Header Ads

ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టడం లేదా ? అయితే ఇవి పాటించండి చాల

ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కంటి నిండా నిద్రపట్టక, మర్నాటికి దినచర్య అసౌకర్యంగా మారుతోందా. ఈ అలవాట్లు మార్చుకుని చూడండి. మనలో చాలామంది పిజ్జా, చిప్స్, బర్గర్.. లాంటి జంక్ ఫుడ్ చూసినప్పుడు నోటిని కట్టేసు కోలేం. దాంతో ఎంత రాత్రయినా తినడానికి సిద్దమవుతాం. కానీ ఆ అలవాటు గ్యాస్ సమ స్యకు దారి తీస్తుంది. ఫలితంగా నిద్రపట్టక ఇబ్బంది తప్పదు. అందుకే సాయంత్రం అయ్యే కొద్దీ అలాంటి పదార్థాలు తినకుండా ఉండాలి.
వ్యాయామం చేయడం మంచి అలవాటే. అలాగని రాత్రిళ్లు ఇంటికొచ్చాక వ్యాయామం చేయాలనే నియమం మాత్రం సరైంది కాదు. వ్యాయామం చేసినప్పుడు శరీర ఉష్ణోగ్రతా, దాంతోపాటూ జీవక్రియల వేగం పెరుగు తుంది. నిద్రపోవాల్సిన శరీరం మరింత ఉత్సా హంగా మారుతుంది. ఈ మార్పు పొద్దుటి పూట మంచిదే కానీ, రాత్రిళ్లు కాదు. కాబట్టి ఆ సమయంలో వ్యాయామం వద్దు. • సాధారణంగా పడకగదిలో టీవీ పెట్టు కుంటాం.

ఇష్టమైన సినిమా, సీరియల్ .. ఏదయినా సరే చూస్తుండిపోతాం. దాంతో సమయం గడిచిపోతుంది. అలాగే భయం, హింస ఉన్న సన్నివేశాలు చూశాక మనకు తెలియకుండానే మానసికంగా ఆందోళన చెందుతాం. ఇవన్నీ నిద్రపై ప్రభావం చూపు తాయి. అందుకే రాత్రిళ్లు టీవీ చూసే సమ యాన్ని తగ్గించుకోవాలి. బదులుగా నిద్రపో యేముందు కాసేపు ధ్యానం చేయాలి లేదా పుస్తకాన్ని చదవాలి. మానసిక సాంత్వన ఉంటుంది.

చాలామంది రాత్రిళ్లు మెలకువగా ఉండి పనులు చేసుకుంటారు. ఇంటికీ ఆఫీసు పని తెచ్చుకుంటారు. కానీ అది ఒత్తిడినే కాదు, నిద్రలేమినీ పెంచుతుంది. వాటిని అధిగమిం చాలంటే దినచర్య విషయంలో పక్కా ప్రణా ళిక ఉండటం చాలా అవసరం. పనుల్ని దానికి తగినట్లుగా పూర్తి చేసుకోవాలి.


నిద్ర సరిపోకపోవడం, రాత్రిళ్లు ఎంత ప్రయత్నించినా నిద్రపట్టకపోవడం, పగలు మత్తుగా అనిపించడం.. ఏదో తెలియని ఆందోళన ఇవన్నీ నిద్రలేమి(ఇన్‌సోమ్నియా)సమస్యకే కిందకే వస్తాయి. పేరు ఏదైనా... ఈ తరహా ఇబ్బందిని మనం కేవలం నిద్రలేమికి సంబంధించిన సమస్యగా భావించి, ఆరాత్రి ఎలా గడపాలి... ఎలా నిద్రపోవాలి అని ఆలోచించి శతవిధాలా ప్రయత్నిస్తాం. కానీ ఆరోగ్య నిపుణులు చెబుతున్న మాట వేరు. ఇన్‌సోమ్నియా అనేది వ్యాధి కాదట. జ్వరం, నొప్పిలా మరో సమస్య వల్ల పైకి కనిపించే లక్షణం మాత్రమేనట. అసలు సమస్య ఏంటో, దాని మూలాలు ఎక్కడున్నాయో తెలిస్తే ఇన్‌సోమ్నియాను సులభంగా వదిలించుకోవచ్చు అంటున్నారు. సాధారణంగా ఇన్‌సోమ్నియా రావడానికి యాభైశాతం వరకూ... మానసిక సమస్యలే కారణం. ఒత్తిడి బాధించినప్పుడు, ఆందోళన వేధించినప్పుడు నిద్ర గాలికి ఎగిరిపోయి సాధారణంగా ఈ సమస్య తలెత్తుతుంది.

మొదట కొన్ని రోజులు నిద్రలేమి బాధిస్తుంది. దాంతో సహజంగా మనలో ఉండే జీవగడియారంలో మార్పులు సంభవించి క్రమంగా రాత్రిళ్లు నిద్రపట్టడం తగ్గిపోతుంది. ఆ సమస్య నుంచి తాత్కాలికంగా బయపడేందుకు ఏదో వ్యాయామాలు చేయడం, కాఫీలు తాగడం, ఎక్కువ సేపు మంచంపై ఉండి అటూఇటూ దొర్లడం వంటివి చేస్తారు. దీంతో పరిస్థితి ఇంకా దిగజారుతుందే కానీ ఏమాత్రం మెరుగుపడదు. అలా కాకుండా ఎంత సేపు నిద్రపోతారో అంత సేపే నిద్రపొండి. తెల్లారి ఏడింటికి నడకకు వెళ్లాలనుకుంటే వెళ్లిపొండి. రాత్రి మీరు ఒంటిగంటకు పడుకున్నా సరే మీరు ఏడింటికి నడకకు వెళ్లడం అనేది తప్పనిసరి. మీరు ముందే పడుకున్నా ఈ టైంటేబుల్‌ని మాత్రం మిస్‌కావొద్దు. ఇలా మీ దినసరిని ఒక పద్ధతిలోకి తీసుకొస్తే కొన్ని రోజులకు మీ నిద్రా సమయం అదుపులోకి వస్తుంది. మంచి నిద్రతో ఒత్తిడి కారణంగా వచ్చే ఇబ్బందులు కూడా తగ్గుతాయి.

No comments