పెళ్లిపై వస్తున్న రూమర్స్‌పై అందరికి వివరించిన తమన్నా
సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతున్న ప్రచారాలలో ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ముఖ్యంగా సెలబ్రిటీల ప్రేమ, పెళ్లికి సంబంధించి సామాజిక మాధ్యమాలలో వచ్చే వార్తలపై క్లారిటీ ఉండకపోవడంతో అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హీరోయిన్ తమన్నా పెళ్లి చేసుకోబోతోదంటూ వస్తున్న వార్తలు తెలిసిందే. ఆల్రెడీ నిశ్చితార్థం కూడా అయిందని, ఆమె ఓ డాక్టర్ని పెళ్లి చేసుకోబోతున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు విపరీతంగా హల్చల్ చేస్తున్నాయి. గతంలో కూడా తమన్నాపై ఇటువంటి వార్తలు వ్యాపించడం, ఆ తర్వాత తమన్నా ఖండించడం వంటివి జరిగాయి. తాజాగా మరోసారి తమన్నా.. తన పెళ్లి వార్తలను ఖండిస్తూ ట్వీట్ చేసింది. అయితే ఈసారి కాస్త ఘాటుగానే స్పందించింది తమన్నా.
తన పెళ్లిపై వచ్చిన వార్తలకి తమన్నా తన ట్వీట్ ద్వారా సమాధానం ఇచ్చింది. ఒక రోజు క్రికెటర్, ఒక రోజు యాక్టర్, ఓ మరో డాక్టర్. ఈ రూమర్స్ వింటుంటే నేనను భర్త కోసం షాపింగ్ చేస్తున్నానా అనే భావన అందరిలో కలుగుతుంది. నా వ్యక్తిగత విషయాలకి సంబంధించి ఎలాంటి ఆధారం లేకుండా వార్తలు రాస్తే అస్సలు ఒప్పుకోను. నేను సింగిల్‌గా చాలా సంతోషంగా ఉన్నా. నా తల్లిదండ్రులు పెళ్లి కొడుకు కోసం వెతకడం లేదు.
ప్రస్తుతం నేను నా సినిమాలతో ప్రేమలో ఉన్నా. నేను షూటింగ్ చేస్తున్న సమయంలో వచ్చిన ఈ వదంతులు విని షాక్ అయ్యాను. అవి ఎక్కడి నుంచి వస్తాయో నాకు ఏ మాత్రం అర్థం కావడం లేదు .మీరు ఇలా రూమర్ లు సృష్టించి చేసే పని గౌరవప్రదంగా లేదు. నేను పెళ్లి అనే బాటలో ప్రయాణం చేయాలనుకున్నప్పుడు తప్పకుండా అందరికి తెలియజేస్తాను. అప్పటి వరకు బేస్ లెస్ రూమర్స్ స్ప్రెడ్ చేయోద్దు.
మరోసారి ఇదే విషయాన్ని స్పష్టంగా చెబుతున్నా. నా పెళ్లి ఇప్పటి వరకు నిశ్చయం కాలేదు. ఆధారాలు లేకుండా వస్తున్న వార్తలకు ఇక నైన స్వస్తి పలకండి. ఇప్పటి వరకు వచ్చిన వార్తలు కొందరి ఊహాజనిత కథనం మాత్రమే’ అని తమన్నా పేర్కొన్నారు. ప్రస్తుతం ఎఫ్ 2 అనే మల్టీ స్టారర్ లో వెంకీ సరసన నటిస్తుంది తమ్మూ . దీంతో పాటు కునాల్ కోహ్లి డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమాతో పాటు చిరంజీవి సైరా, హిందీలో ఖామోషి, తమిళ్లో కన్నె కలైమాని అనే సినిమాలు చేస్తుంది.

— Tamannaah Bhatia (@tamannaahspeaks) July 27, 2018

Post a Comment