Header Ads

వాన కాలం లో మీరు రోడ్ పక్కన ఇవి తింటున్నారా అయితే ఒక సారి ఆలోచించండి

ఎండా కాలం తాపం నుండి తట్టుకోవడానికి పండ్లు మరియు పండ్ల రసాలు ఎక్కువగా తీసుకుంటాం. ఎండాకాలం తరువాత వచ్చే వానాకాలంలో మాత్రం రోడ్ల పక్కన అమ్మే పండ్లు, పండ్ల రసాలను తీసుకోకుండా ఉండడం మంచిది అని డాక్టర్ల సలహా. ఎందుకంటే వానాకాలంలో వచ్చే వాతావరణ మార్పులు వలన గాలి కలుషితం అవుతుంది. ఇదే గాలి తాకడం వలన పండ్లు కలుషితం అవుతాయి ఇవి మన ఆరోగ్యం మీద చెడు ప్రభావం చూపుతాయి అని డాక్టర్లు చెబుతున్నారు. పండ్లు తీసుకోవాల్సి వస్తే బాగా శుభ్రం చేసి తినాలి అని సలహా ఇస్తున్నారు.




ఇక వాన కాలం రావడం తోనే మొదలు అయ్యే అనేక సమస్యలలో ఒకటి కలుషితమైన నీరు . దీనితోపాటు నగరవాసుల ఆహార అలవాట్లు మారుతున్నాయి. సాయంత్రపు వేళలలో తినుబండారాలను మనం బయట తినడానికి అలవాటు పడాల్సి వస్తోంది. పని ఒత్తిడి కావచ్చు , సమయం లేకపోవడం కావచ్చు , గంటలతరబడి ప్రయాణం. ఇలా కారణాలు ఏవైనా కడుపు నింపుకొనేందుకు. రోడ్డు పక్కన తోపుడు బండ్లపై దొరికే ఆహారమ్మీద ఆధార పడుతున్నారు. నగరంలోనూ ఈ తరహా చిరు వ్యాపారులు పెరిగిపోయారు. కొందరైతే మధ్యాహ్నం భోజనాన్నీ అందిస్తున్నారు. ఈ తిండి ఆరోగ్యకరం కాదని జాతీయ పోషకాహార సంస్థ హెచ్చరిస్తోంది. రహదారుల పక్కన లభించే ఆహారపదార్థాలు ఎంతవరకు ఆరోగ్యకరమనే అంశాన్ని ఎన్‌ఐఎన్‌ గతంలో పరీక్షించింది. కోసి ఉంచిన ఉల్లిపాయలు, మిరపకాయలు, మూతల్లేని ఆహార నిల్వ పాత్రలతో రోగాల బారిన పడే ప్రమాదం ఉందని సర్వే అనంతరం స్పష్టం చేసింది. ఈ ఆహారం తయారీ, సరఫరాలో శుచి, శుభ్రత పాటించడం లేదని, రోగాల బారిన పడే ప్రమాదం ఉందని పేర్కొంది. ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో బండి తిండి విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

తోపుడు బండ్ల మీద తినుబండారాలు అమ్ముకునే వ్యాపారులకు ప్రభుత్వ యంత్రాంగం చొరవ తీసుకొని శుచి... శుభ్రత నేర్పింది. ఇందుకోసం ప్రత్యేక శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టింది. స్టార్‌ హోటల్‌ నుంచి కాకా హోటల్‌ వరకూ గుర్తింపు లేనిదే ఆహారం అమ్మరాదనే నిబంధన పెట్టిన జీహెచ్‌ఎంసీ.. మరెందుకో రోడ్డుపక్కన అమ్మేవారు నిబంధనలు ఉల్లంఘిస్తున్నా పట్టించుకోవడంలేదు. వారికి శిక్షణ ఇవ్వాలనే ధ్యాస కొరవడింది. క్షేత్రస్థాయిలోని జీహెచ్‌ఎంసీ అధికారులకు ఈ వ్యాపారాలు అక్రమ ఆదాయవనరుగా మారాయి. ఎంతో కొంత మామూళ్లు దండుకొని.. చూసీచూడనట్లు వదిలేస్తూ నగరవాసులను ఆనారోగ్యంపాలు చేస్తున్నారు. ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ), ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌(ఐహెచ్‌ఎం), నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట వంటి సంస్థల సహకారంతో వీధుల్లో తిండి అమ్మే వ్యాపారులకు శిక్షణ ఇప్పించడంపై దృష్టి సారించడం అవసరం.

* రహదారులు పక్కన తోపుడు బండ్ల నిర్వాహకులు తప్పనిసరిగా చేతులకు గ్లౌజులు ధరించాలి.
* దుమ్ము ఉన్న ప్రాంతం, మురుగు కాల్వల పక్కన బండిని ఉంచి తిండి పెట్టవద్దు.
* ప్రతి వంటకం మీద తప్పనిసరిగా మూతలు వేసే ఉంచాలి.
* ముందుగానే ఉల్లిగడ్డలు, మిరపకాయలు, కొత్తిమీర కోసి ఉంచవద్దు.
* వంట చేసేవారు, పానీపూరి, తినుబండారాలు అందజేసేవారు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
* ఆరోగ్యకరమైన వంటలు చేసి.. వడ్డించేలా వారికి శిక్షణ ఇప్పించాలి. స్టార్‌ హోటల్లో మాదిరి నెత్తిన క్యాప్‌(టోపీ) ఉండాలి. వినియోగదారులున్నప్పుడే గ్లౌజులు వేసుకోవడం.. తర్వాత తీసి పక్కన పెట్టడం.. మళ్లీ వినియోగించడం చేయకూడదు.
* శుద్ధి చేసిన నీటిని అందించాలి.

ఏ కాలం లో తినుబండారాలను బయట తిన్నా పర్వాలేదు గాని , వర్షాకాలం లో మటుకు ఒకటి రెండు సార్లు ఆలోచించండి. నీరు కలుషితం అయ్యి ఉండవచ్చు , నూనె ఎలాంటిది వాడుతున్నారో , తయారు చేసే ప్రక్రియ , చుట్టూ పక్కల పరిస్థితి . ఈగలు , దోమలు . ఇలాంటివి ఏమి లేకుండా చూసుకోండి . డబ్బు కొంచం ఎక్కువ ఖర్చు అయినా పర్వాలేదు గాని మంచిగా ఉన్న తినుబండారాల్లో మాత్రమే తినండి

No comments