Header Ads

అభిమాని మెసేజ్ కి సమంత ఇచ్చిన ఫన్నీ రిప్లై

సినీ నటి సమంత వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె నటించిన సినిమాలు చాలా పెద్ద హిట్లు గా నిలిచాయి. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నటీమణి లో ఒకరు సమంత, తమ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ ఇవ్వటంతో పాటు అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటారు. తాజాగా ఓ అభిమాని ట్వీట్ చేసి ఫోటోపై సమంత ఆసక్తికరంగా స్పందించారు. ఓ వ్యక్తి సమంతను పెళ్లి చేసుకున్నట్టుగా గ్రాఫిక్స్‌ లో ఎడిట్‌ చేసిన ఫొటో ఇప్పటికే వాట్సాప్ లో వైరల్ అయ్యింది . ఈ విషయం సమంత దాకా చేరింది చివరికి. ఒక ట్విట్టర్ వినియోగదారుడు అల్లు అర్జున్‌ అడిక్ట్‌ అనే ట్విటర్ అకౌంట్‌లో పోస్ట్ చేసి ఏంటిది..? అంటూ కామెంట్ చేశారు..?




ఈ ఫన్నీ ఫోటోషాప్ లో చేసిన ఫొటోపై స్పందించిన సమంత ‘తొలి చూపులోనే ప్రేమించుకున్నాం, వారం క్రితం పారిపోయాం. ఈ ఫోటో ఎలా లీకైందో అర్థం కావట్లేదు’ అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చారు. సమంత ఇచ్చిన రిప్లై పై సినీ ప్రముఖులు కూడా సరదాగా స్పందిస్తున్నారు. ఇటీవల యు టర్న్‌, సీమరాజ సినిమాల షూటింగ్‌ను పూర్తి చేసిన సమంత, సూపర్‌ డీలక్స్‌ షూటింగ్ లో పాల్గొంటున్నారు. తను నటించిన  రంగస్థలం , అభిమన్యుడు , మహానటి చాలా పెద్ద హిట్లు అయిన సంగతి తెలిసిందే .



No comments