Header Ads

పిల్లలతో బయటికెళితే ఈ జాగ్రతలు తప్పకుండా తీసుకోండి


ఆసుపత్రుల వంటి కొన్ని ప్రదేశాలకు పిల్లలను అనుమతించరు. కానీ వెంట వచ్చే స్తామంటూ పిల్లలు మాత్రం గోల చేస్తారు. ఇలాంటప్పుడు వారికి ప్రత్యామ్యాయం చూపిస్తే చక్కగా ఉంటారు. అదెలాగంటారా? దగ్గర్లో గంటల పద్దతిన పిల్లల్ని ఆడించే కేర్ సెంటర్లు ఉంటాయి. అక్కడ వారికి బోలెడు ఆట వస్తువులు అందుబా టులో ఉంటాయి. ఒక్కసారి తీసుకెళితే అక్కడ ఉండి, ఆడుకోవడానికే ఓటేస్తారు. అవి అందుబాటులో లేవనుకున్నప్పుడు తనకిష్టమైన స్నేహితురాలింటికి కాసేపు పంపించండి. అక్కడ తనకిష్టమైన కామిక్ సీడీలు పెట్టుకుని చూడమనండి. కచ్చితంగా సరేనంటారు. - పిల్లలతో కలిసి బయటకు వెళ్లాలనుకు న్న విషయం మీకు ముందుగానే తెలిసిన ప్పుడు దానికి తగ్గట్లుగా సిద్ధం కండి. బయటికెళ్లాక అలసిపోయి ఆకలీ, నిద్రా అంటూ విసిగించవచ్చు. అందుకే చిన్న ఎయిర్ పి ల్లో, బెడ్ షీట్, తక్షణ శక్తినిచ్చే ఆహారాన్ని అందుబాటులో ఉంచండి. గ్లూకోజ్ వంటివీ వెంట ఉంచుకోండి. దీనివల్ల కొంత వరకూ అలసట వల్ల వచ్చే సమస్యల్ని తగ్గించుకోవచ్చు. వారూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉత్సాహంగా గడుపుతారు.




మీరు చిన్నారుల్ని వెంట తీసు కెళ్లేప్పుడు ముందుగానే అక్కడి పద్దతుల్ని వివరించండి. ఎలా మెలగాలో తెలియచే యండి. రద్దీ ప్రదేశానికే వెళుతుంటే, తప్పి పోయినప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలియ చేయండి. తల్లిదండ్రుల అత్యవసర ఫోన్ నంబర్లు నోటికి గుర్తు పెట్టుకునేలా చూడండి.

కొందరు పిల్లలు ఎవరింటికైనా వెళ్లి నప్పుడు పెద్దా, చిన్నా లేకుండా ఏకవచనంతో సంబోధించడం చేస్తుంటారు. అది తప్పని వయసులో తమకంటే పెద్దవారిని తాతయ్యా, అమ్మమ్మా, అత్తా, బాబాయ్... అంటూ వరుసలతో పిలవాలనీ తెలపండి. మీరు కొన్న వస్తువు మీకెంత ముద్దుగా ఉంటుందో ఎదుటివారి వస్తువుల్ని వారూ అలానే చూసుకుంటారని చెప్పండి. పిల్లలు కాసేపు ఓపిగ్గా కూర్చోవడం అలవాటు చేస్తే, కుదురుగా ఉండటం అదే అలవాటవుతుంది.

మరి కొన్ని ముఖ్యమైన విషయాలు , మీ పిల్లలను ఎప్పుడు బయటికి తీసుకువెళ్లాలో ముందే నిర్ణయించుకోండి . ఎంత ముందు ప్లాన్ చేసుకుని అంత ముందు టికెట్స్ కొనుక్కుంటే అంత మంచిగా పిల్లలు ఇబ్బంది పడకుండావుంటారు . దీని బట్టి మీరు ఎప్పుడు ఇంటి నుంచి బయటికి వెళ్లాలో తెలుసుకోవచ్చు . ముందుగా వాతావరణం ఎలా ఉందొ చూసుకోండి . మీ పిల్లల ఆరోగ్యం కూడా మీకు ముఖ్యం కాబట్టి . మీ తో పాటు మీ పిల్లల మందులు వాడుతుంటే అవి కూడా తీసుకెళ్లండి . పిల్లలు ఏదైనా అడిగితే ఒకటికి రెండు సార్లు ఆలోచించి కొనండి . మీ పిల్లలకి మీ ఇంటి చిరునామా తెలిసేలా మీ ఇంటి చుట్టపక్కల ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలు పేర్లు నేర్పించండి . ఇవి తప్పకుండా పాటిస్తే మీరు మీ పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు ఏమి ఇబ్బంది గురికావాల్సిన అవసరం లేదు


No comments