమనిం చినప్పుడు ఏదయినా చెప్పాలనుకుంటున్నా రనేది అంచనా వేయగలగాలి. వీలైనంత ఎక్కువ సేపు మాట్లాడుకోవాలి. అప్పుడే ఒకరి గురించి మరొకరికి తెలుస్తుంది. ఎంత తీరిక లేకుండా ఉన్నా, ఇలా మాట్లడుకునేందుకు సమయం కల్పించుకోవాలి.

No comments