Header Ads

పోయిన బ్యాగ్ ను తిరిగిసంపాదించిన టీ.సీ , అమెరికా అమ్మాయి కృతజ్ఞతలు

ఇద్దరు రైల్వే ట్రైన్ టికెట్ కలెక్టర్ ( టీటీఈలు) తమ నిజాయితీని చాటి, అమెరికా అమ్మాయి నుంచి మరియు రైల్వే అధికారులు నుండి అభినందనలు అందుకున్నారు. వివరాల్లోకి వెళితే అమెరికా దేశానికి చెందిన షాయదాహోమా రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ నుంచి జైపూర్‌కు రైలులో ప్రయాణించారు. తాను దిగేటప్పుడు తన విలువైన బ్యాగ్‌ను రైలు కంపార్ట్‌మెంట్‌లో మరచిపోయారు. దీంతో ఆమె వెంటనే జైపూర్ రైల్వే స్టేషన్ పోలసుల అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే అప్పటికే ఉదయ్‌పూర్- జైపూర్‌ట్రైన్ బయలుదేరిపోయింది. ఆ మహిళ నుంచి ఫిర్యాదు అందుకున్న టీటీఈ శర్మ , ఆమె ఫోన్ నెంబర్ కూడా తీసుకుని ఆ సమాచారాన్ని వెంటనే ఉదయపూర్ రైల్వే టీటీఈ కరణ్ పన్వర్‌కు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన కరణ్ ఉదయ్‌పూర్‌కు ఖజురహో ఎక్స్‌ప్రెస్ రాగానే బ్యాగు మిస్సయిన కంపార్ట్‌మెంట్‌లో తనిఖీలు చేశారు.




అదృష్టవశాత్తూ ఆ బ్యాగు ఆమె బెర్త్ పైనే ఉంది. ఎవరో ప్రయానికురాలి బ్యాగ్ అనుకుని ఆ బ్యాగ్ ని ఎవరు ముట్టుకోలేదు  .   ఈ విషయం తెలుసుకున్న శర్మ , ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సమాచారాన్ని ఆ అమెరికా యువతికి వాట్సప్‌లో తెలిపారు. సరిగ్గా ఆమె విమానాశ్రయంలో ప్లయిట్ ఎక్కేసమయానికి ఈ బ్యాగును శర్మ ఆమెకు అందించగలిగారు. విలువైన బ్యాగు తిరిగి దక్కినందుకు ఆమె శర్మకు కృతజ్ఞతలు తెలిపారు.ఇంత నిజాయితీ కల ఆఫీసర్ ను ఆమె మెచ్చుకున్నారు. కాగా ఈ బ్యాగును ఆ మహిళకు చేరవేసినందుకు రైల్వే జనరల్ మేనేజర్ టీపీ సింగ్ ఆ ఇద్దరు టీటీఈలను అభినందించారు. శర్మ గారిని కరణ్ గారికి రైల్వే ఉద్యోగులు సన్మానం చేసి అభినందించారు .



అయితే ఆ అమెరికా యువతి కృతజ్ఞతలు చెప్పి ఈ సారి ఆ ఇద్దరి టీ.సీ లు ఈ సారి అమెరికా కి వస్తే తప్పకుండా తనకి తెలియచేయాలి అని , తనే అమెరికా మొత్తం తిప్పి చూపిస్తాను అని ,తన సొంత అతిధి లాగ చూసుకుంటాను అని . ఆ బ్యాగ్ లో చాల విలువైన వస్తువలు తో పాటు తన అమ్మగారికి కోసం కొన్న ఒక చీర కూడా వుంది అని . బ్యాగ్ తిరిగివచ్చినందుకు తన అమ్మగారు కూడా  కృతజ్ఞతలు చెప్పమన్నారు అని ఆ అమెరికా యువతి తెలియచేసింది.

No comments